రేఖ..ఐకాంతిక..!
ఏళ్లు గడిచి పోతున్నవి. తరాలు మారినా ఆమె మాత్రం అంతకంతకూ వెలిగిపోతూనే ఉన్నది. అందమే ఈర్ష్య పడేంత స్థాయికి చేరుకున్న ఆ అద్భుతమైన సౌందర్యరాశి ..భారతీయ సినిమా జగత్తులో చెరగని సంతకంలా..విరబూసే పూవులా..వెన్నెలలా వెంటాడుతూనే ఉన్నది భానురేఖా గణేషన్ అలియాస్..రేఖ. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సౌందర్యరాశికి 64 ఏళ్లు. ఇంకొకరైతే
కదలలేరు..మెదలలేరు..ఉన్నచోటనే ఉండిపోతారు. కానీ ఈ రేఖ అలా కాదు. నిత్య చైతన్యం..అద్భుత సౌందర్యం..ముగ్ధ మనోహర రూపం. తనతో వచ్చిన వాళ్లు..వెనక్కి వెళ్లిపోయారు. వెండితెర కొద్ది సేపే..ఆ తర్వాత ఇంకొందరు వస్తారు. అదంతే ..ఆ రంగమే అంత. రంగుల ప్రపంచం..కదిలే లోకం..పాత్రలే కీలకం. అక్కడ ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో..ఎప్పుడు అనుకోకుండా పాతాళంలోకి వెళ్లిపోతారో చెప్పలేరు. అదంతా మాయ.. ఒక్కసారి తగిలితే జీవితాంతం వదలని రోగంలా వెంటాడుతుంది. లావారిస్ పాటల్ని విన్నప్పుడల్లా రేఖ మనల్ని దిగంతాలలోకి తీసుకెళుతుంది.
కదలలేరు..మెదలలేరు..ఉన్నచోటనే ఉండిపోతారు. కానీ ఈ రేఖ అలా కాదు. నిత్య చైతన్యం..అద్భుత సౌందర్యం..ముగ్ధ మనోహర రూపం. తనతో వచ్చిన వాళ్లు..వెనక్కి వెళ్లిపోయారు. వెండితెర కొద్ది సేపే..ఆ తర్వాత ఇంకొందరు వస్తారు. అదంతే ..ఆ రంగమే అంత. రంగుల ప్రపంచం..కదిలే లోకం..పాత్రలే కీలకం. అక్కడ ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో..ఎప్పుడు అనుకోకుండా పాతాళంలోకి వెళ్లిపోతారో చెప్పలేరు. అదంతా మాయ.. ఒక్కసారి తగిలితే జీవితాంతం వదలని రోగంలా వెంటాడుతుంది. లావారిస్ పాటల్ని విన్నప్పుడల్లా రేఖ మనల్ని దిగంతాలలోకి తీసుకెళుతుంది.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన సినిమాలు చూసినప్పుడల్లా ఏదో ఆవేశం తన్నుకు వస్తుంది. ఇంత గొప్ప కాంబినేషన్ ఆ కాలంలో ఏ ఒక్క హీరో హీరోయిన్ కు దక్కలేదంటే అతిశయోక్తి కాదు. అంతులేని మలుపులు ..అనుకోని ఆరోపణలు ఆమె లైఫ్ కాన్వాస్ మీద అలా వుండి పోయాయి. అయితేనేం..ఇంతటి అందం కలిగిన నటీమణి జీవిస్తున్న కాలంలో మనమూ ఉన్నందుకు అదృష్టవంతులమనే అనుకోవాలి. ఎక్కడికి వెళ్లినా ఇన్నేళ్లయినా ఎప్పటిలాగే ఉన్నారని ప్రశ్నోపప్రశ్నలు..ఆమె నుంచి నవ్వే సమాధానం. ఒకరి గురించి ఆలోచించేంత టైం లేదు. నాదైన ప్రపంచమే నన్ను ఇలా వుండేలా చేస్తోందంటారు రేఖ. దక్షిణాదిలో పుట్టిన ఆమె దేశవ్యాప్తంగా తక్కువ కాలంలోనే పరిణతి చెందిన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలతో పాటు ప్రతీకార పాత్రల్లో నటించి మెప్పించింది. ఖూబ్ సూరత్, ఖూన్ భరీ మాంగ్ చిత్రాలు అవార్డులను తెచ్చి పెట్టాయి. ఉమ్రావ్ జాన్ లోని దేవదాసి పాత్ర ఆ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఉత్తమ జాతీయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. 1970 శతాబ్ధమంతా ఆమెదే అని చెప్పాలి. అంతలా ఆమె సినిమాలు ఆడాయి. 40 సంవత్సరాల సుదీర్ఘమైన వృత్తిపర జీవితంలో 180 సినిమాలకు పైగా నటించింది. ఇందులో కొన్ని ఆడాయి..మరికొన్ని నిరాశ పరిచాయి.
కానీ రేఖ ప్రతి సినిమాలో తనను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేసింది. సమాంతర సినిమాలతో పాటు కళాత్మకపరమైన సినిమాల్లో కూడా నటించింది. ఇవన్నీ ఆర్థికంగా బాగా ఆడాయి. లైఫ్‌లో కొంచెం నిలదొక్కుకునేందుకు సహాయ పడ్డాయి. రేఖ తల్లిదండ్రులు జెమిని గణేషన్, పుష్పవల్లిలు ఇద్దరూ సినిమాల్లో రాణించిన వారే. అదే ఒరవడి ..వారసత్వం రేఖకు లభించింది. తండ్రి ఆ స్థాయిలో ఉన్నా ..ఆమె గురించి పట్టించుకోలేదు. 1966లో రంగులరాట్నం తెలుగు సినిమాలో నటించింది. 1969లో విజయవంతమైన కన్నడ సినిమా గోదల్లి లో డాక్టర్ రాజ్ కుమార్ సరసన నాయకగా రంగప్రవేశం చేసింది. అదే సంవత్సరంలో హిందీ సినిమా అంజనాసఫర్ లో నటించింది. 1970లో రెండు మూవీస్ విడుదలయ్యాయి. తెలుగులో అమ్మకోసం, హిందీలో సావన్ బాధోన్లు ఉన్నాయి. హిందీ రాక పోవడంతో నేర్చుకోవాల్సి వచ్చింది సినిమాల కోసం. సావన్ బాధోన్ సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా హిందీ సినిమా రంగంలో పేరు వచ్చేసింది. ఎన్నో సినిమాలలో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. విషయ ప్రాధాన్యత లేనివే ..అందమైన ఆడపిల్లల పాత్రలే ఉన్నాయి. 1976లో అమితాబ్‌తో కలిసి నటించిన దో అంజానే మూవీలో వాంఛ కలిగిన స్త్రీ పాత్ర పోషించింది. నటనా ప్రాధాన్యత కలిగిన సినిమా ఇది. భారీ విజయాన్ని మూటగట్టుకుంది.
1978లో ఘర్ చిత్రలో రేఖ బలత్కార బాధితురాలిగా నటించి మెప్పించింది. సామూహిక అత్యాచారంతో బాధించబడి..ప్రేమించే భర్త మూలంగా తిరిగి బలాన్ని పుంచుకునే పెళ్లయిన ఆర్తి పాత్రను జనం ఆదరించారు. భర్త పాత్రను వినోద్ మెహ్రా పోషించాడు. ఈ చిత్రం రేఖ లైఫ్‌లో ఒక మైలురాయిగా నిలిచి పోయేలా చేసింది. మొదటి సారిగా ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికైంది. ఆ తర్వాత ముకద్దర్ కా సికిందర్ సినిమా ఊహించని దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. అన్ని చిత్రాలకంటే ఈ మూవీనే టాప్‌గా నిలిచింది. దీంతో రేఖకు మరింత పేరు వచ్చింది. 1980లో అమితాబ్‌తో కలిసి అనేక సినిమాల్లో కలిసి నటించింది రేఖ. విజయవంతమైన కాంబినేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె రియల్ లైఫ్‌లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. సిల్ సిలా సినిమా రేఖకు గొప్ప పేరు తీసుకు వచ్చింది. అందులోని పాటలన్నీ హిట్ గా నిలిచాయి. ఈ మూవీలో రేఖ అమితాబ్ ప్రేయసి గాను..నిజ జీవితంలో భార్య జయబాధురి భార్య గాను..పాత్రలు పోషించిన ఈ సినిమా ఇద్దరికీ అపకీర్తిని తెచ్చి పెట్టింది. ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె తనను తాను పరిపూర్ణమైన నటిగా మల్చుకుంది. యోగ చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమబద్ధమైన..క్రమశిక్షణ కలిగి ఉండడమే తన ఆరోగ్య రహస్యమని పేర్కొంది.
1981లో ఉమ్రావ్ జాన్ అనే ఉర్దూ చిత్రంలో నటించింది రేఖ. సున్నితమైన వేశ్య పాత్ర ఇది. జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైంది. స్వతంత్ర , కళాత్మక చిత్రాల దర్శకులతో పనిచేసేందుకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. శ్యాం బెనగల్ తీసిన కలియుగ్, రమేష్ తల్వార్ బసేరా, ఏక్ హి భూల్ , జీవన్ ధారా, ఉత్సవ్ , ఇజాజత్ సినిమాలు సక్సెస్ మూటగట్టుకున్నాయి. ఖూబ్ సూరత్, ఖూన్ భరీ మాంగ్, ముజే ఇన్సాఫ్ చాహియే వంటి సినిమాల్లో నాయక ప్రాధాన్య పాత్రలో నటించింది. కాగా ఖూబ్ సూరత్, ఖూన్ భరీ మాంగ్ మూవీస్ కు గాను ఫిలిం ఫేర్ అవార్డులు స్వంతం చేసుకుంది. 1990లో రేఖ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంది. వాణిజ్య పరంగా, విమర్శనాత్మకంగా అపజయం మూటగట్టుకున్న సినిమాల్లో నటించింది. హేమమాలిని, రాఖి తల్లి లేదా అత్త పాత్ర పోషిస్తే..రేఖ మాత్రం మాధురి దీక్షిత్, రవీనా టాండన్ లతో పోటీ పడి నటించింది. ఖిలాడియోంకా ఖిలాడి , మీరానాయర్ డైరెక్షన్ చేసిన కామసూత్రలో ఉపధ్యాయినిగా పాత్ర పోషించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఉత్తమ సహాయ నటి పురస్కారం స్వంతం చేసుకుంది.
2001లో రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన లజ్జ సినిమాలో అతి సాధారణ పల్లెటూరి మహిళ రామ్ దులారీగా మనీషా, మాధురి, అనిల్ కపూర్లతో కలిసి నటించింది. ఆమె నటనకు గాను ఎన్నో నామినేషన్లు అందుకుంది. శ్యాం బెనగల్ జుబేదాలో కరిష్మా కపూర్‌తో కలిసి నటించింది. ప్రీతి జింతాతో కలిసి కుందన్ షా తీసిన దిల్ హై తుమ్హారా లో పరిణితి చెందిన నటిమణిగా పేరు తెచ్చుకుంది. 2003లో రాకేష్ రోషన్ తీసిన కోయి మిల్ గయాలో హృతిక్ రోషన్ తల్లిగా నటించింది. ఉత్తమ సహాయ నటి అవార్డు స్వంతం చేసుకుంది రేఖ. ఆ తర్వాత క్రిష్ మూవీలో మెప్పించింది. 2007లో గౌతమ్ ఘోష్ తీసిన యాత్ర లో వేశ్య పాత్ర పోషించింది. 2010లో భారత ప్రభుత్వం అత్యున్నతమైన పద్మశ్రీతో సత్కరించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముకేష్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది. 1991లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వినోద్ మెహ్రాను పెళ్లి చేసుకుందన్న ప్రచారం జరిగింది..కానీ ఆ విషయాన్ని దూరదర్శన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖండించారు. తనను శ్రేయోభిలాషిగా పేర్కొంది. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా లో ఒంటరిగా జీవిస్తోంది.
ఆమె నటించిన సినిమాల్లో మరిచిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో సావన్ బాధోన్, రాంపూర్ కా లక్ష్మణ్, ఏక్ బేచార, గోరా ఔర్ కాలా, ధర్మ, కహానీ కిస్మత్ కి, నమక్ హరామ్, ప్రాణ్ జాయే పర్ వచన్ జాయే, ధరం కరమ్, ధర్మాత్మ, ఆక్రమన్, దో అంజానే, సంతాన్, కబీలా, ఆలాప్, ఖూన్ పసీన, ఆప్ కి ఖాతిర్, ఇమాన్ ధర్మ, గంగాకీ సౌగంధ్, ఘర్, ముకద్దార్ కా సికిందర్, ఘర్, కర్తవ్య, సుహాగ్, మిస్టర్ నట్వర్ లాల్, జాని దుష్మన్, ఆంచల్, జుదాయి, కాళిఘటా, జల్ మహల్, ఖూబ్‌సూరత్, అగ్రిమెంట్, కలియుగ్, ఉమ్రావ్ జాన్, ఏక్ హి భూల్, విజేత , జీవన్ ధారా, నిషాన్, అగర్ తుమ్ నా హోతే, బిందియా చంకేగి, ఫాస్లే, ముసాఫిర్, లాకెట్, ప్యార్ కీ జీత్, సూర్మ భోపాలి, బీవీ హోతో హైసి, భ్రష్టాచార్, పూల్ బనే అంగారే, మేడమ్ ఎక్స్, ఖిలాడియోన్ కా ఖిలాడి, ఉడాన్, బులంది, ముజే మేరే బీవీ సే బచావ్, భూత్, కోయి మిల్ గయా, బచ్కే రెహనా బాబా, క్రిష్, కుడియోం కా హై జమానా, ఓం శాంతి ఓం, సాదియాన్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఎంతో ప్రతిభ కలిగిన నటీగా కాకుండా అద్భుతమైన సౌందర్య రాశిగా వినుతికెక్కింది రేఖ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి