జన హృదయపు నేత - మానవత్వపు పతాక ..!

కడదాకా నమ్మిన విలువల కోసం కట్టుబడిన మహోన్నత మానవుడు పారికర్. భ్రష్టుపట్టిన రాజకీయాలలో కడదాకా నిబద్ధతతో బతికిన అతికొద్ది ఎన్నదగిన నాయకులలో ఆయన ఒకరు. అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టి..కష్టపడి ఐఐటీ చదివి ..అత్యున్నతమైన ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి..అనంతరం దేశ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి..అనుకోకుండా రాజీనామా చేసిన అరుదైన నాయకుడు. భూతద్దం పెట్టి వెతికినా నిజాయితీ కలిగిన పొలిటికల్ లీడర్లు కనిపించడం లేదు. మాఫియా కనుసన్నలలో మార్కెట్ నడుస్తున్న సమయంలో ప్రజాస్వామ్యం బతికే ఉందని ఆశించడం అత్యాశే అవుతుంది. 13 డిసెంబర్ 1955లో మనోహర్ గోపాలకృష్ణ పారికర్ గోవాలోని మపూసాలీలో జన్మించాడు. ప్రతిష్టాత్మకమైన ఐఐటీని పూర్తి చేసి సీఎం పదవిని నిర్వహించిన వారిలో దేశంలోనే ఆయన ప్రథముడు. ప్రజలను ప్రేమించిన ఈ మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి భేషజాలకు తావీయకుండా నమ్మిన వాటికి కట్టుబడ్డారు. చావు పలకరించే వరకు తనకు తోచిన రీతిలో పని చేసుకుంటూనే ఉండి పోయారు. భారతీయ జనత...