శాంసంగ్ వద్దు..ఆపిల్ ముద్దు

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందిన వారెన్ బఫెట్ ఉన్నట్టుండి విస్మయానికి గురి చేశారు. ఎలా సంపాదించాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, ఎక్కడ తగ్గాలో, ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ పెట్టాలో నిత్యం సూచించే ఈ ఆర్థిక యోధుడు ఉన్నట్టుండి వైరాగ్యానికి లోనయ్యారు. ఈ మధ్య ఇంకెంత కాలం సంపాదించే దానిపై ఎందుకు కాన్‌సెంట్రేషన్ చేయాలంటూ ఒక సందర్భంలో చెప్పారు కూడా. ఇదే సమయంలో అత్యంత ధనవంతుల జాబితాలో నెం. 1 స్థానంలో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం దాదాపు 88 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. ఉన్నట్టుండి బిలియనీర్ వారెన్ బఫెట్ ఓ అద్భుతం చేశాడు. ఆపిల్ పెట్టుబడిదారుడుగా ఉన్న ఆయన ఎట్టకేలకు స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. అదీ శాంసంగ్‌కు బై చెప్పి, ఆపిల్ ఐ ఫోన్‌ను తీసేసుకున్నారు. సుదీర్ఘ కాలం నుంచి ఆయన ఉపయోగిస్తున్న శాంసంగ్ హెవెన్ ఫ్లిప్ ఫోన్‌ను పక్కకు పడేసి తాజాగా ఐఫోన్ 11 తీసుకున్నారు. అయితే ఐఫోన్ 11లో ఏ రకం మోడల్ ఉపయోగిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఆపిల్ సంస్థలో 5.6 శాతం వాటాను బఫెట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీని వ...