ప్రపంచం మెచ్చిన మహిళా నాయకురాలు - కరుణా గోపాల్ ..!

ఫ్యూచరిక్ సిటీస్ ..స్మార్ట్ సిటీస్ ..ఈ పేర్లు వింటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఒకే ఒక్కరు ..ఆమె కరుణా గోపాల్. వ్యక్తి నుండి సంస్థగా ఎదిగిన ఆమె ప్రయాణం స్ఫూర్తి దాయకంగా వుంటుంది. ఒక మహిళగా ..తల్లిగా..ఆంట్రప్రెన్యూర్‌గా..మెంటార్‌గా..ఫౌండర్‌గా..మేధావిగా..ప్రతిభ..తేజస్సు కలిగిన వ్యక్తిగా ఎదిగారు. ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచారు. ప్రస్తుతం బీజేపీలో కేంద్ర స్థాయిలో కీలకమైన భూమికను పోషిస్తున్నారు. మరో వైపు ఫ్యూచరిక్ సిటీస్‌ను స్థాపించి నగరాలను ఎలా కాపాడు కోవాలో తెలియ చేస్తున్నారు. ఐవిఎల్‌పీ ఫెలోగా ఉన్నారు. అమెరికాలో పేరొందిన హార్వర్డ్ యూనివర్శిటీలోని జాన్ ఎఫ్. కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మేధావిగా..ఆలోచనల్లో అత్యంత సునిశితమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్లినా థాట్ ..డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. స్మార్ట్ సిటీస్ గురించి ఆమె ఎన్నో పరిశోధనలు చేశారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. అపారమైన అనుభవాన్ని గడించారు. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిక్ సిటీస్ సంస్థకు ప్రస్తుతం అధ్య...