విమానాలు ఎగిరేనా..జెట్ కుదురుకునేనా..!
భారతీయ విమానయాన రంగంలో రెండో అతిపెద్ద ఎయిర్‌వేస్ సంస్థగా పేరున్న జెట్ ఎయిర్‌వేస్ ఇపుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముంబయి కేంద్రంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దాదాపు 20 వేల మందికి పైగా ఈ సంస్థనే నమ్ముకుని ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి విమాన సర్వీసులను నిలిపి వేయడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అసలు సంస్థను గట్టెక్కించేందుకు యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. జెట్ స్పీడ్‌తో స్టార్టింగ్‌లో ప్రారంభమైన జెట్ ఎయిర్ వేస్ ఇపుడు ఎగరలేక చతికిలపడింది. అత్యవసరంగా నిధులు ఇవ్వగలిగితే కొంతలో కొంతైనా సంస్థ గట్టెక్కగలదంటూ విమానయాన రంగానికి చెందిన వారు భావించారు. కానీ సంస్థ కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం జీతాలు ఇచ్చుకోలేని స్థితికి దిగజారిన జెట్ ఎయిర్ వేస్ అంతర్జాతీయ సర్వీసులను నిలిపి వేసింది. కంపెనీ బోర్డు రుణదాతల నుండి సానుకూల స్పందన లభిస్తుందని ఆశించిన వారికి పాజిటివ్ సిగ్నల్ రాలేదు. దీంతో సంస్థ మనుగడపై నీలి నీడలు నమ్ముకున్నాయి. క...