సాధించిన విజయం అపూర్వం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పసిడి పతకాన్నిచేజిక్కించుకుని, భారత జాతీయ జెండాను సమున్నతంగా ఎగిరేలా చేసిన తెలుగు తేజం పీవీ సింధును ప్రత్యేకంగా అభినందించారు నరేంద్ర మోదీ. పీఎం ను మర్యాద పూర్వకంగా పీవీ సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. ఈ సందర్బంగా మరిన్ని విజయాలు సాధించాలని, దేశం గర్వపడేలా కృషి చేయాలని ఉద్భోదించారు. కష్టపడితేనే గెలుపు దక్కుతుందని, ప్రతి ఒక్కరు సింధును స్ఫూర్తిగా తీసు కోవాలని కోరారు. క్రీడాభి వృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు.

సింధు సాధించిన గెలుపు సామాన్యమైనది కాదన్నారు. ప్రతి రంగంలో ఆటుపోట్లు ఉండడం సహజమే. ప్రతిదీ యుద్ధమే. పోరాటమే బలం కావాలి. దానినే ఊపిరిగా చేసుకోవాలి. అప్పుడే సక్సెస్ లో ఉన్న మజా అర్థమవుతుంది. ఒక చాయ్ వాలా ఇవ్వాళ ప్రపంచంలోనే,  అత్యున్నతమైన ప్రజాస్వామిక దేశంగా వినుతికెక్కిన ఇండియాకు ప్రధానమంత్రి కాగలిగారు.. ఇలాంటి సామాన్యుల చరిత్రను రాబోయే తరం చదువు కోగలిగేలా ఉండాలి. నిరంతరం కష్టపడగలితే విజయం దానంతట అదే దక్కుతుందన్నారు. ఈ దేశం వీరులను కన్నది. గొప్ప వ్యక్తుల, విజేతల జాబితాలోకి ఎక్కడం అదృష్టమే.

ఆకాశంలోనే కాదు అన్నిటా మహిళలు కూడా భాగస్వామ్యులు కావాలి. ప్రతి ఒక్కరు అవకాశాలను అంది పుచ్చు కోవాలి. చదువు ఒక్కటే వారి గమ్యాలను, ఆశలను, కోరికలను తీర్చుకునేలా చేస్తుంది. యువత కోసం ఎన్నో పథకాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఉన్నాయి. టెక్నాలజీ పరంగా చోటు చేసుకున్న మార్పులు కూడా ఎంతో మేలు కలిగిస్తూ, జీవితంలో స్థిరపడేలా చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను అభివృద్ధి చేసే పనిలో మోదీ సర్కార్ నిమగ్నమైంది. అయితే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ క్రీడలను బలోపేతం చేయగలిగితే సింధు లాంటి వాళ్ళు ఎందరో వెలుగులోకి వస్తారు. 

కామెంట్‌లు