సంకీర్ణ సర్కార్ సేఫ్ - ఫలించిన దేవగౌడ మంత్రాంగం

కర్ణాటక రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తగ్గి పోయేలా చేశారు..అపర చాణుక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని దేవెగౌడ. గత నాలుగు నెలలుగా ఏ క్షణంలోనైనా కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి పోవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఆ దిశగా మోదీ, షాలు ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. కేంద్రంలో థంబింగ్ మెజారిటీ రావడంతో ఎట్టి పరిస్థితుల్లోను బీజేపీ పావులు కదిపి..పవర్ లోకి రావాలని ప్రయత్నాలు చేసింది. ఎందుకనో ఉన్నట్టుండి ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. దీని వెనుక మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవెగౌడ చేసిన మంత్రాంగం కారణంగానే మోదీ తన ఆపరేషన్ కు పుల్ స్టాప్ పెట్టారన్న వార్తలు గుప్పుమన్నాయి. కర్ణాటక స్టేట్‌లో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.37 స్థానాలు జేడీఎస్ సభ్యులుండగా, 80 స్థానాలు కలిగిన కాంగ్రెస్ తో పాటు ఆరుగురు ఇండిపెండ్లతో కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేవెగౌడ కుమారుడు కుమార స్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన చాలా సార్లు ఈ వత్తిళ్లను భరించలేనంటూ..తనకు ఈ పదవి వద్దంట...