లోకాన్ని ఆవిష్కరిస్తున్న ఐ స్టాక్ ఫోటో
ప్రపంచాన్ని పరిచయం చేయాలంటే చాలా సమయంతో పాటు అపరిమితమైన శక్తి ..వనరులు కావాలి. కానీ టెక్నాలజీ పుణ్యమా అంటూ అన్నీ మన ముంగిట్లోనే వాలి పోతున్నాయి. మన గుండెల్లో నిక్షిప్తమై పోయేలా ..మనల్ని వెంటాడేలా చేసేవి ..అందమైన జీవితాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు కేవలం ఫోటలలో ప్రతిఫలిస్తాయి. దీనికంతటికి కెమెరాలు కావాలి. వాటిని తీసే నైపుణ్యం మనకు ఉండాలి. ఒక్కో ఫోటోకు ఒక్కో కథ వుంటుంది. ప్రతి దృశ్యం మనల్ని నిద్రలో సైతం పలకరిస్తాయి. అంతలా అవి మనలో భాగమై పోతాయి. గూగుల్, ఫేస్ బుక్, టంబ్లర్, ఇన్ స్టాగ్రాం , ఫ్లికర్ తదితర సామాజిక మాధ్యమాలలో రోజుకు మిలియన్ల కొద్దీ ఫోటోలు అప్ లోడ్ అవుతున్నాయి. ప్రతి ఫోటో బాగుండాలన్న నిబంధనలేవీ లేక పోయినప్పటికీ ..ప్రతి ఫ్రేం ఒక్కో ఆలోచనను ఆవిష్కరించేలా చేస్తుంది.
వరల్డ్ వైడ్ గా జీవితాన్ని..ప్రపంచాన్ని..సమాజాన్ని ప్రతిఫలించే ప్రతి సన్నివేశాన్ని ఫోటోలలో బంధించి ..నిక్షిప్తం చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచనల్లోంచి పుట్టిందే ఐ -స్టాక్ . మిలియన్ల కొద్దీ ఫోటోలు ఇందులో నిక్షిప్తమై పోయాయి. క్లిప్ ఆర్ట్, వీడియోస్, ఆడియో ట్రాక్స్ కు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఒకటి నుండి మూడు డాలర్ల దాకా నచ్చినవాటిని సంస్థ అనుమతితో కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశం కూడా ఇందులో ఉంది. అయితే కోట్లాది ఫోటోలు మనల్ని పలకరిస్తాయి. వాటి పట్ల ప్రేమను పెంచుకోకుండా వుండలేం. అంతలా అద్భుతమైన ఫోటోలు ఎప్పటికప్పుడు నిక్షిప్తమై పోతున్నాయి. లక్షలాది మంది తమకు నచ్చిన ఫోటోలను దీని ద్వారా పంచుకుంటున్నారు. ప్రారంభించిన కొద్ది సమయంలోనే ఐ స్టాక్ ప్రపంచపు ప్రజలను ఆకట్టుకుంది.
ప్రతి ఫోటో జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. అంతేనా మనల్ని మనం గుర్తుంచుకునేలా చేస్తుంది. ఇదే మా ప్రయత్నం. ప్రతి ఇంట్లో ..లోకంలో ఎక్కడికి వెళ్లినా గోడల వారీగానో టేబుళ్ల దగ్గరనో ఫోటోలు తప్పక వుండి వుంటాయి. మన గతకాలపు గుర్తులు ఫోటోలు. ఇందులో సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. కళాకారులు, డిజైనర్లు, ఫోటోగ్రాఫర్లు ప్రపంచంలోని వారంతా స్వచ్ఛందంగా ఈ సంస్థకు తమ ఫోటోలను అందజేస్తున్నారు. సంస్థ వీరు చేసిన కృషికి గుర్తింపుగా కొంత రాయల్టీని అందజేస్తోంది. ఏమో అదృష్టం బావుండి మన ఫోటోను ఎక్కువ మంది లైక్ చేయవచ్చు లేదంటే కొనుగోలుకు ఇష్టపడొచ్చు. అలాంటి అరుదైన అవకాశాన్ని ఐ స్టాక్ కల్పిస్తోంది. ఐ స్టాక్ ఫోటో ను విభిన్నమైన రీతిలో డిజైన్ చేశారు నిర్వాహకులు. ప్రతి నెలలో 50 లక్షల మంది తమ జ్ఞాపకాలకు గుర్తులుగా వున్న..తాము తీసుకున్న స్వంత ఫోటోలను ఇందులో దాచుకుంటున్నారు. ప్రపంచానికి తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. రోజు రోజుకు ఐ స్టాక్ ఊహించని స్థాయికి చేరుతోంది.
ఎవ్వాల్స్ మీడియా సహకారంతో లివింగ్‌స్టన్ వెబ్ డెవలప్‌మెంట్ తోడ్పాటుతో 2000 సంవత్సరంలో బ్రూస్ లివింగ్ స్టన్ ఐ స్టాక్ ఫోటో కంపెనీని ఏర్పాటు చేశాడు. మొదట్లో ఇందులో ఫోటోలు అప్ లోడ్ చేయాలంటే కొంత చెల్లించాల్సి వుండేది. దీనిని 2001వ సంవత్సరం నుండి స్టార్ట్ చేశారు. 9 ఫిబ్రవరి 2006లో 50 మిలియన్ల విలువ చేసే ఫోటోలు ఇందులో ఉన్నాయి. అప్ లోడ్ అయిన ఫోటోల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో మెల మెల్లగా ఐ స్టాక్ ఫోటో పుంజుకుంది. ఒక సంస్థగా నిలబడింది. 31 మార్చి 2007లో నిర్వహణ కష్టంగా మారడంతో ఐ స్టాక్ ఫోటోను 71.9 మిలియన్ డాలర్లకు ప్రైవేట్ ఫర్మ్ కు అమ్మారు. వచ్చిన డబ్బులతో పార్ట్‌నర్స్‌కు పంచారు. తర్వాత దీనిని తిరిగి నడిచేలా చేశారు.
ఎలాంటి నాలెడ్జ్ వుండాల్సిన పనిలేదు. కేవలం ఓ ఈమెయిల్ అకౌంట్ మీకు స్వంతంగా వుంటే చాలు. ఇందులో ఉచితంగా చేరి పోవచ్చు. మీకు చెందిన ఫోటోలను ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే అప్ లోడ్ చేసేయొచ్చు. 15 శాతం 40 శాతం మధ్యన ఫోటోలు అమ్మితే తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. 2008లో ఐ స్టాక్ ఫోటో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. నియమ నిబంధనలను కఠినతరం చేశారు. లైసెన్స్ అగ్రిమెంట్ రూపొందించారు. విలువైన ఫోటోలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో డాలర్ల పంట పండుతోంది. 2011లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సినిమా ద రూమ్మేట్ సినిమాకు మూవీ పోస్టర్‌ను ఐ స్టాక్ ఫోటో సంస్థ రూపొందించింది.
రోజు రోజుకు కోట్లాది ఫోటోలు ..లక్షలాది మంది ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారు. దీంతో మిగతా సామాజిక మాధ్యలతో ఐ స్టాక్ ఫోటో పోటీ పడుతోంది. డాలర్ల వర్షం కురవడంతో యాజమాన్యం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇపుడు ఈ సంస్థలో అప్ లోడ్ అయిన ఫోటోను కొనుగోలు చేయాలంటే ప్రతి ఫోటోకు సంస్థే కొంత రేటింగ్ నిర్ణయిస్తుంది. దీని ఆధారంగానే దానికి ధర ఉంటోంది. లాభాల బాటలో నడుస్తూ ..కోట్లాది ప్రజల హృదయాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న ఐ స్టాక్ ఫోటోలో మీరూ వెంటనే చేరిపోండి. మీ వెచ్చని జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా ఫోటోలను నిక్షిప్తం చేయండి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి