వారెవ్వా..క్యా కమాల్ హై..!

దేశంలో తనకు ఎదురే లేకుండా చేసుకోవాలని కేంద్రంలో కొలువు తీరిన కమల సర్కార్‌కు, మోదీ, షా టీంకు కోలుకోలేని షాక్ ఇచ్చారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలని పక్కా ప్లాన్‌తో బీజేపీ ముందుకెళుతోంది. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాలలో కొలువు తీరిన ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను కూలదోసే పనిలో నిమగ్నమైంది. అయితే దారికి తెచ్చు కోవడం లేదా ఏదో రకంగా పవర్‌లోకి రావడం. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ పడిపోయేందుకు ఎంత చేయాలో అంత చేసింది. షా కర్నాటకలోకి ఎంటర్ కావడం..యెడ్డీ పక్కా ప్లాన్ చేయడంతో..మొత్తం స్కిప్టు పండింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య విధానసభలో సంకీర్ణ సర్కార్ విశ్వాస పరీక్షలో తన బలాన్ని నిరూపించుకోలేక పోయింది. బీజేపీ ఆడిన చదరంగంలో ప్రభుత్వం కూలి పోయింది. ఇదే స్ట్రాటజీని మధ్యప్రదేశ్‌లో అమలు చేయాలని కమలం భావించింది. ఆమేరకు అక్కడి సీఎం కమల్‌నాథ్‌కు చెక్ పెట్టాలని చూసింది. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగి ఉన్న కమల్‌నాథ్ వీరి ప్లాన్‌ను , వ్యూహాల...