ఆ రూపం అపురూపం .. ఆమె జ్ఞాపకం అజరామరం - మదిలో మధుబాల..!

భారతీయ సినీ జగత్తులో చెరిగిపోని జ్ఞాపకం ఆమె.. అందం..అభినయం..వినయం..కలగలిస్తే మధుబాల. ఇవాళ ప్రేమికుల రోజు..అలాగే వెండితెర వెన్నెల..మధుబాల పుట్టిన రోజు. ఎన్నేళ్లయింది చూసి..మొఘెల్ ఏ ఆజం సినిమా ఎప్పటికీ క్లాసిక్కే. ఆ చూపు..ఆ కళ్లు..ఆ రూపం..ఇంకెవ్వరికీ రాదు..దేవుడు సృష్టించిన అద్భుతాల్లో మధుబాల ఒకరు. ఆమె అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహల్వి. 14 ఫిబ్రవరి 1933లో ఢిల్లీలో జన్మించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. తన అందంతో మెస్మరైజ్ చేశారు. నటిగా దిగంతాలను వెలిగించారు. ఈ ప్రయాణంలో మలుపులు ఎన్నో..జ్ఞాపకాలు మరెన్నో. తలుచుకుంటే చాలు ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎనలేని కీర్తిని మూటగట్టుకున్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1950 నుండి 1960 మధ్య కాలంలో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తన సమకాలికులైన నటీమణులు నర్గీస్, మీనాకుమారిలతో ..సమానంగా గౌరవం పొందారు. సాంప్రదాయ ముస్లిం దంపతుల 11 మంది సంతానంలో మధుబాల ఐదవ వ్యక్తి. తండ్రి అతావుల్లా ఖాన్ పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో తన ఉద్యోగాన్ని కోల్పోవడంతో ..తన కుటుంబాన్ని ముంబయ...