వేతన జీవుల్లో గోద్రెజ్ సీయివో వివేక్ గంభీర్ టాప్

భారత దేశంలో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న సీయివో లలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు గోద్రెజ్ కంపెనీలో కన్స్యూమర్స్ సీయివో గా పని చేస్తున్న వివేక్ గంభీర్ కోట్లాది రూపాయల వార్షిక వేతనం తీసుకుంటూ చరిత్ర సృష్టించారు. 2018 - 2019
సంవత్సరానికి గాను ప్రకటించిన వేతనాలు తీసుకుంటున్న వారిలో ఆయనే ముందు వరుసలో నిలిచారు. తన పని తీరుతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఏడాదికి వేతనంతో పాటు అన్ని వసతులు , సౌకర్యాలు కలుపుకుని 20 కోట్ల 9 లక్షలు తీసుకుంటున్నారు.

హెచ్ యు ఎల్ కంపెనీకి చెందిన సీయివో సంజీవ్ మెహతా 18 .88 కోట్ల వేతనంతో రెండో స్థానంలో నిలిచారు. ఆయా కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే వీరిద్దరూ ఒకటి రెండో ప్లేస్ లో ఉన్నారు . ఎఫ్ ఎం సీజీ ప్రోడక్ట్స్ విభాగంలో హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ , నెస్లే ఇండియా  ఉండగా గోద్రెజ్ కన్స్యూమర్స్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ , డాబర్ , మరికో , ఎమామి ప్రోడక్ట్స్ ను ఇండియాలో విక్రయిస్తోంది. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంలో గోద్రెజ్ సీయివో గంభీర్ ఏకంగా 20 కోట్ల 9 లక్షల 42 వేల 847 రూపాయలు జీతంగా తీసుకున్నారు .

కంపెనీలో పనిచేస్తున్న 332 మంది మేజర్ ఉద్యోగుల వేతనాలతో సమానం ఈ సీయివో వేతనం. ఇక హెచ్ యు ఎల్ కంపెనీ డైరెక్టర్ సంజీవ్ వేతనం సదరు కంపెనీలో పనిచేస్తున్న 194 మందితో సమానం. నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ్ 11 కోట్ల 9 లక్షలు వార్షిక వేతనం తీసుకుంటూ మూడో స్థానంలో ఉన్నారు. డాబర్ కంపెనీ డైరెక్టర్ పీడీ నారంగ్ 10 కోట్ల 77 లక్షల 17 వేల రూపాయల వేతనంతో నాలుగో ప్లేస్ లో నిలిచారు. మారికో కంపెనీ ఎండీ అండ్ సీయివో సౌగుతా గుప్తా 9 .21 కోట్లతో ఆరో ప్లేస్లో ఉన్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!