అంపైర్ నిర్ణయం - రేగిన దుమారం

ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో విండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ అవుట్ పై ఇచ్చిన అంపైర్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ డిసిషన్ పలు అంశాలను లేవనెత్తింది. కోట్లాది క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా, ఉత్సుకతతో, ఉత్కంఠతతో ఎదురు చూస్తూ వుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. దీనిని నియంత్రించే వ్యవస్థ లేక పోవడంతో అది చాపకింద నీరులా విస్తరించింది. క్రికెట్ ఒక్క ఇండియానే కాదు ఆసియా, ఆఫ్రికా, యుఎస్, తదితర దేశాలకు పాకింది. 24 మంది పిచ్చివాళ్లు ఆడుతుంటే..మరికొంది తిక్కోళ్లు చూసి ..కాలాన్ని వేస్ట్ చేస్తారంటూ అప్పట్లో కొందరు కామెంట్స్ చేసినా..ఇపుడు అదే జాతికి జీవగర్రగా మారింది. అంతలా ప్రతి కంట్రీని ఊపేస్తోంది. బంతికి బ్యాట్‌కు మధ్య జరిగే ఆసక్తికరమైన పోరులో ఎవరు గెలుస్తారనేది చివరి వరకు నరాలు తెగేంత టెన్షన్ నెలకొని ఉంటుంది ఈ క్రికెట్ మ్యాచ్‌ల్లో. 50 ఓవర్ల పరిమిత మ్యాచ్ అయినా లేదా 20 ఓవర్ల మ్యాచ్ అయినా దేనికదే ఉత్కంఠ. మ్యాచ్‌ల...