మొబైల్ ఫుడ్ ట్రక్స్ ను ప్రారంభించిన మారియట్ ఇంటర్నేషనల్

ప్రపంచం నివ్వెర పోయేలా మారియట్ ఇంటర్నేషనల్ హోటల్స్ సంస్థ ఇండియాలో కొత్తగా మొబైల్ ఫుడ్ ట్రక్స్‌ను ప్రారంభించింది. ధనవంతులు, ఐటీ దిగ్గజాలు, కంపెనీలు, సంస్థలు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఇష్టపడే హోటల్స్‌లలో మారియట్ ఒకటి. ఇందులో ఉండడం అంటే అదో స్టేటస్ సింబల్‌గా భావిస్తారు చాలా మంది. జనం అభిరుచులు మారాయి. ఇపుడంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దే హవా నడుస్తోంది. ఓ వైపు రితీష్ అగర్వాల్ ఓయోతో దిమ్మ తిరిగేలా వ్యాపారాన్ని నిర్వహిస్తూ..బిగ్ హోటల్స్‌కు దడ పుట్టిస్తుంటే.. మరో వైపు మధ్యతరగతి ప్రజలు , కుటుంబాలు ఎక్కువగా ఉండే భారతదేశాన్ని ఎంపిక చేసుకుంది ఈ బిగ్ ఇంటర్నేషనల్ హోటల్ యాజమాన్యం. వ్యాపారంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా ..అంతిమంగా కస్టమర్లే దేవుళ్లు అనాల్సిందే. వాళ్లు లేక పోతే వ్యాపారమే లేదు. ఏ సంస్థకైనా..ఏ కంపెనీకైనా. మందు బాబులు, ప్రియుల కోసం ఆల్ రెడీ ఎక్కడ పడితే అక్కడ బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, పబ్‌లు ఉన్నాయి. రిసార్ట్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రేవా పార్టీలు, డ్యాన్సులు, బారాత్‌లు, తాగడాలు, ఊగడాలు ఉన్నాయి. జాతీయ రహ...