వీరుడికి వందనం - దేశం అభివందనం ..!

నిబద్ధతత కలిగిన సైనికుడు ఎలా వుంటాడు..శత్రు దేశానికి చిక్కినా ..రహాస్యాలు విప్పని యోధుడు ఎలా వుంటాడు..ప్రాణం పోయినా పర్వాలేదు..కానీ నా దేశం కోసం నేను తలవంచను అంటూ స్పష్టం చేసిన జవానును మనం చూడగలమా అంటూ సందిగ్ధంలో ఉన్న సమయంలో ..చుక్కానిలా ముందుకు వచ్చాడు తమిళనాడుకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్. జాతి యావత్తు ఆయనను విడుదల చేయాలని ముక్త కంఠంతో కోరింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా దౌత్యనీతిని ప్రదర్శించింది. ఇతర దేశాలను ఒప్పించడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, చైనా, జపాన్, అరబ్ కంట్రీస్ ను కూడగట్టింది. దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకిగా మిగిలింది. ఇప్పటికే భారత్ - పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. బాల్ కోట్ ప్రాంతంలో వాయు సేన దాడులు చేసిన నేపథ్యంలో జరిగిన సంఘటన థ్రిల్లర్ సినిమాను తలపింప చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ అనుకోకుండా పాక్ సైన్యం చేతికి చిక్కారు. అక్కడి జనం ఆయనపై దాడికి పాల్పడ్డారు. తీవ్...