విరాళాల్లో బీఎస్పీనే టాప్ - మాయావతా మజాకా

దేశంలో కార్పొరేట్ కంపెనీలన్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం మామూలే. ఏ పార్టీనైనా కేంద్రంలో కానీ లేదా ఆయా రాష్ట్రాలలో కొలువుతీరితే..ఆయా సంస్థలు, యాజమాన్యాలు ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలకు మామూళ్లు లేదా విరాళాల రూపేణా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆర్థిక నేరాలు ఎక్కడలేని విధంగా దేశ వ్యాప్తంగా పెరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే నేరస్థులు..రాజకీయ నాయకులు..వ్యాపారులు ముగ్గురూ దేశాన్ని నియంత్రించాలని చూస్తున్నారు. ఒకరకంగా పవర్లో ఎవరున్నప్పటికిని వీరు చెప్పిందే శాసనంగా మారుతోంది. దీంతో బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. ఒక పార్టీ గుర్తుతో పోటీ చేయడం. గెలుపొందాక మరో పార్టీలోకి జంప్ కావడం మామూలై పోయింది. ఆయా పార్టీలకు చెందిన అధినేతలు, చోటా మోటా నాయకులు వ్యాపారస్తులను , కంపెనీలను టార్గెట్ చేయడం ఇటీవలి కాలంలో ఫ్యాషన్ గా మారింది. ఎందుకొచ్చిన తంటా అంటూ వ్యాపారస్తులు తమకు తోచిన రీతిలో మామూళ్లు నెలనెలకు ..ఎన్నికల సమయంలో ఏక మొత్తంలో చెల్లిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. వ్య...