పేద‌ల పాలిట దేవుడు ఈ క‌లెక్ట‌ర్ - జ‌నం చెంత‌కు బైక్ అంబులెన్స్‌లు

కొంద‌రు క‌లెక్ట‌ర్లు అధికార ద‌ర్పాన్ని చెలాయిస్తుంటే..మ‌రికొంద‌రు ఐఏఎస్‌లు మాత్రం పేదల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సింది ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని క‌బీర్‌ధాం జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న అవ‌నీష్ శ‌ర‌న్ గురించి. ఆదివాసీలు, గిరిజ‌నులు అత్య‌ధికంగా ఈ ప్రాంతంలో నివ‌సిస్తున్నారు. వారు అత్యంత పేద‌లు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని ప‌రిస్థితుల్లో బ‌తుకుతున్నారు. వీరిలో అత్య‌ధికంగా రోగ‌పీడిత బాధితులే. ఎక్క‌డికైనా వెళ్లాలంటే చికిత్స కోసం..కొన్ని మైళ్ల దూరం వెళ్లాల్సిందే. 

ద‌గ్గ‌ర‌లో ఆస్ప‌త్రులు లేవు. ర‌వాణా సౌక‌ర్యాలు అంతంత మాత్ర‌మే. దీంతో చికిత్స త‌డిసి మోపెడంత అవుతుంది. చూయించు కోవాలంటే అప్పులు చేయాల్సిందే. దీంతో విష‌య తీవ్ర‌త‌ను క‌లెక్ట‌ర్ శ‌ర‌న్ గ‌మ‌నించారు. ఏం చేస్తే వీరికి త‌క్కువ ఖ‌ర్చులో వైద్య సేవ‌లు అందించ‌వ‌చ్చో సీరియ‌స్‌గా ఆలోచించారు. అందులోంచి వ‌చ్చిందే బైక్ అంబులెన్స్ . వంద‌లాది బైక్ అంబులెన్స్‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాటు చేశారు. ప్రాథ‌మికంగా ఆయా గుడిసెల్లో నివాసం వుంటున్న వారితో పాటు ఇత‌రుల గ‌డ‌ప‌ల వ‌ద్ద‌కే ఈ అంబులెన్స్‌లు వెళ్లేలా చేయ‌గ‌లిగారు. 

దీంతో 90 శాతం ఆరోగ్య సేవ‌ల ఖ‌ర్చులు త‌గ్గాయి. స‌మ‌యం క‌లిసొచ్చింది. డ్రైవ‌ర్, ఆశా వ‌ర్క‌ర్, అటెండెంట్, రోగి ..ఇలా ఒక‌దానికి మ‌రొక‌టి లింక్ వుండేలా ప్లాన్ చేశారు. మోటార్ బైక్ అంబులెన్స్ ..రిమోట్ విలేజెస్‌ల‌లో నిత్యం సేవ‌లు అందించేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ జిల్లాలో న‌క్స‌ల్స్ ప్ర‌భావం ఎక్కువ‌. కోయిలారి విలేజ్‌లో మ‌రీ ఎక్కువ‌. ఈ ఊరి ప్ర‌జ‌లకు సుస్తీ చేస్తే ..డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే క‌నీసం 12 కిలోమీట‌ర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఊరితో పాటు దాల్దాలి ఊరు కూడా ఉంది. ఇక్క‌డ ఎక్కువ‌గా గ‌ర్భిణీ స్త్రీలు ఎక్కువ‌గా వున్నారు. వీరికి ఇబ్బంది లేకుండా వుండేలా బైక్ అంబులెన్స్‌లు ఉన్న చోట‌నే వైద్య చికిత్స‌లు అందిస్తున్నాయి.

దీంతో ఎంతో కాలంగా ఎదురుకుంటూ వ‌స్తున్న ఈ సీరియ‌స్ ఇష్యూ క‌లెక్ట‌ర్ శ‌ర‌న్ చొర‌వ‌తో అంబులెన్స్ సాయంతో పూర్తిగా తొల‌గి పోయింది. బైగా తెగ‌కు చెందిన ఆదివాసీలు వీటి మీదే ఆధార‌ప‌డ్డారు. ఇక్క‌డ లేబ‌ర్ కూలీలు అత్య‌ధికంగా వున్నారు. వీరికి అడ‌వే ఆధారం. బ‌త‌కాలంటే ఎక్కువ రిస్క్ ను ఫేస్ చేస్తారు. మోటార్ బైక్ అంబులెన్స్‌ల‌లో వైద్య సిబ్బందితో పాటు చికిత్స‌కు అవ‌స‌ర‌మైన మందులు, సూదులను ఉంచారు. 2018 ఏప్రిల్‌లో క‌బీర్ ధాం జిల్లా క‌లెక్ట‌ర్‌గా శ‌ర‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రాత్రి 11.20 నిమిషాల‌కు ఆషా వ‌ర్క‌ర్ క‌నిహారిన్ బాయి డెలివ‌రీ కోసం ఇబ్బంది ప‌డుతుంటే ఆమె గ‌డ‌ప త‌ట్టింది.

వెంట‌నే బైక్ అంబులెన్స్ ద్వారా దాల్దాలి ప్రైమ‌రీ హెల్త్ కేర్ సెంట‌ర్‌కు ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్లింది. ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. బ‌స్త‌ర్ అంతా అడ‌వే..ఇక్క‌డంతా న‌క్స‌ల్స్ రాజ్య‌మే. నిరంత‌రం పోలీసుల కాల్పుల మోత‌. ఓ వైపు సీఆర్పీఎఫ్ ద‌ళాలు మ‌రో వైపు న‌క్స‌ల్స్ అడుగు జాడ‌లు. వీరి మ‌ధ్య బైక్ అంబులెన్స్‌లు రుయ్ మంటూ ప‌రుగులు తీస్తున్నాయి. శ‌ర‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఎంద‌రికో పేద‌లకు వైద్యం అందుతోంది. ఉద్యోగం అంటే బాధ్య‌త‌. అన్నింటికంటే ఐఏఎస్ కొలువంటే ..ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. శ‌ర‌న్ చేసిన ఈ ప‌ని ఎంద‌రికో స్ఫూర్తి క‌లుగ చేస్తోంది. మ‌న రాష్ట్రంలోని ఐఏఎస్‌లు ఇలా ఆలోచిస్తే ..మ‌న క‌ష్టాలు తీరే అవ‌కాశం ఉంది క‌దూ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!