ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా - టీవీల అమ్మకాల్లో కోట్ల ఆదాయం

భారతీయ మార్కెట్ ను చైనా ఉత్పత్తులు శాసిస్తున్నాయి. ఇంట్లో వాడే ప్రతి వస్తువులన్నీ ఇపుడు చైనాలో తయారైనవే కావడం విశేషం. అవన్నీ తక్కువ ధరకు లభిస్తుండడంతో భారతీయులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. అటు ఆన్ లైన్‌లో ఇటు ఆఫ్ లైన్‌లో ఇబ్బడి ముబ్బడిగా కొంటున్నారు. ఈ ఏడాదిలో 7 వేల 224 కోట్ల విలువ చేసే టెలివిజన్లను ఇండియన్స్ కొనుగోలు చేశారు. ఇందులో సగానికి పైగా చైనా నుంచి తయారై, దిగుమతి చేసుకున్నవే కావడం గమనార్హం. ఓ వైపు స్మార్ట్ ఫోన్లు ఇంకో వైపు టీవీలు లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చారు ఇండియన్స్. ఆధునిక ప్రపచంలో టీవీ లేని ఇల్లు ఉండదంటే నమ్మలేం. కేబుల్ ఆపరేటర్లు వచ్చాక టీవీలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. ఈ మేరకు 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 7 వేల 224 కోట్ల విలువైన టెలివిజన్లను భారత్ దిగుమతి చేసుకుందని ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. ఇంకా లెక్కకు రాని టీవీ సెట్లు ఎన్నో. ముఖ్యంగా దిగుమతి చేసుకున్న వాటిలో చైనాలో తయారై మన దేశానికి వచ్చిన ఉత్పత్తుల్లో టీవీలు టాప్. దిగుమతుల్లో సగానికి పైగా చైనా నుంచి తీసుకున్నవే . 3 వేల 807 కోట్...