సినీ వెన్నెల .. సిరి వెన్నెల..!

తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం ఆయన. గేయ రచయితగా అత్యున్నతమైన స్థానాన్ని అందుకున్న యోగి. కవి.రచయిత. నటుడు. భావుకుడు. ఏ సమయంలోనైనా రాయగల నేర్పు కలిగిన అరుదైన వ్యక్తి ..సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలంలోంచి జాలువారిన ప్రతి అక్షరం తెలుగు వాకిట గవాక్షమై నిలిచి పోయింది. ఏది మాట్లాడినా..ఇంకేది రాసినా దానికో పద్ధతి..పరమార్థం ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఆకాశమంత కీర్తి శిఖరాలను అందుకున్న ఈ అక్షర పితామహుడి సినీ ప్రస్థానంలో లెక్కలేనన్ని పురస్కారాలు..అవార్డులు..ప్రశంసలు. తనతో పాటు ఎందరినో గేయ రచయితలుగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఆయనదే. అతిరథ మహారథులను తట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న తీరు ప్రశంసనీయం. తీక్షణంగా చూసే కళ్లు. సమాజాన్ని చైతన్యవంతం చేసే దిశగా ఉండేలా ఎన్నో పాటలు రాశారు. ఆయన స్పృశించని అంశమంటూ ఏదీ లేదు. బలపం పట్టి బామ్మ బళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా అని రాసిన సిరివెన్నెల..నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అంటూ ప్రశ్నించడం నేర్పాడు. ఎప్పుడూ ఒప్పుకోవ...