అక్బరుద్దీన్ దౌత్యం..పాక్ కు పరాభవం..నిను చూసి గర్విస్తోంది దేశం..!

నిన్నటి దాకా చిలుక పలుకులు పలుకుతూ, భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది పాకిస్థాన్ కు అంతర్జాతీయ వేదికపైన పరాభవం తప్ప లేదు. తాను నమ్ముకున్న అమెరికా మౌనం వహిస్తే, ఒక్క చైనా తప్ప ఏ ఒక్క కంట్రీ పాక్ కు మద్దతు పలకలేదు. ఇస్స్యూ సీరియస్ కావడంతో ..అంతర్జాతీయ భద్రత సంస్థలో చర్చకు వచ్చింది. పాకిస్థాన్ ను ఒంటరి ప్రపంచలో ఒంటరి చేయడంలోనూ, దౌత్య పరంగా సక్సెస్ చేయడంలో ఒకే ఒక్కడు కీలక పాత్ర పోషించారు. అతడెవరో కాదు సయ్యద్ అక్బరుద్దీన్ . ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత ప్రతినిధి గా , భారత రాయబారిగా ఉన్నారు. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తో పాటు దానికి వంత పాడిన చైనాకు పరాభవం జరిగేలా చేసాడు. ఇది తమ స్వంత వ్యవహారమని, వేరెవ్వరు ఇందులో జోక్యం చేసుకోలేరని స్పష్టం చేశారు సయ్యద్. దీనిపై ప్రపంచాన్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు మాను కోవాలని పాక్ ను హెచ్చరించింది. అంతర్జాతీయ వేదికపై తన గొంతును గట్టిగా, మరింత బలంగా వినిపించారు. ఆయన ప్రదర్శించిన దౌత్యం , దూకుడు భారతీయుల మనసు గెలుచుకుంది. టెర్రరిజాన్ని రూపు మాపేందుకు ప్రతి దేశం, దానిని పాలిస్తున్న పాలకులు కృషి చేయాలనీ పిలుపునిచ్చ...