పోస్ట్‌లు

ఆగస్టు 27, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఒక్క రూపాయికే సువిధ న్యాప్కిన్స్ - మోడీ సర్కార్ నిర్ణయం..!

చిత్రం
కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వం మంచి పనులు చేస్తోంది. సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి మహిళలు, యువతులు, బాలికల సంరక్షణ కోసం చర్యలు చేపట్టింది. ఎక్కువగా పేద మహిళలు, కుటుంబాలు ప్రతి నెలా వచ్చే నెలసరి కోసం వాడే సానిటరీ ప్యాడ్స్ ను కొనుగోలు చేయలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్లాది బాధిత మహిళలకు తీపి కబురు అందించారు. ఇక నుంచి కేవలం ఒకే ఒక్క రూపాయి ఇస్తే చాలు ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న వేలాది జనరిక్ మందుల షాప్స్ లలో ఇవి లభిస్తాయి. ఆ మేరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి న్యాప్కిన్స్ ను అందుబాటులో ఉంచుతోంది. ఇందు కోసం సర్కార్ కోట్లాది నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే లక్షలాది మంది మార్కెట్లో అధిక ధరలకు అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ను కొనుగోలు చేయలేక పోతున్నారు. దీంతో అనుకోని ఇబ్బందులతో పాటు చెప్పుకోలేని రోగాలకు గురవవుతున్నారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మహిళల కోసం ఇప్పటికే రాయితీపై గ్యాస్ సిలిండర్లతో పాటు గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఒక్క రూపాయి తో ఇవ్వాలని నిర్ణయించింది. రెండున్నర రూపాయలు ఉన్న దా...

కొలువులు రావు..కడుపులు నిండవు ..అర్ధాకలితో నిరుద్యోగులు

చిత్రం
ఓ వైపు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేలాదిగా ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ బలిదానాలు, త్యాగాలు, పోరాటాల సాక్షిగా కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో లెక్కలేనన్ని కొలువులున్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థులు , అభ్యర్థులు వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా సర్కార్ పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. పొద్దస్తమానం బంగారు తెలంగాణ భజన తప్ప భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టడం లేదంటూ నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా మందికి ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఉన్నప్పటికీ , వయసు విషయంలో నిర్దేశించిన ఏజ్ దాటి పోతుండడంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. అయినా మానవతా దృక్పథంతో ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టి, సమాజాన్ని బాగు పరిచే క్రమంలో ఉన్నత విద్య దోహద పడుతుంది. చదువు ఒక్కటే కాకుండా జనానికి. లోకానికి మేలు చేకూర్చే పరిశోధనలు అటకెక్కినవి. ఒకప్పుడు యూనివర్సిటీలు చదువులకు కేరాఫ్ గా ఉండేవి. ఇప్పుడు అవి రాజకీయాలకు, పాలకుల బంధువులకు కేరాఫ్ గా మారాయి. వారికి వంత పాడే వాళ్ళు ఉన్నత పదవులలో కొనసాగుతున్నా...

యురేనియం వద్దే వద్దు.. హ్యాట్స్ ఆఫ్ యూ..శేఖర్ కమ్ముల..!

చిత్రం
దర్శకులు కూడా మనుషులే. సినిమా అనే సరికల్లా హీరోలు, హీరోయిన్లు మాత్రమే గుర్తుకు వస్తారు. ఈ ఒక్క జాడ్యం మన తెలుగు వాళ్ళకే ఉన్నది. డైరెక్టర్లకు సామాజిక బాధ్యత కూడా ఉన్నదన్న విషయాన్ని మరోసారి గుర్తుకు తీసుకు వచ్చారు ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల. జీవితాన్ని మరింత కళాత్మకంగా  తీసే వారిలో ఆయన కూడా ఒకరు. అప్పట్లో కాశీనాథుని విశ్వనాథ్, భారతీ రాజా, వంశీ, గీత కృష్ణ లాంటి వాళ్ళు ఉండే వాళ్ళు. ఇప్పుడు ఆయనతో మరికొందరు లైఫ్ ను, భావోద్వేగాలను వెండితెర మీద పండిస్తున్నారు. అదే తమిళ సినిమాలో అయితే లెక్కలేనంత మంది క్రియేటివ్ డైరెక్టర్లు ఉన్నారు. వారికి ఎన్నో అవకాశాలు తలుపు తడతాయి. ఇక్కడ ఇలా కాదు. హీరో ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా తీస్తారు.  వీళ్ళు తెరపై హీరోలు ..నిజ జీవితంలో జీరోలు. సినిమాల్లో చిలుక పలుకులు ..కానీ ఆదాయంపైనే మక్కువ ఎక్కువ. సామాజిక భాధ్యతను వీరు స్వీకరించేందుకు ఇష్టపడరు. శీతల పానీయాల వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయని పలువురు హెచ్చరిస్తుంటే, యాడ్స్ లలో నటిస్తూనే ఉన్నారు. ఇక తాజా విషయానికి వస్తే దర్శకుడు శేఖర్ కమ్ముల నల్లమల పై సంచలన కామెంట్స్ చేశారు. దయచేసి నల్లమలలో  యురేనియ...

!..పసిడి పండుతోంది..వెండి వెలుగుతోంది..!

చిత్రం
ఇక అందనంటూ బంగారం ధర పైపైకే వెళుతోంది. రికార్డ్ స్థాయిలో ధరలు పెరుగుతూనే ఉన్నా జనం మాత్రం కొనడం ఆపడం లేదు. హైదరాబాద్ నగరంలోని జ్యుయలరీ షాపులన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా 40 వేల రూపాయలకు చేరుకుంది. మరో వైపు వెండి కూడా సరి లేరు నాకెవ్వరూ అంటోంది. 46 వేలకు చేరుకుంది. దీంతో షేర్ మార్కెట్ రివ్వుమంటూ దూసుకెళుతోంది. ఓ వైపు పసిడి పెరుగుతుంటే , భారతీయ రూపాయి మాత్రం మరింత తగ్గింది. దేశీయ మార్కెట్ లో గోల్డ్ ప్రైజ్ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నది. దేశమంతటా పసిడి ధర అందకుండా వెళుతున్నా, మహిళలు, యువతులు మాత్రం పోటీ పది కొంటున్నారు. రోజు రోజుకు దాని ధర ఇక ఆగలేనంటోంది. వరల్డ్ మార్కెట్ లో ట్రెండ్ పడిపోకుండా ఉండటం, రూపీ బలహీన పడటంతో పసిడి ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. తాజాగా 20 నుంచి ధర తగ్గక పోగా, పెరుగుతూనే వెళుతోంది. కిలో వెండి సైతం 14 వందలు పెరిగింది. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ల తయారీదారుల నుండి డిమాండ్ పెరగడం కూడా ధరల్లో వ్యత్యాసం అగుపిస్తోంది. ఢిల్లీ, ముంబయి మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్ లో పసిడి రానంటోంది. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార...

ప్రేమ పండాలంటే..రొమాన్స్ వుండాల్సిందే..!

చిత్రం
లోకాన్ని ఆవిష్కరించే దారుల్లో ప్రేమ ఒకటవుతే, మరొకటి రొమాన్స్. రెండూ లేకపోతే జీవితం బోర్ కొడుతుంది.ప్రేమ అంటే రెండు గుండెల చప్పుడు. రెండు మనస్సుల మధ్య సాగే సంభాషణ. దానితో అనుసంధానమై పోతే హృదయం పిల్ల కాలువై పరుగులు తీస్తుంది. ఆ కళ్ళల్లో మెరుపు. ఆ కనుల కలనుల్లో సాగే కలల కలబోతలు. ఓహ్ చెప్పుకుంటూ పోతే జీవితం సరి పోదు. మరో జన్మ కావాలి. మనుషుల మధ్య ఇంకా బంధం తెగి పోలేదంటే కారణం ప్రేమ. అంతే కాదు గుండెల్ని సున్నితంగా మీటి సరాగాలు సరిగమలు పలికించే రొమాన్స్ కూడా. రెండూ ఒక దానికొకటి పెనవేసుకుని సాగి పోతూనేఉంటాయి . దీనిని ఆపాలని ప్రయత్నం చేసినా, ఒక్కసారి కమిట్ అయ్యాక ఏ మనసు ఒప్పుకోదు. ఇంకే హృదయం ఉండి పోదు. రెండింటి మధ్యన సన్నని పొర.. తెర లాగా కాపాడుకుంటూ వస్తుంది. అది చెరిగి పోకుండా ఉంటే,  లైఫ్ మరింత గొప్పగా అనిపిస్తుంది. ప్రతి క్షణం కళ్ళలోకి చూసు కోవడం, తెలియకుండా తాకడం కూడా ఎనలేని అనుభవం తోడవుతుంది. ఇది మరిచిపోలేని విధంగా నిత్యం కలిపేలా చేస్తుంది. అందుకే జీవితంలో కోల్పోయినవన్న్నీ సినిమాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. ఇద్దరి మధ్యన ప్రేమ అన్నదే లేకపోతే జీవితం నరకమవుతుంది. లోకం నుంచి వెళ్లి పోవాలన...

సాధించిన విజయం అపూర్వం

చిత్రం
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పసిడి పతకాన్నిచేజిక్కించుకుని, భారత జాతీయ జెండాను సమున్నతంగా ఎగిరేలా చేసిన తెలుగు తేజం పీవీ సింధును ప్రత్యేకంగా అభినందించారు నరేంద్ర మోదీ. పీఎం ను మర్యాద పూర్వకంగా పీవీ సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. ఈ సందర్బంగా మరిన్ని విజయాలు సాధించాలని, దేశం గర్వపడేలా కృషి చేయాలని ఉద్భోదించారు. కష్టపడితేనే గెలుపు దక్కుతుందని, ప్రతి ఒక్కరు సింధును స్ఫూర్తిగా తీసు కోవాలని కోరారు. క్రీడాభి వృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. సింధు సాధించిన గెలుపు సామాన్యమైనది కాదన్నారు. ప్రతి రంగంలో ఆటుపోట్లు ఉండడం సహజమే. ప్రతిదీ యుద్ధమే. పోరాటమే బలం కావాలి. దానినే ఊపిరిగా చేసుకోవాలి. అప్పుడే సక్సెస్ లో ఉన్న మజా అర్థమవుతుంది. ఒక చాయ్ వాలా ఇవ్వాళ ప్రపంచంలోనే,  అత్యున్నతమైన ప్రజాస్వామిక దేశంగా వినుతికెక్కిన ఇండియాకు ప్రధానమంత్రి కాగలిగారు.. ఇలాంటి సామాన్యుల చరిత్రను రాబోయే తరం చదువు కోగలిగేలా ఉండాలి. నిరంతరం కష్టపడగలితే విజయం దానంతట అదే దక్కుతుందన్నారు. ఈ దేశం వీరులను కన్నది. గొప్ప వ్యక్తుల, విజేతల జాబితాలోకి ఎక్కడం అదృష్టమే. ఆకాశం...

కొనేటోల్లకు కొనుక్కున్నంత

చిత్రం
ఒకప్పుడు ఏదైనా కొనాలంటే కిరాణా కొట్టుకు పోయే వాళ్ళు. లేదా వేరే దగ్గర్లో ఉన్న మండలానికో లేదా పట్టణానికో , సంతల్లోకి వెళ్లే వాళ్ళు. కానీ ఇప్పుడు లోకం మారి పోయింది. దునియా అంతా చిన్నదై పోయింది. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఉన్న చోటనే కావాల్సినవన్నీ ఇంటి ముందు వాలి పోతున్నాయి. కావాల్సిందల్లా కొనగలిగే సామర్థ్యం ..చేతినిండా డబ్బులుంటే చాలు. దేనినైనా కొనుగోలు చేసే వీలు ఉన్నది. ఓ వైపు మార్కెట్ రంగం కుదేలవుతున్నది. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం కారణంగా జనం కొనాలంటే ఇబ్బంది పడుతున్నారు. దీంతో రిటైల్ వ్యాపారస్తులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. వినియోగదారులు ,కొనుగోలుదారులు ఎక్కువగా వినోద రంగానికి చెందిన వస్తువులనే ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం ఆశించినంతగా ఇండియన్ మార్కెట్ అంతగా ఊపు అందుకోలేదు. దీంతో విత్త మంత్రి దిద్దు బాటు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ప్రజలు నిత్యం వాడే వస్తువులపై అధికంగా పన్నులు విధించడం తో కొనుగోళ్లు నిలిచి పోయాయి. సబ్బులు, డైపర్లు, న్యాప్కిన్లు, తదితర ప్రోడక్ట్స్ ధరలపై విధించిన జీఎస్టీని తగ్గిస్తోంది. దీంతో కొను...

జోరుగా సాగు..బతుకంత పోరు..!

చిత్రం
ఓ వైపు అనావృష్టి ..ఇంకో వైపు అతి వృష్టి..చెప్పు కోలేనంతటి దుఃఖం కలుగుతోంది. ఆరుగాలం శ్రమించి, రేయనక పగలనక కస్టపడి పండించిన పంటకు చేతికి రాకుండా పోతే ..ఆ బాధ వర్ణనాతీతం. నిన్నటి దాకా నీళ్ల కోసం వేచి చూసిన రైతన్నలకు భారీగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, ఎత్తిపోతల పథకాలు , కాలువలు నిండినా అన్నం పెట్టి ఆకలితీర్చే అన్నదాతలకు మాత్రం ఆవేదన మాత్రమే మిగులుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినా రైతుల పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. తాజాగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కొంత మేరకు ఉపశమనం కలిగినా, పూర్తి స్థాయిలో సాగు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. భూములు సాగు చేయాలంటే , పంటలు పండించాలంటే తడిసి మోపెడవుతోంది. చేసిన రుణాలు తీర్చలేక , అధిక వద్దెలకు అప్పులు తీసుకు వస్తే, చేసిన కష్టం వడ్డీలకే సరి పోతోంది. దీంతో వ్యవసాయం తలకు మించిన భారమవుతోంది. ఇప్పటికే వర్షాలు కురుస్తాయని రైతులు సాగు చేసిన పంటలు చేతికి వచ్చేలా లేవు. ఇటీవల పెద్ద ఎత్తున వర్షాలు కురియడంతో , భారీ ఎత్తున సాగు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఎగువన కర్ణాటక , మహారాష్ట్ర ల నుండి కృష్ణా , గోదావరి నదుల్లో...

ఉద్యోగాలు బారెడు..భర్తీ మూరెడు..వయసై పోతున్నా స్పందించని సర్కార్

చిత్రం
బలిదానాలు, పోరాటాలు, ఆత్మహత్యలు చేసుకుని.. లాఠీ దెబ్బలు తిని , జైలు పాలై , కేసులు నమోదై ..కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాడ లేకుండా పోయింది. స్వతంత్ర భారతంలో  ఇంతటి దారుణమైన, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కున్న సందర్భాలు లేనే లేవు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలోనైనా కొన్ని ఉద్యోగాలు పొందారు. కానీ స్వరాష్ట్రంలో అభ్యర్థులు, నిరుద్యోగులు లక్షలాది మంది కొలువుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అలుపెరుగని పోరాటం చేసింది. అన్ని కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చిన వెంటనే కొలువులు భర్తీ చేస్తారని అంతా ఆశించారు. కానీ ఈ రోజు వరకు దాని ఊసే లేకుండా పోయింది. అయితే బంగారు తెలంగాణా లేకుంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. ఐటి  అంటూ జపం చేస్తోంది. ఇప్పటికే రెండు లక్షలకు పైగా వివిధ శాఖలలో ఖాళీలు ఉన్నవి. వాటిని నింపకుండా తాత్సారం చేస్తూ వస్తోంది. ఇక సమాజాన్ని ప్రభావితం చేసే యూనివర్సిటీల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఈరోజు వరకు ప...