అంపైర్ నిర్ణ‌యం - రేగిన దుమారం

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో విండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్ గేల్ అవుట్ పై ఇచ్చిన అంపైర్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ డిసిష‌న్ ప‌లు అంశాల‌ను లేవ‌నెత్తింది. కోట్లాది క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా, ఉత్సుక‌త‌తో, ఉత్కంఠ‌తతో ఎదురు చూస్తూ వుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది  రూపాయ‌ల బెట్టింగ్ జ‌రుగుతోంది. దీనిని నియంత్రించే వ్య‌వ‌స్థ లేక పోవ‌డంతో అది చాప‌కింద నీరులా విస్త‌రించింది. క్రికెట్ ఒక్క ఇండియానే కాదు ఆసియా, ఆఫ్రికా, యుఎస్, త‌దిత‌ర దేశాల‌కు పాకింది. 24 మంది పిచ్చివాళ్లు ఆడుతుంటే..మ‌రికొంది తిక్కోళ్లు చూసి ..కాలాన్ని వేస్ట్ చేస్తారంటూ అప్ప‌ట్లో కొంద‌రు కామెంట్స్ చేసినా..ఇపుడు అదే జాతికి జీవ‌గ‌ర్ర‌గా మారింది. అంతలా ప్ర‌తి కంట్రీని ఊపేస్తోంది. 

బంతికి బ్యాట్‌కు మ‌ధ్య జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన పోరులో ఎవ‌రు గెలుస్తార‌నేది చివ‌రి వ‌ర‌కు న‌రాలు తెగేంత టెన్ష‌న్ నెల‌కొని ఉంటుంది ఈ క్రికెట్ మ్యాచ్‌ల్లో. 50 ఓవ‌ర్ల ప‌రిమిత మ్యాచ్ అయినా లేదా 20 ఓవ‌ర్ల మ్యాచ్ అయినా దేనిక‌దే ఉత్కంఠ‌. మ్యాచ్‌లు జ‌రుగుతున్నంత సేపు టీవీల‌కే అతుక్కుపోతారు ఫ్యాన్స్. చిన్నారులు, పిల్ల‌లు, పెద్ద‌లు, యువ‌తీ యువ‌కులు, మ‌హిళ‌లు, కుటుంబీకులు, వృద్ధులు, కులాలు, మ‌తాలు, వ‌ర్గాల‌ను ప‌క్క‌న పెట్టేసి మ్యాచ్‌ల‌ను చూసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. ఈ మ్యాచ్‌ల దెబ్బ‌కు ఆయా ఐటీ, ఇత‌ర కంపెనీల‌న్నీ త‌మ ఉద్యోగస్తుల కోసం ఏకంగా టీవీల‌ను ఏర్పాటు చేశారు. ఇక రెస్టారెంట్లు, హోట‌ళ్లు, ప‌బ్‌లు చెప్ప‌న‌క్క‌ర్లేదు. భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేస్తున్నాయి. స్టార్ యాజ‌మాన్యం డిఫ‌రెంట్ మోడ్‌లో వీటిని ప్ర‌సారం చేసేస్తోంది. ఈ స‌మ‌యంలో కోట్లాది క‌ళ్లు, చెవులు అన్నీ మ్యాచ్ జ‌రిగే దానిపైనే ఉంటాయి. 

ఒక్కో సారి ర‌నౌట్లు, క్యాచ్‌లు, ప‌రుగులు కీల‌క భూమిక పోషిస్తాయి. మ్యాచ్‌ల ఫ‌లితాల‌ను తారు మారు చేస్తాయి. క్రికెట్ మ్యాచ్‌ల్లో అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి ఏద‌న్నా ఉందంటే అది అంపైరింగ్. అటు ఆట‌గాళ్ల‌ను ఇటు ప్రేక్ష‌కుల‌ను కంట్రోల్ చేయ‌డం అన్న‌ది ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. తీసుకునే డిసిష‌న్స్‌ల‌లో ఎక్కువ‌గా కాంట్రోవ‌ర్షియ్‌ల్‌కు గుర‌య్యేది లెగ్ బిఫోర్ వికెట్‌ల విష‌యంలోనే. బ్యాట్స్ మెన్స్ మూడు వికెట్ల‌లో మ‌ధ్య వికెట్ కు అడ్డంగా నిల్చొని బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు బంతి నేరుగా నో లేదా మ‌డ‌మ నుండి పై స్థాయి వ‌ర‌కు బంతి తాకిన‌ట్ల‌యితే ఎల్‌బిడ‌బ్ల్యుగా ప్ర‌క‌టించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. గ‌తంలో తీసుకునే నిర్ణ‌యంపై అంత‌గా అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యేవి కావు. క్రికెట‌ర్లు కూడా లైట్‌గా తీసుకునే వారు. కానీ ఇపుడు ఆ ప‌రిస్థితి మారి పోయింది. టెక్నాల‌జీ మార‌డం, డిజిటిలైజేష‌న్ కావ‌డంతో ప్ర‌తి ఫ్రేమ్ ఇందులో నిక్షిప్త‌మ‌వుతోంది. 

తాజాగా, ఆస్ట్రేలియా..విండీస్ జ‌ట్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన మ్యాచ్‌కు వేదికైంది. మొద‌ట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. టార్గెట్ రీచ్ కావ‌డం కోసం బ‌రిలోకి దిగిన విండీస్ జ‌ట్టులో కీల‌క ఆట‌గాడు క్రిస్ గేల్ అవుట్ కావ‌డంపై దుమారం రేగింది. ఇన్నింగ్స్ లో మూడో వ‌వ‌ర్ ఐదో బంతిని ఫుల్ లెంగ్త్‌లో వేశాడు స్టార్క్. బంతి గేల్ ప్యాడ్‌ను తాకింది. అంపైర్ త‌క్ష‌ణ‌మే వేలు ఎత్తాడు. గేల్ అంతే వేగంగా రివ్యూ కోరాడు. బంత్ స్టంప్‌ను తాకేది కాద‌ని తేలడంతో గేల్ నాటౌట్‌గా మిగిలాడు. ఆ త‌ర్వాతి బంతికే మ‌ళ్లీ అంపైర్ అత‌డిని ఎల్బీగా ప్ర‌క‌టించాడు. తిరిగి స‌మీక్ష‌కు వెళ్లాడు క్రిస్. 

ఈ సారి బంతి స్టంప్‌ల‌కు మ‌రింత దూరంగా వెళ్ల‌లేద‌ని రిప్లైలో తేలింది. స్టార్క్ ఐదో ఓవ‌ర్లో మ‌ళ్లీ బౌలింగ్ కు వ‌చ్చాడు. ఈసారి బంతి ప్యాడ్ల‌కు తాక‌డం, అదే అంపైర్ వేలెత్త‌డం..గేల్ రివ్యూ కోరడం చ‌క‌చ‌కా జ‌రిగాయి. ఈసారి ల‌క్ వ‌రించ‌లేదు గేల్ కు. లెగ్ స్టంప్ ప‌క్క‌గా బంతి తాకిందని స‌మీక్ష‌లో తేలింది. దీంతో అంపైర్ ఔటిచ్చాడు. కొస‌మెరుపు ఏమిటంటే స్టార్క్ అంత‌కు ముందు బంతిని నోబాల్ వేశాడు. కానీ అంపైర్ గుర్తించ‌లేదు. దాన్ని నో బాల్‌గా ప్ర‌క‌టిస్తే..ఫ్రీ హిట్ ఆడాల్సి వ‌చ్చేది. మొత్తం మీద అంపైర్ల త‌ప్పిదాలు అటు ఆట‌గాళ్ల‌నే కాదు మ్యాచ్‌ల ఫ‌లితాల‌ను శాసించ‌బోతున్నారు. మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే త‌ప్ప ఇంకేం చేయ‌లేని ప‌రిస్థితి . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!