పోస్ట్‌లు

జనవరి 30, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!

చిత్రం
విలువ‌లే ప్రామాణికంగా బ‌తికిన అరుదైన రాజ‌కీయ నాయ‌కుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఇక సెల‌వంటూ వెళ్లిపోయారు. ఇందిర ఎమ‌ర్జెన్సీ కాలంలో ఉప్పెన‌లా ఎదిగివ‌చ్చారు. అపార‌మైన అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఈ దేశంలో జ‌రిగిన ప్ర‌ధాన ఉద్య‌మాల‌తో జార్జ్ కు ప్ర‌త్య‌క్షంగానో..లేక ప‌రోక్షంగానో సంబంధం ఉంది. ప్ర‌భాక‌ర‌న్ స్థాపించిన ఎల్ టీటీఇకి ఆయ‌న బేష‌ర‌త్తుగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించి అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపారు. రాజ‌కీయవేత్త‌గా..మేధావిగా..ర‌చ‌యిత‌గా..జ‌ర్న‌లిస్టుగా..సంపాద‌కుడిగా..కార్మికప‌క్ష నేత‌గా ఎదిగారు. రాజ‌కీయాల‌లో సుదీర్ఘ‌మైన ప్ర‌యాణం చేసిన ఆయ‌న ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఉన్న‌త స్థాయి ప‌ద‌వుల‌ను చేప‌ట్టినా ఏరోజు ప్ర‌జ‌ల‌ను మ‌రిచి పోలేదాయ‌న‌. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో అరుదైన రైల్వే స‌మ్మెకు నాయ‌క‌త్వం వ‌హించి రికార్డు సృష్టించారు. మాన‌వుల పక్షాన నిలిచారు. ప్ర‌జ‌ల గొంతుక‌కు ప్రాణం పోశారు. ముంబైలో హాక‌ర్స్ యూనియ‌న్ లీడ‌ర్‌గా జీవితాన్ని ఆరంభించిన ఫెర్నాండేజ్ అంచెలంచెలుగా ఎదిగారు. దేశ రాజ‌కీయాల‌లో విస్మ‌రించ‌లేని నాయ‌కుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. తెల...