ఇండియ‌న్ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా - టీవీల అమ్మ‌కాల్లో కోట్ల ఆదాయం

భార‌తీయ మార్కెట్ ను చైనా ఉత్ప‌త్తులు శాసిస్తున్నాయి. ఇంట్లో వాడే ప్ర‌తి వ‌స్తువుల‌న్నీ ఇపుడు చైనాలో త‌యారైన‌వే కావ‌డం విశేషం. అవ‌న్నీ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుండ‌డంతో భార‌తీయులు ఎగ‌బ‌డి కొనుగోలు చేస్తున్నారు. అటు ఆన్ లైన్‌లో ఇటు ఆఫ్ లైన్‌లో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా కొంటున్నారు. ఈ ఏడాదిలో 7 వేల 224 కోట్ల విలువ చేసే టెలివిజ‌న్ల‌ను ఇండియ‌న్స్ కొనుగోలు చేశారు. ఇందులో స‌గానికి పైగా చైనా నుంచి త‌యారై, దిగుమ‌తి చేసుకున్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు స్మార్ట్ ఫోన్లు ఇంకో వైపు టీవీలు లేకుండా ఉండ‌లేని ప‌రిస్థితికి వ‌చ్చారు ఇండియ‌న్స్. ఆధునిక ప్ర‌ప‌చంలో టీవీ లేని ఇల్లు ఉండ‌దంటే న‌మ్మ‌లేం. కేబుల్ ఆప‌రేట‌ర్లు వ‌చ్చాక టీవీలు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యాయి. ఈ మేర‌కు 2018-2019 ఆర్థిక సంవ‌త్స‌రంలో 7 వేల 224 కోట్ల విలువైన టెలివిజ‌న్ల‌ను భార‌త్ దిగుమ‌తి చేసుకుంద‌ని ప్ర‌భుత్వ అధికారిక గ‌ణాంకాల్లో వెల్ల‌డైంది. ఇంకా లెక్క‌కు రాని టీవీ సెట్లు ఎన్నో.

ముఖ్యంగా దిగుమ‌తి చేసుకున్న వాటిలో చైనాలో త‌యారై మ‌న దేశానికి వ‌చ్చిన ఉత్ప‌త్తుల్లో టీవీలు టాప్. దిగుమ‌తుల్లో స‌గానికి పైగా చైనా నుంచి తీసుకున్న‌వే . 3 వేల 807 కోట్ల విలువైన టీవీల‌ను కొనుగోలు చేశారు. వియ‌త్నాం నుంచి 2 వేల 317 కోట్లు, మ‌లేషియా నుంచి 750 కోట్లు, హాంకాంగ్ నుంచి 81 కోట్లు, తైవాన్ నుంచి 56 కోట్ల విలువైన ఉత్ప‌త్తుల‌ను దిగుమ‌తి చేసుకున్నాం. 7 వేల కోట్ల‌కు పైగా విలువైన టీవీల‌ను ఈ అయిదు దేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంది భార‌త్. 2018-2019లో 4 వేల 962 కోట్ల విలువైన టీవీల‌ను స్వంతం చేసుకుంది. ఈ మేర‌కు కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ లోక్ స‌భ‌లో వివ‌రాలు వెల్ల‌డించారు. దిగుమ‌తులు చేసుకోకుండా ఉండేందుకు గాను, దేశీయంగా టీవీలు త‌యారు చేసేందుకు ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

దేశీయంగా ఎల్ఇడి, ఎల్‌సిడి, ప్లాస్మా టీవీల‌కు అత్య‌ధిక డిమాండ్ ఉంటోంది. ఇవి నాజుగ్గా, తేలిగ్గా ఉండ‌డం కూడా కార‌ణం. ఎక్కువ ఫీచ‌ర్స్ తో పాటు నాణ్య‌వంతంగా ఉండ‌డం కూడా ప్ర‌యారిటీ ఎక్కువ‌గా ఉండేందుకు దోహ‌ద ప‌డుతోంది. మిగ‌తా దేశాల నుంచి ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేసి ఇక్కడే ఇండియాలో ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిపారు. దీని వ‌ల్ల టైం ఆదా కావ‌డంతో పాటు కొంత మేర‌కు ఖ‌ర్చు త‌గ్గుతుంది. ఆ ఆదాయం ప్ర‌భుత్వానికి ల‌భిస్తుంది. అంతేకాకుండా వేలాది మందికి ఉన్న చోట‌నే ఉపాధి దొరికే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు. వియ‌త్నాం నుంచి చేసుకునే దిగుమ‌తుల‌పై ఎలాంటి ప‌న్నులు లేని కార‌ణంగా దిగుమ‌తులు మ‌రింత ఎక్కువ‌గా పెరిగాయ‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. ఐసీఈఏ ఈ మేర‌కు తాత్కాలికంగా మూడు నెల‌ల పాటు దిగుమ‌తుల్ని ఆ దేశం నుంచి నిలిపి వేయాల్సిందిగా ఆదేశించింద‌ని పేర్కొన్నారు. చైనా మాత్రం కూల్‌గా త‌న ఉత్ప‌త్తుల‌తో ప్ర‌పంచ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!