పోస్ట్‌లు

నవంబర్ 19, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎదురులేని టీమిండియా

చిత్రం
టీమిండియా ఇప్పుడు తిరుగులేని విజయాలతో దూసుకెళుతోంది. ప్రత్యర్థి జట్టు ఏ స్థాయిలో ఉన్నా మన జట్టు అలవోకగా గెలుపొందుతూ రికార్డులు తిరుగ రాస్తోంది. ఆయా జట్లకు సాధ్యం కాని రీతిలో ఆట తీరును కనబరుస్తోంది టీమిండియా. ఈ దశాబ్దం ముగిసే వరకు టెస్టుల్లో టీమిండియా అగ్ర స్థానంలో కొనసాగడం ఖాయం. గత మూడేళ్లుగా టెస్టుల్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న భారత జట్టు, ఇప్పటికే ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో 300 పాయింట్లతో మరే జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది. అంతే కాకుండా విజయాల శాతం, గెలు పోటముల నిష్పత్తిలో దూసుకు పోతోంది. ఓ దశాబ్ద కాలంలో అత్యధిక సక్సెస్‌ రేషియో కలిగిన జట్టుగా టీమిండియా తొలిసారి రికార్డు సృష్టించింది. ఈ పదేళ్ల కాలంలో ఇప్పటి వరకు 106 టెస్టులు ఆడిన భారత్‌ 55 విజయాలు, 29 అపజయాలను చవి చూసింది.  ఇక తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా 89 టెస్టుల్లో 44 గెలువగా, 25 ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక జట్ల సక్సెస్‌ రేషియో వరుసగా 1.39, 1.30, 1.07, 0.91, 0.79 ఉన్నాయి. ఇలా ఓ దశాబ్ద కాలంలో అన్ని మేటి జట్లను అధిగమించి అత్యధిక సక్సెస్‌ రేషియోను సాధించడం టీమిండియాకు ఇది ...

చార్జీల మోత..కస్టమర్లకు వాత

చిత్రం
భారతీయ వ్యాపార రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపీనీస్ త్వరలో వినియోగదారులకు షాక్ ఇచ్చే పనిలో పడ్డది. ఇప్పటికే ఏజిఆర్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో టెలికం కంపెనీలు పెద్ద ఎత్తున భారత టెలికం నియంత్రణ సంస్థ అంటే ట్రాయ్ కి బాకీ పడ్డాయి. వోడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలతో పాటు రిలయన్స్ జియో కంపెనీ కలిపి ఏకంగా లక్షా 50 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ధర్మాసనం ఈ కంపెనీలకు చెల్లించేందుకు మూడు నెలలు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో తాము ఇంత పెద్ద మొత్తం చెల్లించలేమని విన్నవించాయి. అయినా లాభాల బాటలో ఉన్న ఈ కంపెనీలు ఇలా మొండి కేయడంపై కోర్టు సీరియస్ అయ్యింది. దీంతో డేటా వినియోగం, ఇంటర్ నెట్ అనుసంధానం అన్నది ఇప్పుడు ప్రధానంగా మారింది. ప్రతిదీ దీనితోనే మిళితమై ఉండడం తో టెలికం కంపెనీల పంట పండుతోంది. ఆదాయం గణనీయంగా సమ కూరుతోంది. ఇదిలా ఉండగా ఆయా టెలికాం కంపెనీల మధ్య పెరిగిన పోటీ తట్టుకునేందుకు కంపెనీలు టారిఫ్ లను పెంచాలని యోచిస్తున్నాయి. ఇందు కోసం పెద్ద ఎత్తున మొబైల్ వినియోగదారులకు నెలవారీ చార్జీలను పెంచాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే వోడాఫోన్, ఐడియా, ఎయిర్ ట...

దలాల్ స్ట్రీట్..రైట్ రైట్

చిత్రం
నిన్నటి దాకా స్టాక్ మార్కెట్ నష్టాలను చవి చూస్తే ప్రస్తుతం దలాల్‌ స్ట్రీట్‌లో మాత్రం లాభాల జోరు కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల బలమైన సెంటిమెంట్ వర్క్ అవుట్ కావడంతో సెన్సెక్స్‌ 347 పాయింట్లు జంప్‌ చేసి 40, 816 వద్ద ఆల్‌ టైం గరిష్టానికి చేరింది. అటు నిఫ్టీ కూడా 12000 ఎగువన హుషారుగా కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 300 పాయింట్లు ఎగిసి 40770 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 12025 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా హెవీ వెయిట్‌ రిలయన్స్‌తో పాటు బ్యాంకింగ్‌ రంగ షేర్ల లాభాలు మార్కెట్లను సరి కొత్త గరిష్టాల దిశగా తీసుకెళ్తున్నాయి. దీనికి టెలికం కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మరింత ఊతమిస్తున్నాయి. రిలయన్స్‌ టాప్‌ విన్నర్‌గా కొనసాగుతుండగా, వొడాఫోన్‌​ ఐడియా మరో 22 శాతం ఎగిసింది. భారతి ఎయిర్టెల్ కూడా 2 శాతం ఎగిసింది. జీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, సన్‌ఫార్మ, కోల్‌ ఇండియా, యస్‌ బ్యాంకు, టాటా స్టీల్‌, మారుతి సుజుకి లాభ పడుతుండగా, భారతి ఇన్‌ఫ్రా టెల్‌, ఐషర్‌ మోటార్స్‌, కోటక్‌ మహీంద్ర, ఎస్‌బీఐ, ఐవోసీ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో నష్ట పోతున్నాయి. మరో వైపు దేశీయ కరెన్సీ ఆరంభంలో డాలరు మారకంలో బలహీనంగా ఉన్నా, అనంతరం పుంజు...

పవర్ మాదే..పవార్ మావోడే

చిత్రం
మహారాష్ట్రలో రాజకీయాలు మరింత హీటు పుట్టిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో శివసేనను అధికారంలోకి రాకుండా చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. శివసేనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎన్సీపీని ఎలాగైనా సరే తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ట్రబుల్ షూటర్ అమిత్ షా, భారత దేశ ప్రధాన మంత్రి మోదీలు పావులు కదుపుతున్నారు. తాజాగా పవార్ రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన మోడీతో కలవనున్నారు. ఈ సమయంలో మోడీ పవార్ కు భారీ ఆఫర్ ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇవ్వన్నీ పుకార్లేనని, మరాఠా పీఠం తమదేనని ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 27 రోజులు గడుస్తున్నా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయక పోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివసేనతో కలిసి ఎన్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తుండగా, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలే జరగలేదని చెప్పి షాక్ ఇచ్చారు. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడ...

జార్జ్‌ రెడ్డి ఎందరికో స్ఫూర్తి

చిత్రం
జార్జ్ రెడ్డి లాంటి వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి నేను ఒంగోలులో ఇంటర్ మీడియట్ చదువుకుంటున్నప్పుడు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు జార్జ్ రెడ్డి సినిమా ద్వారా అతడి గొప్పదనం, చేసిన త్యాగం, అతడు అందించిన స్ఫూర్తి గురించి వింటున్నాను అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ కాలంలో ఎందరో జార్జ్ రెడ్డి గురించి చెబుతూ ఉండే వారు అని చెప్పారు. సందీప్‌ మాధవ్‌ లీడ్‌ రోల్‌లో ‘దళం’ సినిమా ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జార్జ్‌ రెడ్డి’. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలకంగా వచ్చే అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు అనే పాటను చిరంజీవి విడుదల చేశారు. జార్జ్‌ రెడ్డి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. మార్పు కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు మెగాస్టార్. తప్పును ప్రశ్నించే ఇలాంటి వాళ్లు ఎందరో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. వస్తూనే ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు పాట చూసిన తర్వాత నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. జార్జ్‌ రెడ్డి ఎలాంటి ఆశయాలతో ఉండేవారు. ఆయన ర...

జనం కోసం కలిసేందుకు సిద్ధం

చిత్రం
తమిళనాడులో సూపర్ స్టార్ గా, కోట్లాది మంది అభిమానులు ప్రేమగా పిలుచుకునే తమిళ తలైవా రజనీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. నిన్నటి దాకా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. దీనిని రజనీకాంత్ నిర్ద్వందంగా ఖండించారు. తమిళ ప్రజల హక్కులకు భంగం కలిగించే ఎవ్వరైనా లేదా ఏ పార్టీ అయినా, ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఒప్పుకునే ప్రసక్తి లేదని తలైవా స్పష్టం చేశారు. తాజాగా రజనీకాంత్, సహజ నటుడు కమల్ హాసన్ తో కలిసి తమకు సినిమా భిక్ష పెట్టిన, తమ ఉన్నతికి దోహద పడిన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమ మధ్య ఉన్న స్నేహం గురించి వేలాది మంది అభిమానులతో పంచుకున్నారు.  బాలచందర్ విగ్రహాన్ని కమల్ హాసన్ స్వతహాగా ఏర్పాటు చేశారు. తమిళ ఆరాధ్య హీరోలు వీరిద్దరూ. రజనీకాంత్, కమల్ హాసన్ లకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాడు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం వీలైతే కమల్ హాసన్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తలైవా చేసిన ప్రతిపాదనను తాను ఆహ్వానిస్తున్నానని కమల్ హాసన్ చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అటు...

రూట్ల ప్రైవేటీకరణపై కీలక కామెంట్స్

చిత్రం
రూట్ల ప్రైవేటీకరణపై రాష్ట్ర ధర్మాసనం కీలక కామెంట్స్ చేసింది. కేబినెట్ తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలను వినిపించారు. హైకోర్టు స్పందిస్తూ మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని తెలిపింది. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పేలా అవుతుందో చెప్పాలంటూ హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా, ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతుందా అని పిటిషనర్‌ను అడిగింది. ప్రపంచం ఇప్పుడు గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకప్పుడు దేశంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ మాత్రమే ఉండేదని, ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కు అనుమతి ఇచ్చాక కొన్ని రాణించలేక పోయినా, పలు    సంస్థలు సక్సెస్ అయ్యాయని కోర్టు తెలిపింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, కార్మికుల ఆత్మహత్యలు,   జీత భ...

ముగిసిన సమావేశం..సమ్మె యధాతధం

చిత్రం
ఆర్టీసీ కార్మికులు నెలన్నర రోజులుగా చేస్తున్న సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కొనసాగించాలా లేక వద్దా అనే అంశంపై జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అంద లేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చిస్తామని, తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత తమ నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌ లో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె అంశంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ మీటింగ్ లో చర్చించారు. అంతకు ముందు కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను డిపోల వారీగా సేకరించారు. టీఎంయూ,  ఈయూ,  ఎస్టీఎఫ్, టీజేఎంయూ నేతలు సమావేశమై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమా...