పోస్ట్‌లు

జూన్ 25, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

జాక్ పాట్ కొట్టేసిన క్యూర్ ఫిట్ - భారీ పెట్టుబ‌డి

చిత్రం
హెల్త్ కేర్ రంగంలో క్యూర్ ఫిట్ స్టార్ట‌ప్ స‌క్సెస్ బాట ప‌ట్టింది. భారీగా విస్త‌రించే దిశ‌గా ప‌రుగులు తీస్తోంది. ఈ అంకుర సంస్థ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు ఉత్సుక‌త చూపిస్తున్నాయి. ఎక్విక్ కేపిట‌ల్, యూనిలివ‌ర్ వెంఛ‌ర్స్, ఇన్నోవెన్ కేపిట‌ల్, కోట‌క్ మ‌హీంద్ర బ్యాంక్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. హెల్త్ అండ్ ఫిట్ నెస్ స్టార్ట‌ప్‌గా క్యూర్.ఫిట్ ప్రారంభ‌మైంది చిన్న గ‌దిలో. ఏకంగా ఈ కంపెనీల్నీ క‌లిపి 120 మిలియ‌న్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టాయి. 2016లో ముఖేష్ బ‌న్సాల్, అంకిత్ నాగోరి ఈ అంకురాన్ని ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ప్లాట్‌ఫాం ఆధారంగా ఇది ప‌నిచేస్తోంది. క్యూర్ ఫిట్ ను 2 మిలియ‌న్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆఫ్ లైన్‌లోనే కాకుండా ఆన్ లైన్‌లో కూడా సేవ‌లు అందిస్తోంది ఈ స్టార్ట‌ప్.  రాబోయే 10 సంవ‌త్స‌రాల‌లో 100 మిలియ‌న్ల క‌స్ట‌మ‌ర్ల‌ను టార్గెట్‌గా చేసుకుంది క్యూర్ ఫిట్. బెంగ‌ళూరు, ముంబై, ఢిల్లీ, హైద‌రాబాద్, చెన్నై, జైపూర్, దుబాయి ప్రాంతాల‌కు విస్త‌రించింది. అక్క‌డ వ్యాపారానికి ఢోకా లేకుండా పోయింది. ఎప్ప‌టిక‌ప్పుడు క‌స్ట‌మ‌ర్లు పెర‌గ‌డం, ఆదాయం గ‌ణనీయంగా స‌మ‌కూర‌డం కూడా కంపెనీలు దీని వైపు...

గుండెల్లో గువ్వ‌ల రాగం..మ‌దిలో మోహ‌న గీతం - ఆల్కాయాజ్ఞిక్ ప్ర‌స్థానం..!

చిత్రం
అప్పుడెప్పుడో శ్రీ‌లంక రేడియో ఎప్పుడు ఆన్ అవుతుందా అని ఎదురు చూసే వాళ్లం. ఇప్పుడున్నంత టెక్నాల‌జీ వాడ‌కం అప్పుడు లేదు. గ‌త 10 ఏళ్ల నుంచి ఐటీ సెక్టార్ పుంజు కోవ‌డం, ఇంట‌ర్నెట్ ఆధారిత మాధ్య‌మాల‌తో పాటు సోష‌ల్ , డిజిట‌ల్ మీడియా రంగాలు దూకుడు పెంచ‌డంతో ..ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే కావాల్సిన పాట‌ల‌న్నీ దొరుకుతున్న‌వి. దిగ్గ‌జ సెర్చింగ్ కంపెనీగా పేరున్న గూగుల్ ఎప్పుడైతే ఎంట‌ర్ అయ్యిందో ఇక వెనుదిర‌గాల్సిన ప‌నిలేకుండా పోయింది. జ‌స్ట్ క్లిక్ చేస్తే చాలు ల‌క్ష‌ల్లో వీడియోలు, ఆడియోలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కావాల్సింద‌ల్లా ఓపిక‌తో విన‌డ‌మే లేదంటే రాసు కోవ‌డ‌మే. 1980 నుంచి 2000 దాకా ఇండియా వ్యాప్తంగా చూస్తే..బాలీవుడ్‌లో కొత్త గొంతుక‌లు విచ్చుకున్నాయి. త‌మ గాత్ర‌పు ప‌రిమ‌ళాల‌ను వెద‌జ‌ల్లాయి. ల‌తా మంగేష్క‌ర్, ఆషా భోంస్లే, క‌వితా కృష్ణ మూర్తి, అనురాధా పోడ్వాల్, సాధ‌నా స‌ర్గంతో పాటు ఆల్కా యాజ్ఙిక్ లు త‌మ ప్ర‌తిభ‌కు మెరుగులు దిద్దారు. మాధురీ దీక్షిత్ ఎంట‌ర్ కావ‌డం , ఆమెకు ఆల్కా పాట‌లు పాడ‌డం ఇండియా అంత‌టా అవి పాపుల‌ర్ కావ‌డం జ‌రిగాయి. ఆమెతో పాటే కుమార్ షాను, ఉదిత్ నారాయ‌ణ్‌, ఎస్.పి.బాల‌సు...

కూల్చివేత‌పై ఉత్కంఠ - హైకోర్టు స‌సేమిరా - అక్ర‌మ నిర్మాణాల‌పై ఉక్కు పాదం

చిత్రం
అనుకున్న‌దే జ‌రుగుతోంది. ఎంతైనా ప‌వ‌ర్ వున్న‌ప్పుడు ఆ రాజ‌స‌మే వేరు. ప్ర‌భుత్వ అధికారులు మారరు. కానీ స‌ర్కార్ మారింది. ఇంకేం గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల‌ను ఎత్తి చూప‌డ‌మే కాదు..కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి క‌ట్టిన భ‌వంతుల‌ను కూల్చి వేసేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ప్ర‌జా ధ‌నం నేల‌పాలై పోయింద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు కొంద‌రు. ఒక‌వేళ అలా జ‌రిగి వుంటే..త‌క్ష‌ణ‌మే ఆ నిర్మాణానికి ప‌ర్మిష‌న్ ఇచ్చిన అధికారుల‌తో పాటు కాంట్రాక్టు ద‌క్కించుకున్న కాంట్రాక్ట‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవాల్సింది. ఒక భ‌వ‌నం క‌ట్టాలంటే కొన్ని నెల‌లు ప‌డుతుంది. ఎంతో శ్ర‌మ‌. టైం కూడా వేస్ట్. ఇంత పెద్ద భవ‌నాన్ని ఏదో ఒక ప్ర‌భుత్వ శాఖ‌కో లేదా ఇత‌ర ప‌నుల కోసం వాడుకుని వుండి వుంటే బావుండేదన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏది ఏమైనా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య చంద్ర‌బాబు హ‌యాంలో క‌ట్టిన ఈ నిర్మాణం కూలి పోతోంది. హైకోర్టులో పిటిష‌న్ వేసినా ..అక్ర‌మ నిర్మాణాన్ని తాము ఆప‌లేమంటూ ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఇంకేం కూల్చే ప‌ని చ‌కా చ‌కా జ‌రుగుతోంది. విదేశీ ప‌ర్య‌ట‌న ముగుంచుకుని ఏపీకి వ‌చ్చిన మాజీ ముఖ్య‌మంత్...

జీతాల‌కు క‌ట‌క‌ట‌..అప్పుల ఊబిలో బిఎస్ఎన్ఎల్‌..!

చిత్రం
రాకెట్ కంటే వేగంగా టెలికాం రంగం ఓ వైపు దూసుకెళుతుంటే భార‌త్ సంచార్ నిగం లిమిటెడ్ సంస్థ ఇంకా మీన‌మేషాలు లెక్కిస్తూ ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డుతోంది. కొన్నేళ్లుగా దేశానికి టెలికాం ప‌రంగా విశిష్ట సేవ‌లు అందించిన ఈ దిగ్గ‌జ సంస్థ ఇపుడు సిబ్బంది, ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించ‌లేని స్థితికి దిగ‌జారింది. ప్ర‌భుత్వ ప‌రంగా న‌వ‌ర‌త్న కంపెనీలు ఓ వైపు ఆదాయం పెంచుకునేందుకు దౌడు తీస్తుంటే..బిఎస్ ఎన్ ఎల్ మాత్రం ఉన్న చోట‌నే ఉండి పోయింది. ఎప్పుడైతే ట్రాయ్ ప్రైవేట్ టెలికాం ఆప‌రేట్ల‌ర సేవ‌లు అందించేందుకు తెర తీసిందో అప్ప‌టి నుంచి ఈ సంస్థకు గ‌ట్టి పోటీ ఏర్ప‌డింది. స‌ర‌ళీకృత ఆర్థిక విధానాల దెబ్బ‌కు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు కుదేల‌య్యాయి.  విప‌రీత‌మైన పోటీ ఏర్ప‌డింది. దేశ వ్యాప్తంగా అతి పెద్ద ఫైబ‌ర్ క‌నెక్టివిటీ క‌లిగిన ఈ సంస్థ ఇపుడు స‌ర్కార్ అందించే సాయం కోసం బేల చూపులు చూస్తోంది. వేలాది మంది సిబ్బంది, ఉద్యోగులు త‌మ సంస్థ‌ను కాపాడుకునేందుకు శ్ర‌మించారు. దానిని నిల‌బట్ట‌డంలో యాజ‌మాన్యం నిర్ల‌క్ష్య వైఖ‌రిని అవ‌లంభించింది. నూత‌న టెక్నాల‌జీని అందిపుచ్చు కోక పోవ‌డం, ఇత‌ర టెలికాం సంస్థ‌ల‌తో పోట...

దేవుడా..క్రికెట్ దిగ్గ‌జాన్ని క‌రుణించు..!

చిత్రం
క్రికెట్ ఆట‌కు కొత్త క‌ళ‌ను జోడించి..వెస్టిండీస్ జ‌ట్టుకు కీల‌క ఆట‌గాడుగా వుంటూ..ఎన‌లేని విజ‌యాల‌లో ప్ర‌ధాన పాత్ర పోషించి..రిటైర్ అయిన క్రికెట్ లెజండ్ ..దిగ్గ‌జ ఆట‌గాడు బ్రియ‌న్ లారా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడ‌న్న వార్త‌ను అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు. ముఖ్యంగా ఆ దేశానికి చెందిన ఫ్యాన్స్ ..ప్ర‌పంచంలోని ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారంతా దేవుడిని కోరుకుంటున్నారు..త‌మ దేవుడిని క‌రుణించ‌మ‌ని. ఏ ఫార్మాట్‌లోనైనా ఆడ‌గ‌లిగే స‌త్తా క‌లిగిన ఆట‌గాళ్ల‌లో లారా ఒక‌డు. కూర్చుని అల‌వోక‌గా బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌ను కొట్ట‌గ‌లిగే క్రికెట‌ర్ల‌లో బ్రియ‌న్ నెంబ‌ర్ వ‌న్‌గా నిలుస్తాడు. క‌ళాత్మ‌కంగా, అద్భుతంగా, మెస్మ‌రైజ్ చేసేలా ..చూసే లోపే బంతి క‌నిపించ‌కుండా స్టాండ్స్ లో ప‌డేలా కొట్ట‌గ‌లిగే అరుదైన లెజెండ్స్ ల‌లో మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ త‌ర్వాత ..ఎవ‌రి పేరునైనా సూచించాల్సి వస్తే..మొద‌ట‌గా లారాకే ప్ర‌యారిటీ ఇస్తామ‌ని క్రికెట్ పండితులు ఇటీవ‌లే వెల్ల‌డించారు. క‌రేబియ‌న్ ఆట‌గాళ్లు డిఫ‌రెంట్‌గా ఉంటారు. యుద్ధం ఎప్పుడు వ‌చ్చినా సరే ..ఏ జ‌ట్టుతోనైనా ఎక్క‌డైనా ఢీకొనేందుకు రెడీగా వుంటారు. ఒకప్పుడు మార...

దివ్య సాకేత క్షేత్రం - ఆధ్యాత్మిక సౌర‌భం..ఆనంద‌పు స‌మీరం ..!

చిత్రం
నిర్మ‌ల‌మైన ప్ర‌శాంతత కావాలంటే. అల్ల‌క‌ల్లోల‌మైన మ‌న‌సు సేద దీరాలంటే. దుఖఃం నుంచి విముక్తి పొందాలంటే. గుండెల్లో ప్రేమ మొలకెత్తాలంటే..స‌మ‌స్త శ‌రీరం ఆధ్యాత్మిక లోగిలిలో సేద దీరాలంటే..హృద‌యం పునీతం కావాలంటే ఏం చేయాలి. జేబుల నిండా క‌రెన్సీ వుండాల్సిన ప‌నిలేదు. ఆస్తులు, అంత‌స్తులు, హోదాలు, వాహ‌నాల‌తో ప‌ని లేదు. ఎలాంటి ఖ‌ర్చు అక్క‌ర్లేదు. కావాల్సింద‌ల్లా భ‌క్తిని క‌లిగి వుండ‌ట‌మే. ఎదుటి వారి ప‌ట్ల మ‌మ‌కారం వుండ‌ట‌మే. స‌మ‌స్త ప్ర‌పంచంతో మీకు ప‌ని లేదు. ప‌రిచ‌యం అంత‌క‌న్నా అక్క‌ర్లేదు. విజ్ఞానం కావాలంటే..జ్ఞానం పొందాలంటే..చెమ‌ట చుక్క‌లు చిందించాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు. జ‌స్ట్..మిమ్మ‌ల్ని మీరు ప్రేమించు కోవ‌డం. మీ ప‌రిమితులు ఏమిటో మీరు తెలుసు కోవ‌డం. దీనికి ప్ర‌త్యేక‌మైన సాధ‌న , కఠోర దీక్ష కూడా అక్క‌ర్లేదు. జ‌స్ట్..సంక‌ల్ప బ‌లం క‌లిగి వుంటే చాలు. మీలో మీరు ఊహించ‌ని శ‌క్తి మిమ్మ‌ల్ని ఆవ‌హిస్తుంది. ఎక్క‌డా దొర‌క‌ని అనుభూతికి మీరు లోన‌వుతారు. ఇదంతా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ రామానుజ స్వామీజీని ద‌ర్శించుకుంటే ..స్వామి వా రు స్వ‌హ‌స్తాల‌తో అందించే తీర్థం తీసుకుంటే క‌లుగుతుంద...

క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న క‌బీర్ సింగ్ - సందీప్ రెడ్డి స‌క్సెస్ - అంత‌టా హిట్ టాక్

చిత్రం
వంగా సందీప్ రెడ్డి గుర్తున్నాడా. ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినామాను షేక్ చేసిన డైరెక్ట‌ర్ అత‌ను. విజ‌య్ దేవ‌ర‌కొండ అనే న‌టుడిని హిట్ రేంజ్ కు తీసుకు వెళ్లిన ఘ‌న‌త అత‌డిదే. అత‌డితో తీసిన అర్జున్ రెడ్డి సినిమా ఊహించ‌ని రీతిలో కోట్లు కురిపించింది. ఇత‌ర డైరెక్ట‌ర్ల‌ను, నిర్మాత‌ల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఈ మూవీ సృష్టించిన సునామీని టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ దిగ్గ‌జాలు చూసి మ‌నోడితో ట‌చ్‌లోకి వ‌చ్చారు. చివ‌ర‌కు బాలీవుడ్ కు వెళ్లాడు. అక్క‌డ అర్జున్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో క‌సితో క‌బీర్ సింగ్ మూవీ తీశాడు. అక్క‌డి వారికి మొద‌ట్లో న‌చ్చ‌క పోయినా ..సినిమా రిలీజ్ అయ్యాక‌..డాల‌ర్ల పంట పండిస్తోంది. ప్ర‌పంచ మంత‌టా ఇదే సినిమా గురించిన చ‌ర్చ‌. షాహిద్ కపూర్ ఇందులో హీరో. క‌బీర్ సింగ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇండియాలో 3 వేల 123 థియేట‌ర్ల‌లో విడుద‌ల కాగా, ఓవ‌ర్సీస్‌లో 493 థియేట‌ర్ల‌తో క‌లుపుకుని మొత్తం 3 వేల 616 స్క్రీన్ల‌లో క‌బీర్ సింగ్ విడుద‌లైంది. రిలీజ్ అయిన ప్ర‌తి చోటా హిట్ టాక్‌ను తెచ్చుకుంటోంది. ల‌వ్ స్టోరీ బేస్ చేసుకుని తీసిన అర్జున్ రెడ్డి బంపర్ హిట్ గా తెచ్చుకుంది. ఓవ‌ర్ ఆల్‌గా బ్...

విస్తుపోయిన ప్ర‌పంచం - ఎగిరిన మువ్వొన్నెల ప‌తాకం - క‌పిల్ సేన క‌ప్పు సాధించి 36 ఏళ్లు

చిత్రం
క్రికెట్ ప్ర‌పంచం విస్తుపోయిన వేళ‌. ప్ర‌తి భార‌తీయుడు గుండె నిండా ..ఈ దేశం నాది ..ఈ క్రిక‌ట్ జ‌ట్టు నాది అని ఫీల్ అయిన వేళ‌. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా ..మువ్వెన్నెల భార‌తీయ ప‌తాకం ..స‌గ‌ర్వంగా ఆకాశంలో ఎగిరిన వేళ‌. కోట్లాది జ‌నం హ‌మారా భార‌త్ మ‌హాన్ అని నిన‌దించిన వేళ‌. ఊపిరి బిగ ప‌ట్టి ..హ‌ర్యానా హ‌రికేన్ ..ఫాస్టెస్ట్ ఎక్స్‌ప్రెస్ గా పేరొందిన క‌పిల్‌దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో ప్ర‌పంచ క‌ప్ ను ముద్దాడిన వేళ‌.. కుల‌,మ‌తాలు, వ‌ర్గాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు క‌పిల్..క‌పిల్ అంటూ వినువీధుల్లో ప‌రుగులు తీసిన వేళ‌..ఆ స‌న్నివేశం ఇప్ప‌టికీ ఇంకా మ‌దిలో మెదులుతూనే వున్న‌ది. స‌మున్న‌త భారతావ‌ని త‌ల ఎత్తుకుని నిల‌బ‌డింది. ప్ర‌పంచ జ‌ట్ల‌కు షాక్ ఇస్తూ..ఫైన‌ల్లో వివియ‌న్ రిచ‌ర్డ్స్ నేతృత్వంలోని విండీస్‌ను మ‌ట్టి క‌రిపించి ..విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న భార‌త క్రికెట్ జ‌ట్టు ..నిటారుగా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను పైకెత్తింది. ఇదిగో మేము సాధించిన అద్భుత‌మైన గెలుపు అంటూ  ప్ర‌క‌టించింది. ఆ స్వ‌ప్నాన్ని నిజం చేసిన రోజు స‌రిగ్గా 1983వ సంవ‌త్స‌రం జూన్ 25. ఇవ్వాల్టితో స‌రిగ్గా 36 సంవ‌త్స‌రాలు నిండాయి. ఆ ఉద్విగ్న భ‌రిత...

మజుందార్‌కు అంత‌ర్జాతీయ గౌర‌వం - ఎంఐటి బోర్డు మెంబ‌ర్‌గా నియామ‌కం

చిత్రం
త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌కు కొద‌వే లేదని నిరూపిస్తున్నారు భార‌తీయులు. ఇప్ప‌టికే మ‌హిళ‌లు పురుషుల‌కు ధీటుగా త‌మ నాలెడ్జ్, అనుభ‌వం ఆధారంగా అత్యున్న‌త ప‌ద‌వులు అధిరోహిస్తున్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, లాజిస్టిక్, బిజినెస్, ఐర‌న్ అండ్ స్టీల్, గ్యాస్, ఆటోమొబైల్స్, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు, త‌దిత‌ర కంపెనీల‌కు ఛైర్మ‌న్‌లుగా, మేనేజింగ్ డైరెక్ట‌ర్లుగా, బోర్డు ఆఫ్ డైరెక్ట‌ర్లుగా విజ‌య‌వంతంగా బాధ్య‌త‌లు నిర్విస్తూ లాభాల బాట ప‌ట్టిస్తున్నారు. ఇటీవ‌ల పెప్సికోకు బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఇంద్రా నూయి ఏకంగా అమెరికా దిగ్గ‌జ కంపెనీగా పేరొందిన అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. తాజాగా బెంగ‌ళూరుకు చెందిన కిర‌ణ్ మ‌జుందార్ కు అంత‌ర్జాతీయంగా అత్యుత్త‌మ‌మైన గౌర‌వం ల‌భించింది. ఇండియాలో ఆమెకు బ‌యోటెక్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా, ఆలోచ‌న క‌లిగిన నాయ‌కురాలిగా, ప్ర‌పంచాన్ని ప్రభావితం చేసిన మ‌హిళల్లో మ‌జుందార్ ఒక‌రిగా ఉన్నారు. అంతేకాకుండా అమెరికా - ఇండియా బిజినెస్ కౌన్సిల్ డైరెక్ట‌ర్‌గా కూడా ఎన్నిక‌య్యారు. ఎంఐటీ కార్పొరేష‌న్ కు ఫుల్ టైం స‌భ్యురాలిగా ఎంప...