భారత్‌లో పాపులర్ అంకురాలు ఇవే

ఇండియాలో స్టార్టప్‌లు సక్సెస్ బాట పడుతున్నాయి. ప్రారంభం నుండే డిఫరెంట్ ఐడియాస్ బేస్ చేసుకుని కంపెనీలుగా ఎదుగుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్లకు, అంకురాలకు శ్రీకారం చుట్టాలని ప్రయత్నించే వాళ్లకు ఇప్పటికే ఆ రంగంలో సక్సెస్ అయిన వాటిని చూస్తే మీరెలా మార్కెట్‌లో నిలదొక్కుకోవచ్చో తెలుస్తుంది. స్వయాన అవగతమవుతుంది. 2018-2019 సంవత్సరానికి గాను 53 స్టార్టప్‌లు టాప్ పొజిషన్‌లో నిలిచాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 2008లో ప్రారంభమైన మోమో స్టార్టప్ లో 470 మిలియన్ల పెట్టుబడి పొందింది. ఢిల్లీ, చెన్నై, కొచ్చి, తదితర ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసింది మోమో. ఈ స్టార్టప్ టాప్ వన్ గా నిలిచింది. ఓలా క్యాబ్స్ రెండో స్థానంలో నిలిచింది. దీనిని కర్ణాటకలోని కోరమంగలలో ఏర్పాటు చేశారు. 3.8 మిలియన్ల ఫండింగ్ పొందింది. దీనిని 2010లో ఏర్పాటు చేశారు. బెంగళూరు కేంద్రంగా 2010లో అడ్రస్ హెల్త్ పేరుతో స్టార్టప్ ప్రారంభమైంది. హెల్త్ పరంగా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు పొందవచ్చు దీని ద్వారా. 1.5 మిలియన్ల ఫండింగ్ పొందింది ఈ స్టార్టప్. ఇండియా వ...