రేఖ..ఐకాంతిక..!

ఏళ్లు గడిచి పోతున్నవి. తరాలు మారినా ఆమె మాత్రం అంతకంతకూ వెలిగిపోతూనే ఉన్నది. అందమే ఈర్ష్య పడేంత స్థాయికి చేరుకున్న ఆ అద్భుతమైన సౌందర్యరాశి ..భారతీయ సినిమా జగత్తులో చెరగని సంతకంలా..విరబూసే పూవులా..వెన్నెలలా వెంటాడుతూనే ఉన్నది భానురేఖా గణేషన్ అలియాస్..రేఖ. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సౌందర్యరాశికి 64 ఏళ్లు. ఇంకొకరైతే కదలలేరు..మెదలలేరు..ఉన్నచోటనే ఉండిపోతారు. కానీ ఈ రేఖ అలా కాదు. నిత్య చైతన్యం..అద్భుత సౌందర్యం..ముగ్ధ మనోహర రూపం. తనతో వచ్చిన వాళ్లు..వెనక్కి వెళ్లిపోయారు. వెండితెర కొద్ది సేపే..ఆ తర్వాత ఇంకొందరు వస్తారు. అదంతే ..ఆ రంగమే అంత. రంగుల ప్రపంచం..కదిలే లోకం..పాత్రలే కీలకం. అక్కడ ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో..ఎప్పుడు అనుకోకుండా పాతాళంలోకి వెళ్లిపోతారో చెప్పలేరు. అదంతా మాయ.. ఒక్కసారి తగిలితే జీవితాంతం వదలని రోగంలా వెంటాడుతుంది. లావారిస్ పాటల్ని విన్నప్పుడల్లా రేఖ మనల్ని దిగంతాలలోకి తీసుకెళుతుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన సినిమాలు చూసినప్పుడల్లా ఏదో ఆవేశం తన్నుకు వస్తుంది. ఇంత గొప్ప కాంబి...