మహర్షి సరే..తెలంగాణ రైతుల మాటేమిటి..?

భారత దేశం అంటేనే వ్యవసాయం. రైతులకు ఎలా పండించాలో..ఎప్పుడు ఏ కాలంలో ఎలాంటి పద్ధతులు పాటించాలో..ఏయే పంటలు సాగు చేయవచ్చో వాళ్లకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. సినిమా చూసి నేర్చుకునేంత స్థితికి తెలంగాణ రైతాంగం దిగజారలేదు. ఆ విషయాన్ని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ, నటుడు మహేష్ బాబు గుర్తిస్తే చాలు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వ్యవసాయం పాట పడుతున్నారు. రైతులకు కావాల్సింది సినిమాలు కాదు. పండించేందుకు భరోసా కావాలి. ప్రతి ఒక్క రైతుకు..మట్టి బిడ్డలకు నెలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 10 వేల రూపాయల చొప్పున పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అపుడే వారికి న్యాయం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఒట్టి పోయింది. దోపిడీకి గురైంది. మోసానికి లోనైంది. 60 ఏండ్ల పాటు ఈ ప్రాంతాన్ని సర్వనాశనం పట్టించారు. కోలుకోలేకుండా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు ఎనలేని అన్యాయం జరిగింది. కొన్ని తరాలు గడిచినా ఈ దగాను పూడ్చుకునేందుకు సమయం సరిపోదు.ఇరు రాష్ట్రాలలో వ్యవసాయం ప్రధానమైన ఆదాయ వనరుగా ఉంది. వేలాది ...