పోస్ట్‌లు

ఆగస్టు 20, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆగనంటున్న బంగారం..పెరుగుతున్న ధరాభారం

చిత్రం
ప్రపంచ మార్కెట్ రంగంలో కొనసాగుతున్న ఒడిదుడుకుల దెబ్బకు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితికి చేరుకున్నాయి. వరల్డ్ వైడ్ గా ధరల తీరులో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. నిన్న మొన్నటి దాకా తులం పసిడి ధర 28 వేల రూపాయలు ఉండగా, తాజగా దాని రేట్ లో భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఏకంగా 40 వేల రూపాయల దాకా చేరుకుంది. పసిడి అమాంతం పైపైకి పోతుండగా, వెండి మాత్రం మెలమెల్లగా దిగి వస్తోంది. ధరలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కొనుగోలుదారులు బంగారాన్ని కొంటున్నారు. దుకాణాదారులు, వ్యాపారులు ధరలు పెరుగుతూ పోతుండడంతో కొనుగోళ్లు తగ్గుతాయని ఆందోళనకు గురయ్యారు. వారి అంచనాలకు మించి ఆభరణాలు అమ్ముడు పోవడం, దుకాణాలు కొనుగాలుదారులతో కిటకిట లాడడం విస్తు పోయేలా చేసింది. దీంతో మరింతగా తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు భారీ ఎత్తున డిస్కౌంట్స్ తో పాటు ఖరీదైన గిఫ్ట్ లు కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. మహిళలు , యువతులు ఎక్కువగా బంగారు షాప్స్ ను సందర్శిస్తున్నారు. తమకు తోచినంత గా తీసి పెట్టుకుంటున్నారు. ఆషాఢం లో ఎక్కువగా ఈ అమ్మకాలు జరగడం  విశేషం. ఢిల్లీలో...

అమరావతి భారమేనా..కలగా మిగిలేనా..!

చిత్రం
ఎక్కడా లేని రాజకీయాలు ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి నాయకులతో పాటు ప్రజలకు చైతన్యం ఎక్కువ. అన్నిటికంటే కోట్లాది రూపాయలు పోగేసుకున్న నాయక గణం ప్రజా సేవ పేరుతో చిలుక పలుకులు పలుకుతున్నాయి. ఓట్లు వేసిన పాపానికి తమ ఇష్టానుసారం పాలన సాగిస్తూ, అడ్డగోలు ఆర్డర్స్ జారీ చేస్తూ జనాన్ని దద్దమ్మలుగా మార్చేశారు. సబ్సిడీలు ఇస్తూ, జనాన్ని సోమరులుగా మార్చేస్తూ గొర్రెల మందగా ప్లాన్ చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. వీరి నిర్వాకానికి ఇంకో వైపు స్వామీజీలు , పీఠాధిపతుల గోల ఒకటి. మొక్కులు , ఆశీర్వాదాలు అవసరమైతే సన్మానాలు, ఆహా ఓహోలు..మొక్కులు తీర్చు కోవడాలు , యజ్ఞాలు , యాగాలు. వీటి పేరుతో పాలనను పడకేశారు. తెలంగాణాలో కొలువుల ఊసే లేదు. పేరెత్తితే బంగారు తెలంగాణ. ఎక్కడుందో ..ఎప్పుడు వస్తదో తెలియదు. నియామకాల జాడ లేదు. ఏపీలో వరదలొచ్చి బాధితులు లబో దిబోమంటుంటే అమాత్యులు అధినేత జపం చేస్తున్నారు. టీడీపీపై ఆరోపణలు చేయడంతోనే సరిపోతోంది. తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో , చంద్ర బాబు ఆయన పరివారాన్ని టార్గెట్ చేశాడు. మెలమెల్లగా వారి ఆర్ధిక మూలాలపై దెబ్బ కొట్టుకుంటూ వస్తున్నాడు....

హైదరాబాద్ బాద్..షా..అమెజాన్ షెహన్ షా..!

చిత్రం
ఈకామర్స్ రంగంలో ప్రపంచంలోనే టాప్ వన్ లో కొనసాగుతున్నఅమెరికాకు చెందిన అమెజాన్ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. ఏ దేశంలో లేని విధంగా భారీ ఖర్చుతో భారీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. ఆ అరుదైన సన్నివేశం కేవలం యుఎస్ లో కాకుండా , ఆసియా ఖండంలోని ఇండియాకు చెందిన, తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరం లో సాక్షాత్కారమైంది. ఇప్పటికే మార్కెట్ రంగంలో అతి పెద్ద ఆదాయ వనరు కలిగిన ప్రాంతంగా భారత్ అవతరించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలన్నీ ఇప్పుడు క్యూ కట్టాయి. ఇండియా వైపు చూస్తున్నాయి. నిన్నటి దాకా ఐటి అంటేనే బెంగళూర్ అనే వారు..లేదంటే చెన్నై ని సూచించే వారు. ఇప్పుడు ఆ సీన్ మారింది. ఇక్కడ కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వినూత్నమైన ఇండస్ట్రియల్ పాలసీని తీసుకు వచ్చింది. ప్రత్యేకంగా ఐటి చట్టాన్ని తయారు చేసింది. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఆన్ లైన్ లోనే. ప్రవాస భారతీయులతో పాటు ఏ దేశానికి చెందిన వారైనా సరే, ఇక్కడికి వస్తే ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది. కేవలం ఏడు రోజుల్లో అనుమతులు ఇస్తుంది. దీంతో పారిశ్రామికవేత్తలు , ఔత్సాహికులు ,...

సాహోరే సుజీత్ రెడ్డి..!

చిత్రం
వినోద రంగం అనే సరికల్లా ఇండియాలో మొదటగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఏంటంటే, టాలీవుడ్ గురించే చర్చంతా. ఒకప్పుడు మూవీస్, దాని బడ్జెట్ గురించి మాట్లాడాలంటే ముందు బాలీవుడ్ మాటొచ్చేది. ఇప్పుడు ఆ సీన్ మారి పోయింది. భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటే మాకు మాత్రమే సాధ్యం అనుకుని విర్ర వీగుతున్న తరుణంలో ఒక్కసారిగా సౌత్ ఇండియాకు చెందిన మణిరత్నం, శంకర్, పార్థిపన్ లాంటి వాళ్ళు రావడంతో  షేక్ అయ్యింది. అంతేనా తమిళ, తెలుగు సినిమా రంగాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. శరవేగంగా మారిన టెక్నాలజీని వాడుకుంటూ సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. రాజమౌళి ప్రభాస్ తో తీసిన బాహుబలి ఇండియాలో సెన్సేషన్ హిట్ గా..బ్లాక్ బస్టర్ మూవీగా చరిత్ర తిరగ రాసింది. అటు ఇతర దేశాల్లో కూడా డాలర్లను కోళ్ల గొట్టింది. ఇప్పటి దాకా తలైవా , విజయ్ , కమల్ లాంటి వాళ్లకు మార్కెట్ వుంటే , ఇప్పుడు తెలుగు హీరోల హవా దేశాన్ని దాటి ఖండాతరాలు చుట్టేసింది. ఒక్కో హీరో రేంజ్ 100 కోట్ల బడ్జెట్ ను ఎప్పుడో దాటేసింది. వంగా సందీప్ రెడ్డి తీసిన అర్జున్ రెడ్డి , పరుశురాం తీసిన గీత గోవిందం, మహేష్ నటించిన శ్రీమంతుడు , మహర్షి సినిమాలు తెలుగు సినిమాకు క...

ఇమ్రాన్ కు ట్రంప్ హితబోధ

చిత్రం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రాంగం బాగా పని చేసింది. తాజాగా దక్షిణ ఆసియా ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు ఇండియా అహర్నిశలు కృషి చేస్తుంటే, పాక్ రెచ్చగొట్టే ధోరణి అవలంభిస్తోందంటూ పీఎం యుఎస్ ప్రెసిడెంట్ కు తేల్చి చెప్పారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, మన దేశంలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఈ సందర్బంగా మోడీ ట్రంప్ కు విడమరిచి చెప్పారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో పాకిస్తాన్ లేవనెత్తిన కశ్మీర్ అంశంపై ఒక్క చైనా తప్ప సభ్య దేశాలు సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో విశ్వ వేదికపై పాకిస్తాన్ ఒంటరిగా మిగిలింది. తదనంతరం పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు, నిరాధార ఆరోపణలు ఇండియాపై చేశారు. దీనిపై మోడీ ఘాటుగా అమెరికా ప్రెసిడెంట్ కు సమాధానం చెప్పారు. ఏ సమయంలోనైనా యుద్ధం చేసేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. దీంతో అమెరికా కొంచం మెత్త బడింది. పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే వాస్తవాధీన రేఖ వెంట , పాక్ సరిహద్దులో తలదాచుకున్న ఉగ్ర మూకలను ఏరివేయాలని ట్రంప్ హెచ్చరించా...