సోషల్ మీడియాలో మోదీ ప్రభంజనం..కొనసాగుతున్న హవా..!

భారత దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదరదాస్ మోదీ పాలనలో తనదైన ముద్రతో దూసుకు వెళుతున్నారు. మోదీ అండ్ అమిత్ షా టీమ్ ఇప్పుడు ఏది చెబితే అదే వేదం ..అదే చట్టం ..అదే శాసనం ..అదే రాజ్యాంగం కూడా. రెండవ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ భారతీయ జనతా పార్టీ లో భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఈ దేశంలో మోదీకి ఉన్నంత ఫాలోయింగ్ ఇంకే నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మోదీ వాడుకున్నంతగా ఇంకే నాయకుడు, నాయకురాలు వాడు కోవడం లేదు ఇప్పుడు ఇండియాలో. మొదటి సారి అయన ప్రచారం మొత్తం సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా సాగింది. 

ఇందుకు తనకంటూ నమ్మకమైన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు మోదీ . నమో మోదీ అంటూ ప్రపంచం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు ఈ పీఎం. ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో టీ అమ్మిన మోదీ ఇప్పుడు 130 కోట్ల జనాభా కలిగిన అఖండ భారత దేశానికి దిశా నిర్దేశనం చేసే స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన హవా నడుస్తోంది. ఎక్కడికి తాను వెళితే అక్కడ జనం పోగవుతున్నారు. ఓ వైపు అమెరికా ప్రెసిడెంట్ ఇలాగే సోషల్ మీడియాను ఓ సాధనంగా, ఆయుధంగా మలుచుకున్నారు. ట్రంప్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాను దున్నేస్తున్నారు మోదీ. మొదటి సారి కొలువు తీరినప్పుడు ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కోశోర్. దీంతో పవర్ లోకి వచ్చిన వెంటనే డిజిటల్ మీడియా , సోషల్ మీడియాలో ఇండియాలో టాప్ రేంజ్ లో నిలిచారు ఈ ప్రధాన మంత్రి. 

ఆయన డిజిటల్ జపం చేస్తున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు డిజిటల్ టెక్నాలజీ ని ఉపయోగించు కోవాలని కోరుతున్నారు. ప్రతి రంగం దీనిని ఫాలో కావాలని ఆదేశించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తరించేలా మోదీ కొన్ని తాయిలాలు ప్రకటించారు. స్టార్ట్ అప్ ల కోసం ప్రత్యేకంగా స్టార్ట్ అప్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. మోదీ తాను మిగతా వారి కంటే సోషల్ మీడియాను వాడుకోవడంలో ముందంజలో కొనసాగుతున్నారు. పేస్ బుక్ , లింక్డ్ ఇన్ , ఇష్ట గ్రామ్, యూట్యూబ్ , ట్విట్టర్ , తదితర మాధ్యమాల్లో చురుకుగా స్పందించడం, అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా ఎవరైనా స్పందించినా లేదా సమస్య ఏకరువు పెట్టినా వెంటనే రెస్పాన్స్ ఇస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులను పురమాయిస్తున్నారు. దీంతో ఏ నేతకు లేని రీతిలో ట్విట్టర్ లో మోదీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ట్విట్టర్ లో మోదీజీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 5 కోట్ల కు చేరుకుంది. మోదీ తర్వాత షారుఖ్ ఖాన్ , అమితాబ్ బచ్చన్ , సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్, సచిన్ , కోహ్లీ , హృతిక్ రేషన్ , అమీర్ ఖాన్ , మహేష్ బాబు, రజనీ కాంత్, కమల్ హాసన్ , ప్రభాస్ , రవితేజ , ఎన్ఠీఆర్ , అజహరుద్దీన్, నాగార్జున , సమంత ,లాంటి వాళ్ళు ఎందరో ట్విట్టర్ లో అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పాలనలోనే కాదు  సోషల్ మీడియాలో సైతం తనకు ఎదురే లేదని చాటి చెబుతున్నారు మోదీ. 

కామెంట్‌లు