పూజాకు బిగ్ ఛాన్స్

టాలీవుడ్‌లో ఉన్నట్టుండి టాప్ పొజిషన్‌లోకి దూసుకు వచ్చిన నటి పూజా హెగ్డేకు అరుదైన ఛాన్స్ దక్కింది. ఇప్పటికే పలు చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. తెలుగు సినిమా రంగంలో పేరున్న నటులు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ , తదితరులతో ఆమె నటించారు. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో సినిమాలు ఊహించని రీతిలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమె గ్రాప్ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఆమెకు మరింత డిమాండ్ పెరిగింది. భారీ ఎత్తున అవకాశాలు వచ్చినా ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. అంతేకాకుండా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. మరో వైపు అద్భుతంగా తెలుగులో పాటలు కూడా పాడటం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే సమయంలో మంచి జోరు మీదుకున్న పూజా హెగ్డే కు బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది ఈ అమ్మడు. మరో వైపు ఇటీవల ఆమె నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్‌గా నిలవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలందరితో నటిస్తూ మోస్ట్ బిజ...