సై..సైరా ..సురేందర్ రెడ్డి..!

సినిమా అన్నది పేషన్. అదో మాయా ప్రపంచం. కలల బేహారుల ఖార్ఖానా. వేలాది మంది దీనిపైనే ఆధార పడ్డారు. జూదం కంటే ప్రమాదకరమైన రంగం ఇది. అయినా లెక్కలేనంత మంది దీని చుట్టూ తిరుగుతుంటారు. కూటికి లేక పోయినా..నడిచేందుకు శక్తి లేక పోయినా సరే ఈ రంగమంటే అమితమైన ఆసక్తి. లెక్కలేనంత టాలెంట్ ఉన్నా ..గుర్తింపునకు నోచుకోక పోయినా ..ఏదో ఒకరోజు అవకాశం తలుపు తడుతుందని..అదృష్టం వరిస్తుందని ఈ చట్రంలోనే తిరుగతూ వున్న వాళ్లు ఎందరో. ఒక్కసారి దీనిని ప్రేమిస్తే చాలు ..బతుకంతా దీనితోనే. చావు పలకరించే దాకా ఇందులోనే. ఒక్కరోజులో రాజు కావాలని అనుకున్న వాళ్లకు ఇది అద్భుతమైన దారి చూపిస్తుంది. సినిమా అంటేనే 24 ఫ్రేమ్స్. కలలు పండాల..ఊహలకు ప్రాణం పోయాలి. నటీ నటులు ..టెక్నీషియన్స్..లొకేషన్స్..డిస్ట్రిబ్యూటర్స్..పబ్లిసిటీ..ఆడియో లాంఛింగ్..మూవీ రిలీజ్ దాకా..వందలాది మంది ఇందులో లీనమవుతారు. తమను తాము ఆవిష్కరించుకునేందుకు పడరాని పాట్లు పడతారు. ఒకప్పుడు నిర్మాతలకు ఓ వాల్యూ ..ఐడెంటిటి వుండేది. ఇపుడంతా హీరో ఓరియంటెడ్ మూవీస్ అయిపోయాయి. వాళ్లదే రాజ్యం. వాళ్లతోనే వ్యా...