సినీ కార్మికుల కోసం భారీ సాయం

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు తెలుగు సినిమా రంగం తీవ్ర ఒడిదుడులకు లోనైంది. ఎక్కువ మంది కార్మికులు ఈ పరిశ్రమనే నమ్మకున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు వేలాది మంది ఉన్నారు. తెరపై కొందరు మాత్రమే హీరోలుగా చెలామణి అవుతుండగా మిగతా కార్మికులంతా తెర వెనకే ఉండి పోతున్నారు. వీరి సంక్షేమం కోసం గతంలో దివంగత నటుడు, దర్శకుడు ప్రభాకర్ రెడ్డి ఎంతగానో కృషి చేశారు. ప్రస్తుతం మా మూవీస్ అసోసియేషన్ పని చేస్తోంది. దీనికి ప్రముఖ నటుడు చిరంజీవి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నటుడు నరేష్ కొనసాగుతున్నారు. తాజాగా కరోనా ఎఫెక్ట్ భారీగా ఉండడంతో ఉన్న పళంగా సినిమా షూటింగ్స్ లను బంద్ చేశారు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఏడాది పొడవునా ఏదో ఒక సినిమా నడుస్తూ ఉండడంతో దీనినే నమ్ముకుని బతుకులీడుస్తున్న వారంతా దిక్కు తోచని స్థితిలోకి నెట్టబడ్డారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలంటూ భారతదేశ ప్రధానమంత్రి మోదీజీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఆపత్కాల సమయంలో కోట్లాది మందికి వైద్య పరీక్షలు చేయడం, మందులు సరఫరా, ప్రాథ...