రూట్ల ప్రైవేటీకరణపై కీలక కామెంట్స్


రూట్ల ప్రైవేటీకరణపై రాష్ట్ర ధర్మాసనం కీలక కామెంట్స్ చేసింది. కేబినెట్ తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలను వినిపించారు. హైకోర్టు స్పందిస్తూ మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని తెలిపింది. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పేలా అవుతుందో చెప్పాలంటూ హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా, ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.

రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతుందా అని పిటిషనర్‌ను అడిగింది. ప్రపంచం ఇప్పుడు గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకప్పుడు దేశంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ మాత్రమే ఉండేదని, ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కు అనుమతి ఇచ్చాక కొన్ని రాణించలేక పోయినా, పలు    సంస్థలు సక్సెస్ అయ్యాయని కోర్టు తెలిపింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, కార్మికుల ఆత్మహత్యలు,   జీత భత్యాలు, తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది.

ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీ కరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్‌ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలిపారు. జీఓ వచ్చాకే కేబినెట్ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని, రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు. తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. పిల్‌ను డిస్మిస్‌ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. మొత్తం మీద సమ్మె ప్రభావం కార్మికులపై చూపనుంది.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!