సోషల్ మీడియాలో మోదీ ప్రభంజనం..కొనసాగుతున్న హవా..!

భారత దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదరదాస్ మోదీ పాలనలో తనదైన ముద్రతో దూసుకు వెళుతున్నారు. మోదీ అండ్ అమిత్ షా టీమ్ ఇప్పుడు ఏది చెబితే అదే వేదం ..అదే చట్టం ..అదే శాసనం ..అదే రాజ్యాంగం కూడా. రెండవ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ భారతీయ జనతా పార్టీ లో భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఈ దేశంలో మోదీకి ఉన్నంత ఫాలోయింగ్ ఇంకే నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మోదీ వాడుకున్నంతగా ఇంకే నాయకుడు, నాయకురాలు వాడు కోవడం లేదు ఇప్పుడు ఇండియాలో. మొదటి సారి అయన ప్రచారం మొత్తం సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా సాగింది. ఇందుకు తనకంటూ నమ్మకమైన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు మోదీ . నమో మోదీ అంటూ ప్రపంచం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు ఈ పీఎం. ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో టీ అమ్మిన మోదీ ఇప్పుడు 130 కోట్ల జనాభా కలిగిన అఖండ భారత దేశానికి దిశా నిర్దేశనం చేసే స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన హవా నడుస్తోంది. ఎక్కడికి తాను వెళితే అక్కడ జనం పోగవుతున్నారు. ఓ వైపు అమెరికా ప్రెసిడెంట్ ఇలాగే సోషల్ మీడియాను ఓ సాధ...