దివికేగిన కార్పొరేట్ దిగ్గజం - బికె బిర్లా కన్నుమూత
భారతీయ పారిశ్రామిక రంగంలో తనకంటూ ఓ బ్రాండ్‌ను, ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న బిర్లా సంస్థల అధినేత, ఛైర్మన్ బి.కె. బిర్లా ఇక సెలవంటూ వెళ్లి పోయారు. పారిశ్రామిక పరంగా, వ్యాపార వేత్తగా, విద్య పట్ల అచంచలమైన ప్రేమ కలిగిన విద్యా వేత్తగా , దాతగా బిర్లా కలకాలం గుర్తుండి పోతారు. ఆయన మరణం దేశానికి, ప్రపంచ పారిశ్రామిక రంగానికి తీరని లోటుగా భావించాలి. దేశ వ్యాప్తంగా బిర్లా పేరుతో ఎన్నో ఆలయాలను నిర్మించారు. మరికొన్నింటిని పునరుద్ధరించారు. ప్రపంచంలోనే అత్యం గొప్పనైన కళాశాలలను, నాణ్యమైన విద్యను, దేశానికి కావాల్సిన అద్భుతమైన వ్యక్తులను తయారు చేసిన వ్యక్తిగా బిర్లా చిరస్మరణీయుడు. ఇండియాలో పేరెన్నికగన్న విద్యా సంస్థల్లో ఒకటిగా ఆయన స్థాపించిన బిట్స్ పిలానీ ఒకటి. ఇండియా అంటేనే మొదట జ్ఞాపకానికి వచ్చేది టాటాలు, బిర్లాలే. బిర్లా పూర్తి పేరు బసంత్ కుమార్ బిర్లా. 98 ఏళ్ల వయసులో ముంబయిలో కన్ను మూశారు.
దేశ వ్యాప్తంగా 25 విద్యా సంస్థలు, ఎన్నో కంపెనీలను , దాతృత్వ సంస్థలను బిర్లా ఏర్పాటు చేశారు. కుటుంబీకులను శోక సంద్రంలో ముంచెత్తారు. కోల్‌కతాలోని బిర్లా పార్క్‌లోని ఆయన స్వంత గృహం వద్దనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తాత మృతి చెందడంతో ఆయన మనుమడు కుమార మంగళం బిర్లా ముంబయికి తీసుకెళ్లినట్లు సమాచారం. దాతృత్వానికి, ఇతరులకు సాయం చేయడంలో దేశంలో ఆయనను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఘన్ శ్యామ్ దాస్ బిర్లాకు 1921లో జన్మించారు బికె బిర్లా. చిన్నప్పటి నుంచి అన్ని కంపెనీలను చూసుకుంటూ పెరిగారు. 15 ఏళ్ల వయసులోనే కేశోరాం సిమెంట్స్ కంపెనీకి ఛైర్మన్ అయ్యారు. అప్పటి నుంచి నేటి దాకా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. పత్తి, పాలిస్టర్, నైలాన్, పేపర్, షిప్పింగ్, సిమెంట్, టీ, రసాయనాలు, ఫ్లై వుడ్, ఇలా ఎన్నో ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలను విరివిగా స్థాపించారు. ఇండో, ఇథియోపియన్ టెక్స్ టైల్స్ షేర్ కంపెనీల పేరుతో భారీ సంయక్త సంస్థను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనదే.
ఏ భారతీయ ఇండస్ట్రియలస్టు చేయలేని పనిని బికె బిర్లా చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఇథియోపియా రాజు హెయిలీ సెలాసీ చేతుల మీదుగా ఆర్డర్ ఆఫ్ మెనిలిక్ అవార్డును అందుకున్నారు. ఆ దేశంలో అదే అత్యున్నత పురస్కారంంగా భావిస్తారు. 1941లో సర్లాను పెళ్లి చేసుకున్నారు బిర్లా. వీరిద్దరికి పెళ్లి చేసింది మహాత్మా గాంధీ. ఇది కూడా ఓ చరిత్రే. ఆయనకున్న ఒకే ఒక్క కుమారుడు ఆదిత్య విక్రమ్ బిర్లా 1995లో మరణించాడు. దీంతో ఎవరు వారసుడు అని చర్చలు రాక ముందే బికె బిర్లా ముందుగానే వీలునామా రాశాడు. దేశ మంతటా విస్తరించి వున్న విద్యా సంస్థలు, ఆలయాలు, ఆశ్రమాలు, బంగ్లాలను తన కుటుంబీకుల పేరు మీద రాసిచ్చారు. అందరికీ సుపరిచితమైన బిట్స్ పిలానీని తన స్వంత ఊరైన రాజస్థాన్‌లో స్థాపించారు. ఖతర్‌లో బిర్లా పబ్లిక్ స్కూల్‌ను, ముంబయిలో బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌ను ఏర్పాటు చేశారు. వ్యాపార రీత్యా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన స్వంతంగా పుస్తకాలు కూడా రాశారు. అందులో స్వంత్ సుఖయా పేరుతో స్వీయ చరిత్రను రాశారు. ఇది ఎంతో పాపులర్ పుస్తకంగా పేరు తెచ్చుకుంది. బి.కె.బిర్లా ఒక తరానికి సరిపడా తన అనుభవాన్ని ఈ దేశానికి మిగిల్చి వెళ్లారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి