జెట్ ఇంజ‌న్స్ కోసం..ఇండిగో 20 బిలియ‌న్ల డీల్

భార‌తీయ విమాన‌యాన రంగంలో ఇండిగో మెల మెల్ల‌గా త‌న వ్యాపారాన్ని విస్త‌రించుకుంటూ వెళుతోంది. త‌క్కువ ధ‌ర‌కే విహంగ వీక్ష‌ణం క‌లిగించేలా..ప్ర‌యాణికుల మ‌న‌సు దోచుకునేలా ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తోంది. ఇటీవ‌లే స‌మ్మ‌ర్ సేల్స్ పేరుతో భారీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించింది. ఇత‌ర విమాన‌యాన సంస్థ‌ల నుండి పోటీని త‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది ఆప‌రేష‌న్స్ టీం. దేశీయంగా త‌క్కువ ఫేర్స్‌ను ఈ సంస్థ నిర్ణ‌యించింది. మార్కెట్‌లో స్టేబుల్‌గా ఉండేలా చూసుకుంటోంది. స్లోగా మూవ్ అవుతూ..మ‌రింత బ‌ల‌ప‌డేందుకు చ‌ర్య‌లు చేప‌డుతోంది. దేశీయంగా చూస్తే కొత్త విమానాశ్ర‌యాలు ఏర్పాట‌య్యాయి. 

ఆయా ప్రాంతాల‌కు వ్యాపార ప‌రంగా , ఇత‌ర ప‌నుల నిమిత్తం వేలాది మంది ఇండియాలోని స్టేట్స్‌తో పాటు ఇత‌ర దేశాల‌కు ప్ర‌యాణం చేస్తూనే వుంటారు. ప్ర‌యాణికుల అవ‌స‌రాలు, అభిరుచుల‌కు అనుగుణంగా ఆయా దేశీయ‌, విదేశీ ఎయిర్‌లైన్స్‌లు విమానాలు న‌డుపుతుంటాయి. ఫ్ల‌యిట్స్‌ను నిర్వ‌హించ‌డం, ప్ర‌యాణికుల‌ను చేర‌వేయ‌డం చాలా రిస్క్ తో కూడుకున్న ప‌ని. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వీటి నిర్వ‌హ‌ణ క‌త్తి మీద సాములాగా తయారైంది ఆయా ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఎయిర్ లైన్స్‌ల‌కు. భారీగా డిమాండ్ ఉండ‌డంతో ఇండిగో యాజ‌మాన్యం తాజాగా 280 జెట్ ఇంజ‌న్ల కోసం ఆర్డ‌ర్స్ ఇచ్చింది. 

ఇందు కోసం ఏకంగా 20 బిలియ‌న్ డాల‌ర్లను ఇచ్చేందుకు గాను జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ కంపెనీతో ఎంఓయు చేసుకుంది. ఈ కంపెనీ ఫ్రాన్స్ దేశంలోని స‌ఫ్రాన్ న‌గ‌రంలో ఏర్పాటై వున్న‌ది. ట్రావెల‌ర్స్ ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా వుండేందుకు, అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు గాను ఇండిగో సంస్థ ఈ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకుంది. ఈ భారీ పెట్టుబ‌డితో ఎస్ఇ ఏ 32 నియో విమానాల‌ను తీసుకోనుంది. ఇంట‌ర్ గ్లోడ్ ఏవియేష‌న్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో ఆప‌రేష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ప‌వ‌ర్ ఎయిర్ బ‌స్ ఏ32నియోను తీసుకుంటారు. స‌ర్వీస్ అండ్ మెయింటెనెన్స్ చూస్తుంది. 2020లో
ఇవ‌న్నీ ఇక్క‌డికి రానున్నాయి. సంస్థ సిఇఓ రోనో జాయ్ ద‌త్తా డీల్ వివ‌రాలు వెల్ల‌డించారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!