మొబైల్ ఫుడ్ ట్ర‌క్స్ ను ప్రారంభించిన మారియ‌ట్ ఇంట‌ర్నేష‌న‌ల్

ప్ర‌పంచం నివ్వెర పోయేలా మారియ‌ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్స్ సంస్థ ఇండియాలో కొత్త‌గా మొబైల్ ఫుడ్ ట్ర‌క్స్‌ను ప్రారంభించింది. ధ‌న‌వంతులు, ఐటీ దిగ్గ‌జాలు, కంపెనీలు, సంస్థ‌లు, వ్యాపార‌వేత్తలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే హోట‌ల్స్‌ల‌లో మారియ‌ట్ ఒక‌టి. ఇందులో ఉండ‌డం అంటే అదో స్టేట‌స్ సింబ‌ల్‌గా భావిస్తారు చాలా మంది. జ‌నం అభిరుచులు మారాయి. ఇపుడంతా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్ దే హ‌వా న‌డుస్తోంది. ఓ వైపు రితీష్ అగ‌ర్వాల్ ఓయోతో దిమ్మ తిరిగేలా వ్యాపారాన్ని నిర్వ‌హిస్తూ..బిగ్ హోట‌ల్స్‌కు ద‌డ పుట్టిస్తుంటే..
మ‌రో వైపు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు , కుటుంబాలు ఎక్కువ‌గా ఉండే భార‌త‌దేశాన్ని ఎంపిక చేసుకుంది ఈ బిగ్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్ యాజ‌మాన్యం. వ్యాపారంలో ఎంతో ఉన్న‌త స్థానంలో ఉన్నా ..అంతిమంగా క‌స్ట‌మ‌ర్లే దేవుళ్లు అనాల్సిందే. వాళ్లు లేక పోతే వ్యాపారమే లేదు. ఏ సంస్థ‌కైనా..ఏ కంపెనీకైనా. మందు బాబులు, ప్రియుల కోసం ఆల్ రెడీ ఎక్క‌డ ప‌డితే అక్క‌డ బార్లు, రెస్టారెంట్లు, మ‌ద్యం దుకాణాలు, ప‌బ్‌లు ఉన్నాయి. రిసార్ట్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రేవా పార్టీలు, డ్యాన్సులు, బారాత్‌లు, తాగ‌డాలు, ఊగ‌డాలు ఉన్నాయి.
జాతీయ ర‌హ‌దారుల ప‌క్క‌న ..ఇటీవ‌ల ఫుడ్ కోర్టులు ఎక్కువ‌గా వెలుస్తున్నాయి. జ‌నానికి టైం దొర‌క‌డం లేదు. అందుకే ఫాస్ట ఫుడ్ ను ఎక్కువ‌గా ప్రిఫ‌ర్ చేస్తుండ‌డంతో హోట‌ల్స్ త‌మ పంథాను మార్చుకుంటున్నాయి. అందుకే మారియ‌ట్ లాంటి హొట‌ల్ చివ‌ర‌కు మొబైల్ ఫుడ్ ట్ర‌క్ పేరుతో ఓపెన్ చేయాల్సి వ‌చ్చిందంటే అర్థం చేసుకోవ‌చ్చు. మార్కెట్లో ఎంత పోటీ ఉందో. మారియ‌ట్ ఆన్ వీల్స్ ట్యాగ్ లైన్‌తో వీటిని దేశ వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో లాంఛ్ చేసింది.
మొద‌ట‌గా ర‌ద్దీగా ఉండే సిటీగా పేరొందిన ముంబైలో ప్రారంభించి మారియ‌ట్ . అహ్మ‌దాబాద్, అమృత్‌స‌ర్, ల‌క్నో, పూణే, మ‌దురై, కొచ్చి న‌గరాల్లో ఇవి అందుబాటులోకి వ‌స్తాయి. ఏప్రిల్ 7న అహ్మ‌దాబాద్‌లోని ఫుడ్ ట్ర‌క్ పార్క్ ద‌గ్గ‌ర‌, 13న అమృత్స‌ర్ లోని క‌బీర్ పారిక్ మార్కెట్ ద‌గ్గ‌ర‌, 18న ల‌క్నోలోని స‌హారా ప్లాజా మార్కెట్ వ‌ద్ద‌, 30న మ‌దురై హెచ్‌సీఎల్ కాంప్లెక్స్‌లో , మే 5న ఇన్ఫోసిస్ పార్క్ ద‌గ్గ‌ర కొచ్చిలో , 14న పూణెలోని మారిప్లెక్స్ ..ఇఓఎన్ వ‌ద్ద ఈ మొబైల్ ఫుడ్ ట్ర‌క్‌లు అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన ఫుడ్ ఐట‌మ్స్ అన్నీ దొరికేలా ఇందులో ఉంచారు. సో ..ఫుడ్ కు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. అందుకే హోట‌ల్స్ కొత్త దారులు ఎంచుకుంటున్నాయి. అవును..డ‌బ్బులు ఊరికే రావు క‌దూ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!