యూట్యూబ్ హవా ..జనం ఫిదా ..!

కోట్లాది జనం తమను తాము యూట్యూబ్ లో చూసుకుంటున్నారు . ఏ ముహూర్తంలో దీనిని క్రియేట్ చేశారో కానీ అప్పటి నుండి నేటి దాకా మిస్సైల్ కంటే వేగంగా తన రికార్డ్ ను తానే అధిగమిస్తోంది. వినోదం ..విజ్ఞానం ..ఆధ్యాత్మికం ..వికాసం ..ఆటలు ..ప్రకృతి ..ప్రపంచం ..అడవులు ..జంతువుల విన్యాసాలు ..ఇలా ప్రతిదీ ఇందులోకి చేరిపోతోంది . అవసరమైనప్పుడు తీసుకోవచ్చు .వద్దనుకుంటే అలాగే తమ పేరుతో ఉంచేసుకోవచ్చు . ఇలాంటి సౌలభ్యం ఇందులో ఉండడంతో కోట్లాది జనం దీనికి ఫిదా అవుతున్నారు . ఇంటర్నెట్ అనుసంధానం కావడంతో దీని వినియోగం పదింతలు పెరిగింది . పిల్లలు ..మహిళలు ..పెద్దలు ..ఇలా ప్రతి ఒక్కరు యూట్యూబ్ కు అడిక్ట్ అవుతున్నారు . గేమ్స్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంటోంది . దేశీయంగా మొబైల్ ఫోన్లలో యూట్యూబ్‌ను వీక్షిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతోంది. గత ఏడాది మొబైల్ ఫోన్లలో యూట్యూబ్‌ను యాక్సెస్ చేస్తున్న యూజర్లు 73 శాతంగా ఉండగా ఈ ఏడాది అది ఏకంగా 85 శాతానికి పెరిగింది. ఈ ఏడాది జనవరి నాటికి భారత్‌లో యూట్యూబ్ నెలవారీ యాక్టివ్ యూజర్ బేస్ 26.5 కోట్లుగా ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 22.5 కోట్లుగా ఉంది. పదకొ...