పోస్ట్‌లు

జనవరి 12, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

విమెన్స్ టీ20 టీమ్ ఇదే

చిత్రం
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టును ఇండియన్ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన భారత జట్టుకు ఆల్ రౌండర్ హర్మన్‌ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూర్కీ బ్యాట్స్‌ విమెన్ రిచా ఘోష్‌కు జట్టులో చోటు దక్కింది. వచ్చే నెల 21న సిడ్నీలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య మ్యాచ్‌తో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. గ్రూప్‌-ఎలో భారత జట్టుతోపాటు ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు కూడా హేమలత కళా సారథ్యంలోని మహిళా సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఈ పోరు జరగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 31న కాన్‌బెర్రాలో ఇండియా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 12న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇలా ఉంది. హర...

సరిలేరు కలెక్షన్స్ అదుర్స్

చిత్రం
అనిల్ సుంకర, దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, నాచురల్ బ్యూటీ రష్మిక మందన్న, డైనమిక్ లేడీ విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, తదితరులు కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా వసూళ్ళలో దూసుకు పోతోంది. అటు ఓవర్సీస్ లో సైతం బొమ్మ రఫ్ఫాడిస్తోంది. ఈ మేరకు సినిమా బృదం సక్సెస్ మీట్ కూడా పెట్టారు. ఇదిలా ఉండగా ఒకే ఒక్క రోజులోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ప్రిన్స్ మహేష్ బాబు నటన పీక్ లో ఉండటం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు సమాచారం. నైజాంలో 8.66 కోట్లు, సీడెడ్‌లో 4.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.4 కోట్లు, కృష్ణాలో 3.07 కోట్లు, గుంట...

ప్రియాంకపై పీకే ప్రశంస

చిత్రం
భారతీయ రాజకీయ వ్యూహకర్త, జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య స్వరం మారుతోంది. తన గొంతును సవరించుకుంటున్నారు. బీజేపీతో మైత్రీ బంధాన్ని కొనసాగిస్తోంది జేడీయూ. ఇదే సమయంలో నితీష్ కుమార్ మోడీతో చెలిమి చేస్తుండగా విచిత్రంగా అదే పార్టీకి చెందిన ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. దీంతో ఇరు పాటీలు మధ్య మరింత దూరం పెరుగుతోంది. మరో వైపు ప్రశాంత్ కిషోర్ తాజాగా రాహుల్ గాంధీపై, ప్రియాంకా గాంధీపై ప్రసంశలు కురిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన హస్తం పార్టీ నేతలను పొగడ్తతల్లో ముంచెత్తారు. ఈ ఆందోళనకు సారథ్యం వహించిన ఆ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రశాంత్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజల పక్షాన నిలిచిన తీరు అభినందనీయమని అభిప్రాయ పడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని ఆయన కోరారు. కాగా బిహార్‌లో స...

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజీనామా

చిత్రం
ప్రముఖ నటుడు, వైసీపీ హార్డ్ కోర్ లీడర్, వైఎస్ జగన్ ఫాలోయర్..ప్రస్తుత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పృథ్వీ  రాజ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఛానల్ లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడంటూ ఆడియో టేపులో సంభాషణలు బయట పడ్డాయి. దీంతో వెంటనే పృథ్వీ పై విచారణ జరిపించాలంటూ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ కూడా జరిపారు. నివేదికను చైర్మన్ కు సమర్పించారు. అయితే దీనిపై పృథ్వీ రాజ్ తీవ్రంగా స్పందించారు. తనపై అంతా కుమ్మక్కై కుట్ర పన్నారని ఆరోపించారు. తాను తాగానని అంటున్నారని, తన బ్లడ్ తీసుకోవచ్చని చెప్పారు. ఆయన కొన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. పృథ్వీ వీడియో విడుదల చేశారు. నా మీద లేని పోనివి ప్రచారం చేశారని అధిష్టానానికి చెప్పాను. ఒక వేళ వాయిస్‌ నాదైతే ఆఫీసులో అలా ప్రవర్తించాడా, అవుట్‌ సైడ్‌ అలా మాట్లాడుకున్నారా అని ఆలోచిస్తారు. విచారణలో పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. రైతు కష్టాల గురించి నాకు తెలుసు. నా మాటల వల్ల నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెబుతున్నా. పోస...

ఢిల్లీలో త్రిముఖ పోటీ

చిత్రం
దేశ రాజధానిలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నాయి. ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని కమలం సీరియస్ గా రంగంలోకి దిగింది. పోయిన పరువును కాపాడు కోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఆయా ప్రధాన పార్టీలకు ఝలక్ ఇచ్చే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇది ఇలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల వాగ్ధానాలు, ప్రత్యర్థులపై విమర్శలు, ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార ఆమ్‌ ఆద్మీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నీ తానై, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లకు మరింత దగ్గరగా చేరువ అయ్యేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై ఆప్‌ ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ‘లగే రహో కేజ్రీవాల్‌’ అంటూ సాగే ఈ ప్రచారం గీతం ఢిల్...