భాషా కోవిదుడికి జగన్ బహుమానం ..!

తెలుగు బాష అంటేనే మొదటగా గుర్తుకు వచ్చే పేరు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. ఆయన ఏది మాట్లాడినా అది వినసొంపుగా ఉంటుంది. సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదుడిగా, సకల కళా వల్లభుడిగా, రాజస్య భాషకు ప్రేమికుడిగా..కళా పిపాసిగా, చేయి తిరిగిన రచయితగా ఆయనకు పేరుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి సరైన సమయంలో అరుదైన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా అపారమైన అనుభవం కలిగిన యార్లగడ్డకు అరుదైన కానుకను అందించారు. ఏకంగా ఏపీ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడిగా నియమించారు. దీంతో తెలుగు భాష పట్ల సీఎం కు ఉన్న అభిమాననాన్ని చాటుకున్నారు. ఆయన మాట్లాడితే ఇంకా వినాలని అనిపిస్తుంది . విషయాన్నీ పూస గుచ్చినట్లు చెప్పడం ఆయనకు మాత్రమే చెల్లింది. సభను నడిపించాలన్నా, సక్సెస్ చేయాలన్నా యార్లగడ్డ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎందరో. ఆయన నిత్యా పాఠకుడు. మంచి వక్త. అంతకు మించి ప్రయోక్త ..రచయిత. కవి ..అనువాదకుడు ..రాజకీయ నాయకుడు ..ఇంకా చెప్పాలంటే తెలుగు సంస్కృతి , సాంప్రదాయం , నాగరికత అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఈ అరుదైన పదవి దక్కడం వల్ల రాబోయే రోజుల్లో మాతృ భాషకు మంచి రోజులు వస్తాయని భా...