సుంద‌ర్ పిచ్చెయ్ ఔదార్యం - 405 కోట్లు వ‌దులుకున్న వైనం

ప్ర‌పంచ సెర్చింగ్ దిగ్గ‌జ కంపెనీకి ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారిగా (సిఇఓ) బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న చెన్నైకి చెందిన సుంద‌ర్ పిచ్చెయ్ అద్భుత నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌పంచంలోని మేధావులు, ఉద్యోగులు, సిఇఓలు, మేనిజింగ్ డైరెక్ట‌ర్లు, ఛైర్మ‌న్లు, బిజినెస్ టైకూన్స్ , టీం లీడ‌ర్లు, మెంటార్స్, ట్రైన‌ర్స్ , క్రీడాకారులు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు త‌లొంచుకునేలా మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఆయ‌న‌కు గూగుల్ కంపెనీ సంవ‌త్స‌రానికి 270 కోట్ల‌కు పైగా వేత‌న రూపంలో అంద‌జేస్తోంది. అంతేకాకుండా అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తోంది. తాజాగా స‌ద‌రు కంపెనీ యాజ‌మాన్యం ..ఇత‌ర సౌక‌ర్యాల కింద సుంద‌ర్ పిచ్చెయ్‌కి 405 కోట్లు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఈమెయిల్ ద్వారా స‌ద‌రు సిఇఓకు అధికారికంగా ఇంటిమేష‌న్ ఇచ్చింది.

దీనిని ప‌రిశీలించిన సుంద‌ర్ ..త‌న‌కు ఆ డ‌బ్బులు వ‌ద్దంటూ తిరిగి రిప్ల‌యి ఇచ్చారు. పిచ్చెయ్ తీసుకున్న ఈ డిసిష‌న్ ను చూసి యాజ‌మాన్యం విస్మ‌యానికి గురైంది. ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. కోటి రూపాయ‌లు ఇస్తామంటే తీసుకునేందుకు కోట్లాది మంది రెడీగా ఉంటారు. కానీ సిఇఓ స్థాయిలో వున్న ఈ టెక్కీ దిగ్గ‌జం మాత్రం మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఏకంగా 400 కోట్ల‌కు పైగా యాజ‌మాన్య‌పు ఆఫ‌ర్ ను సున్నితంగా తిర‌స్క‌రించారు. ఈ విష‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అయింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వేత‌నాలు అందుకుంటున్న సిఇఓల‌లో గూగుల్ సిఇఓగా ఉన్న సుంద‌ర్ పిచ్చెయ్ మొద‌టి స్థానంలో ఉన్నారు.

రెండో స్థానంలో జుక‌ర్ బ‌ర్గ్, మైక్రోసాఫ్ట్ సిఇఓ స‌త్య నాదెళ్ల ఉన్నారు. ఇంత భారీ మొత్తంలో వ‌చ్చిన డ‌బ్బుల‌ను వ‌ద్ద‌ను కోవ‌డం ఆయ‌న ప‌నితీరును, ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని తెలియ చేస్తుంద‌ని ఇత‌ర సంస్థ‌ల అధిపతులు, ఉన్న‌త స్థానంలో ఉన్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. గూగుల్ సంస్థ ఇపుడు వ‌ర‌ల్డ్ వైడ్‌గా టాప్ పొజిష‌న్‌లో ఉంది. దీనికి అనుబంధంగా గూగుల్ ప్ల‌స్, యూట్యూబ్, త‌దిత‌ర వాటితో గూగుల్ షాపింగ్, గూగుల్ ప్లేతో కొత్త ఫీచ‌ర్స్ ను తీసుకు వ‌స్తోంది. గూగుల్‌లో జాబ్ దొర‌క‌డం అంటే మ‌రు జ‌న్మ ఎత్తిన‌ట్టే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సంస్థ సిఇఓకు భారీ ఎత్తున పోటీ నెల‌కొంది. వేలాది మందిని దాటుకుని సిఇఓగా ఎంపిక‌య్యారు సుంద‌ర్ పిచ్చెయ్.

కోట్లాది రూపాయ‌ల జీతం, లెక్క‌లేనంత సౌక‌ర్యాలు, ఏది కావాల‌నుకుంటే అది, ఎక్క‌డికి వెళ్లాల‌నుకుంటే అది క్ష‌ణాల్లో ప్రొవైడ్ చేసే యాజ‌మాన్యం ..ఇన్నీ వున్నా అద‌న‌పు సౌక‌ర్యాల కింద కోట్లాది రూపాయ‌లు ఆయ‌న‌కు ద‌క్కుతాయి. ఇప్ప‌టికే వేత‌నాల రూపంలో కోట్లాది రూపాయ‌లు పొందుతున్నారు. ఆయ‌న స్థానంలో ఇంకొక‌రు ఎవ‌రున్నా ..ఈ భారీ ఆఫ‌ర్ ను పొందేవారే. కానీ సుంద‌ర్ మాత్రం తాను నిజ‌మైన భార‌తీయుడిన‌ని నిరూపించుకున్నారు. ప్ర‌పంచాన్ని త‌న నిర్ణ‌యంతో విస్తుపోయేలా చేశారు. హ్యాట్సాఫ్ సుంద‌ర్ పిచ్చెయ్. వుయ్ ప్రౌడ్ ఆఫ్ యు.

కామెంట్‌లు