పోస్ట్‌లు

ఆగస్టు 30, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

కాసులు కురిపిస్తున్న ఐడియా..!

చిత్రం
దునియాలో ఒకప్పుడు బతకాలంటే సవాలక్ష ఇబ్బందులు. ఇప్పుడు అలాంటి కస్టాలు ఏమీ లేవు. ఎందుకంటే టెక్నాలజీ మారింది. ప్రపంచం చిన్నదై పోయింది. లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. రా రమ్మంటూ ఊరిస్తున్నాయి. కావాల్సిందల్లా ఓపికతో వేచి చూడటమే మిగిలి ఉన్నది. సాంకేతిక రంగంలో చోటు చేసుకున్న పెను మార్పుల దెబ్బకు అన్ని రంగాలు అతలాకుతలమై పోయాయి. వేలాది మందికి కొలువులు దక్కుతున్నా, ఆశించినంతగా అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో వేలాదిగా స్టార్ట్ అప్ సంస్థలు పుట్టుకు వచ్చాయి. ప్రారంభంలో చిన్న గదుల్లో స్టార్ట్ అయి..నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా చూస్తే రోజు రోజుకు చేంజెస్ చోటు చేసుకుంటున్నాయి. ఐటి, ఈ కామర్స్, డిజిటల్ టెక్నాలజీ, సోషల్ మీడియా , టెలికం, ఆయిల్ , జ్యూయలరీ , ట్రాన్స్ పోర్ట్ తదితర రంగాలలో పని చేస్తున్న వారు అభద్రతకు లోనవుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలలో కంపెనీల ఏర్పాటు అన్నది భారీ ఖర్చుతో  కూడుకున్నది. కోట్లాది రూపాయలతో పాటు ఒక్కోసారి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి ఎక్కువ కావడం, ఉద్యోగాల ...

ఇక చాలదా నీ జీవితానికి..!

చిత్రం
మనకో వేదిక కావాలి ఆలోచనలు కట్టిపెట్టి అనుకున్న ప్రచారం కావాలంటే మనకో గ్రూప్ ఉండాలి అందుకు సరిపడినంత లౌక్యం కావాలి  అప్పుడేగా కర్చు లేకుండా అభిమానులు దొరికేది అబ్బో యెంత ఫాలోయింగో అనుకుంటూ మనం ఆక్షర్యానికి గురవుతాం..అంతలోనే మనకెందుకు అనుకుంటూ సాగిపోతాం ..! ఎవరి దారులు వాళ్ళవి ఎవరి లోకంలో వాళ్ళు లోపట ఒకటి ..బయట మరొకటి మెత్తగా పలకరించే ప్లాస్టిక్ నవ్వులు అప్పుడప్పుడు కాసింత సేద దీర్చే మనుషులు మరి మనను గుర్తించాలంటే వాళ్ళను మెస్మరైస్ చేయాలంటే మనకూ ఓ సమూహం కావాలి అది మనతో పాటే సాగేలా మన కనుసన్నలలో ఉండేలా చూసుకోవాలి ...అప్పుడేగా లైక్ లు ..అబ్బో అంటూ కామెంట్లు ఇంకాస్తా ముందుకు వెళితే అహో అంటూ కితాబులు ..! నువ్వు కవి కాదల్చుకున్నవా తక్కువ కాలంలో గొప్పనైన వ్యక్తిగా అంతర్జాలంలో నీ పేరు మారు మోగాలా అయితే నీకు ఎలాంటి ప్రశ్నలు అక్కర్లేదు నీ గురించి పతాక స్తాయిలో గొప్పగా అభివ్యక్తీకరిస్తే చాలు కాస్తంత లౌక్యం ఉంటె సరి ఇంకెందుకు ఆలశ్యం రండి ..పైసా ఖర్చు లేకుండా మహా కవి కాదల్చుకున్నవా ..! అయితే వెంటనే ఓ వేదిక చూసుకో నీకంటూ ఓ గ్రూప్ వెంటేసుకో నిన్ను ప్రశించే వాళ్ళు లేకుండా చూసుకో ఇక..నీవొ...

బ్యాంకుల విలీనం ..ఉద్యోగులు గరం గరం..!

చిత్రం
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ తీరుపై ఇప్పటికే జనం అసంతృప్తితో వున్నారు. పుండు మీద కారం చల్లినట్లు గతంలో మోడీ తీసుకున్న నోట్ల రద్దు దెబ్బకు భారతీయ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లి పోయింది. కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వృద్ధి రేటు పడి పోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేసుకుంటున్న సర్కార్, ఆచరణలోకి వచ్చే సరికల్లా అమలు కావడం లేదు. ఇప్పటికే చిరు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఈరోజు వరకు ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. తాజాగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులను బదిలీ చేసింది. దీంతో ఇండియన్ ఎకానమీ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇంకో వైపు తమ అనుమతి, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఆర్ధిక మంత్రి బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయం తీసు కోవడంపై ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల...

అమరావతిపై రాద్ధాంతం ..బాధితులు ఆందోళకరం

చిత్రం
చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాద్ధాంతం కొనసాగుతూనే ఉన్నది. ఎప్పుడైతే సందింటి జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారో, ఆనాటి నుంచి ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీకి చెందిన ఎంపీ విజయ సాయి రెడ్డి , మంత్రి బొత్స సత్యనారాయణలు ఇప్పటికే కేపిటల్ సిటీగా అమరావతి సరైనది కాదని, దాని స్థానంలో ఇంకో ప్రాంతాన్ని ఎంపిక చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక విజయసాయి రెడ్డి అయితే, ఏకంగా ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షా కు తెలిసే జరుగుతోందంటూ కొత్త ట్విస్ట్ కు తెర లేపారు. ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు, బాధితులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను  తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కలిశారు. ఈ విషయంపై పవన్ అమరావతి విషయంలో బొత్స పై ఫైర్ అయ్యారు. దానిని మార్చవద్దంటూ కోరారు. అంతే కాకుండా బాధితులతో సమావేశ మయ్యారు. బొత్స ముందు వెనుకా అలోచించి మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు సైతం ఎట్టి పరిస్తతుల్లోనూ అమరావతినే కేపిటల్ సిటీగా ఉంచాలని, మార్పులు చేస్తే తీవ...

దుమ్ము రేపుతున్న రాధమ్మ కూతురు టైటిల్ సాంగ్ - రేవంత్ అదుర్స్

చిత్రం
తెలుగు బుల్లితెర మీద జీ తెలుగు కు ఓ ఇమేజ్ ఉన్నది. సీరియల్స్ తో పాటు వినోదాన్ని అందించడంలో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. తాజగా స్టార్ టీవీ తెలుగులోకి ఎంటర్ అయ్యింది. దీంతో స్టార్ , జీ తెలుగు ఛానల్స్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. స్టార్ గ్రూప్ నకు ఉదయ్ శంకర్ ఎప్పుడైతే సీయీవోగా వచ్చాడో ఇక దాని స్వరూపాన్ని మార్చేశాడు. ఏకంగా రీజినల్ లంగ్యేజ్ లలోకి స్టార్ ను ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రతి ప్రోగ్రాం ను ఆయా ప్రాంతాలకు , నేటివిటీకి దగ్గరగా ఉండేలా చూశాడు. ఇంకేం తెలుగులో మాటీవీని కొనుగోలు చేశాడు. ఇక్కడ టాప్ రేంజ్ లో ఉన్న జీ తెలుగు కు గట్టి పోటీ ఇప్పుడు మా ఇస్తోంది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ను తీసుకు వస్తూ జనాన్ని ఎంటర్ టైన్ చేసే పనిలో పడింది. బిగ్ బాస్ , అగ్ని సాక్షి, కార్తీక దీపం స్టార్ మా టీవీని ఆదరించేలా చేస్తున్నాయి. మా టీవీని తట్టుకునేందుకు జీ తెలుగు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. తాజగా నిన్నే పెళ్లాడుతా సీరియల్ స్థానంలో కొత్తగా రాధమ్మ కూతురు సీరియల్ ను ప్రారంభించింది. ఈ సీరియల్ కోసం రూపొందించిన అందే అందే చేతులే ఆకాశానికి.. అన్న టైటిల్ సాంగ్ రికార్...