పోస్ట్‌లు

జులై 18, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

టీ బాక్స్ అదుర్స్..భారీగా ఇన్వెస్ట్ చేసిన ఎన్బీ వెంచ‌ర్స్

చిత్రం
ఉద‌యం నుంచి రాత్రి ప‌డుకునేంత దాకా శ్వాస పీల్చుకోకుండా ఉండ‌లేరేమో కానీ ఛాయ్ తాగ‌కుండా ఉండ‌లేరు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ర‌క‌ర‌కాల ఫ్లేవ‌ర్స్‌ల‌లో టీ దొరుకుతోంది. కోట్లాది మంది రోజూ తాగుతున్నారు. టీ తాగ‌కుండా ఉండ‌లేని స్థితికి చేరుకున్నారు. ఇండియాలో ఏర్పాటైన టీ బాక్స్ స్వ‌ల్ప కాలంలోనే టాప్ రేంజ్‌లోకి చేరుకుంది. డిఫ‌రెంట్ ఫ్లేవ‌ర్స్‌తో పాటు భిన్న‌మైన టీ ప్రొడ‌క్ట్స్‌ను విక్ర‌యిస్తోంది. 100 రూపాయ‌ల‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఈ టీబాక్స్ ద్వారా అమ్మే టీ పాకెట్ కొనుగోలు చేయాలంటే క‌నీసం 2 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. దీని టేస్ట్ అదుర్స్. అందుకే ఎన‌లేని డిమాండ్. ఒక్క‌సారి టీ బాక్స్ త‌యారు చేసిన తేయాకుతో టీ చేసుకుంటే ..జీవితాంతం మ‌రిచి పోలేరు. దీంతో ప్ర‌పంచ తేయాకు ప‌రిశ్ర‌మ‌లో ఈ కంపెనీ దుమ్ము రేపుతోంది. రోజు రోజుకు దీని ఆదాయం పెరుగుతుండ‌డంతో .. ఎన్బీ వెంచ‌ర్స్ అండ్ ఇత‌ర కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టాయి టీ బాక్సులో. 2017 డిసెంబ‌ర్ నాటికి 7 మిలియ‌న్లకు చేరుకుంది. బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న ఈ కంపెనీ త‌న వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించుకునే ప‌నిలో న...

యురేనియం..ఉరే న‌యం..పాల‌మూరు భ‌విత‌వ్యం..ప్ర‌శ్నార్థకం..న‌ల్ల‌మ‌ల‌కు ప్ర‌మాదం..!

చిత్రం
న‌ల్ల‌మ‌ల ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు కొండ గుర్తు. ప‌చ్చ‌ని అడ‌వితో పాటు పులులు, జంతువుల‌కు ఆల‌వాల‌మైన ఈ సుంద‌ర‌మైన నేల త్వ‌ర‌లోనే ధ్వంసానికి గురి కానున్న‌ది. ఇప్ప‌టికే క‌ల‌ప‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌గా మ‌రో వైపు వ‌జ్రాల‌కు నెల‌వైంద‌ని స‌ర్వేలు తేట‌తెల్ల‌డం చేయ‌డంతో బ‌డా బాబుల క‌న్ను దీనిపై ప‌డింది. సెజ్‌ల పేరుతో, ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుతో ప‌చ్చ‌ని పాల‌మూరును పాల‌కులు వందేళ్ల వెన‌క్కి నెట్టి వేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఈ పాల‌మూరును చూపించే చంద్ర‌బాబు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిలు ప్ర‌పంచ బ్యాంకుకు దాసోహ‌మ‌న్నారు. అందినంత మేర దండుకున్నారు. నిట్ట నిలువునా ముంచారు. ఈ జిల్లాను ద‌త్త‌త తీసుకున్న చంద్ర‌బాబు..స‌ర్వ‌నాశ‌నం చేశారు. తెలంగాణ‌ను ఎన్‌కౌంట‌ర్ల‌కు, అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా వివ‌క్ష ప్ర‌ద‌ర్శించారు. గ‌త పాల‌కుల ద‌మ‌న‌కాండ‌కు, ఫేక్ ఎన్‌కౌంట‌ర్ల‌కు ముక్కు ప‌చ్చ‌లార‌ని పిల్ల‌లు, యువ‌కులు, మ‌హిళ‌లు త‌మ ర‌క్తాన్ని ధార‌పోశారు. పిట్ట‌ల‌ను కాల్చిన‌ట్లు కాల్చేశారు. ఆనాడు సాగించిన మార‌ణ‌కాండ దెబ్బ‌కు ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌నే నినాదం బ‌లంగా పుంజుకుంది. అది పెద్ద ఉద్య‌మ...

ప్రైవేట్ యూనివ‌ర్శిటీల‌కు బార్లా..కార్పొరేట్ కంపెనీలకు ప‌చ్చ జెండా..జోరుగా విద్యా దందా ..!

చిత్రం
బ‌లిదానాలు, త్యాగాలు , పోరాటాలు, ఉద్య‌మాలు చేసి కోరి తెచ్చుకున్న తెలంగాణలో కార్పొరేట్ కంపెనీలు గ‌ద్ద‌ల్లా వాలిపోతున్నాయి. ఇప్ప‌టికే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు అడ్డాగా..నేరాలు, ఘోరాల‌కు కేరాఫ్‌గా ఈ రాష్ట్ర రాజ‌ధాని వినుతికెక్కింది. కేజీ టు పీజీ జ‌పం చేస్తున్న స‌ర్కార్ ...ప్ర‌భుత్వ బ‌డుల‌ను మూసి వేసేందుకు ప్లాన్ చేస్తోంది. క‌నీస వ‌స‌తులు లేక విద్యార్థులు రోడ్డెక్కుతుంటే..ఇంట‌ర్ ఫ‌లితాలు విద్యార్థుల‌ను బ‌లి తీసుకుంటే ..చోద్యం చూస్తోందే త‌ప్పా..చ‌ర్య‌లు చేప‌ట్టిన దాఖ‌లాలు లేవు. యూనివ‌ర్శీటీల‌లో మౌళిక వ‌స‌తులు క‌ల్పించ‌లేదు. ఇప్ప‌టి దాకా పూర్తి కాలం వీసీలు లేరు. ఖాళీలు వేల‌ల్లో ఉన్నాయి. భ‌ర్తీ మాత్రం లేనే లేదు. ఏడేళ్ల కాలంలో నిన్న గాక మొన్న నోటిఫికేష‌న్ వేశారు. దానికి ఎన్నో నిబంధ‌న‌లు. చాలా మంది ఉద్య‌మాల్లో పాల్గొని ..ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఆశ‌గా ఎదురు చూసిన పాపానికి కొలువులు రాక పోగా..వ‌య‌సు మాత్రం చావుకు ద‌గ్గ‌ర‌వుతోంది. ఈ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామా అన్న ఆందోళ‌న మొద‌లైంది నిరుద్యోగుల్లో. ఇదేమి అన్యాయ‌మంటూ ప్ర‌శ్నించే వారిని స‌ర్కార్ టార్గెట్ చేస్తోంది. అయినా పిల్ల‌లు విన‌డ...

తేల‌నున్న క‌ర్నాట‌క భ‌విత‌వ్యం - ఎమ్మెల్యే కిడ్నాప్ క‌ల‌క‌లం..!

చిత్రం
క‌న్న‌డ నాట హై డ్రామా న‌డుస్తోంది. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన డీకే శివ‌కుమార్ రంగంలోకి దిగినా ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. ఎలాగైనా ఈ అవ‌కాశాన్ని చేజిక్కించు కోవాల‌ని, ప‌వ‌ర్‌లోకి రావాల‌ని బీజేపీకి చెందిన య‌డ్యూరప్ప పావులు క‌దుపుతున్నారు. రోజుకో ట్విస్టుల‌తో మ‌రింత రాజ‌కీయాన్ని పండిస్తున్న క‌న్న‌డ పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ తండ్రీ కొడుకులు దేవెగ‌డౌ, కుమార స్వామిలు ఎట్టి ప‌రిస్థితుల్లోను త‌ప్పుకునేది లేదంటూ స్ప‌ష్టం చేశారు. ఆ మేర‌కు విధాన స‌భ‌లో స్పీక‌ర్‌ను క‌లిసిన సీఎం తాము త‌మ‌రు ఏ తేది నిర్ణ‌యించినా బ‌ల‌ప‌రీక్ష నిరూపించేందుకు రెడీగా ఉన్నామ‌న్నారు. మ‌రో వైపు సుప్రీంకోర్టులో రెబ‌ల్ ఎమ్మెల్యేలు తాము చేసిన రాజీనామాల‌ను ఆమోదించాల‌ని కోరుతూ స్పీక‌ర్‌ను ఆదేశించాలంటూ పిల్ వేశారు. దీనిపై ధ‌ర్మాస‌నం స్పీక‌ర్ కు విశిష్ట అధికారాలు ఉన్న మాట వాస్త‌వ‌మే..అయినంత మాత్రాన తానే సుప్రీం అనుకుంటే ఎలా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ ఆర్డ‌ర్ లేవ‌నెత్తింది. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక‌...

పూరీ సంచ‌ల‌నం .. ప‌డి లేచిన కెర‌టం

చిత్రం
మూడేళ్ల పాటు ఒక్క స‌క్సెస్ లేదు. టాలీవుడ్‌లో ..బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న సెన్సేష‌న‌ల్..డైన‌మిక్ డైరెక్ట‌ర్‌గా పేరొందిన పూరీ జ‌గ‌న్నాథ్ ..ఫీనిక్స్ ప‌క్షిలా తిరిగి విజయాన్ని స్వంతం చేసుకున్నారు. త‌న‌కు ఎదురే లేదంటూ నిరూపించుకున్నారు. ఆయ‌న స్థానంలో మ‌రొక‌రు ఉన్న‌ట్ల‌యితే ఈ పాటికే ఎప్పుడో ఆత్మ‌హ‌త్య చేసుకునే వారు. కోట్లాది రూపాయ‌లు స్వంతం చేసుకున్న ఈ డైరెక్ట‌ర్ ..ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ మ‌ధ్య డ్ర‌గ్స్ విష‌యంలో ఆయ‌న పేరు ప్ర‌ధానంగా వినిపించింది. ఇదే అంశంపై పూరీ జ‌గ‌న్నాథ్‌ను విచారించారు. సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. చేతుల్లో చిల్లిగ‌వ్వ లేకుండా చేసుకున్నారు. న‌మ్ముకున్న వారే న‌ట్టేట ముంచ‌డంతో ఆయ‌న రోడ్డు మీద నిల్చున్నారు. స‌క్సెస్‌లో త‌న చుట్టూ తిరిగిన వారంతా ..త‌ను కోల్పోయిన మ‌రుక్ష‌ణ‌మే రాకుండా పోయారు. ముఖం చాటేశారు.  ఫ్రీ అండ్ ఫ్రాంక్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్ విప‌రీత‌మైన వ‌త్తిడికి లోన‌య్యాడు. త‌న కొడుకును పెట్టి సినిమా తీశాడు . అదీ ఫెయిల్ అయ్యింది. నేనింతే త‌ర్వాత ఏ ఒక్క సినిమా ఆడ‌లేదు. చివ‌ర‌కు బాల‌య్య‌తో తీసిన పైసా వ‌...

బాబు, జ‌గ‌న్‌ల సంవాదం ..ఏపీ అసెంబ్లీలో గంద‌ర గోళం..!

చిత్రం
ఏపీ విధాన‌స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం చోటు చేసుకుంటోంది. ప‌దే ప‌దే స్పీక‌ర్ జోక్యం చేసుకోవాల్సి వ‌స్తోంది. స‌భ్యులు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు జ‌నానికి ఏవ‌గింపును క‌లిగించేలా చేస్తోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో ఏపీలో నిర్మించిన ప్ర‌జా వేదిక భ‌వనాన్ని అక్ర‌మంగా క‌ట్టారంటూ..జ‌గ‌న్ హ‌యాంలో కూల్చి వేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. ఇదే అంశంపై విధాన‌స‌భ‌లో వాడి వేడిగా చ‌ర్చ జ‌రిగింది. వ్య‌వ‌స్థ‌ను బాగు చేయాల‌న్న స‌త్ సంక‌ల్పంతో మేమున్నామని , దానిని అడ్డు కోవాల‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మే త‌ప్ప మ‌రొక‌టి కాదంటూ జ‌గ‌న్ నిండు స‌భ‌లో స్ప‌ష్టం చేశారు. దీంతో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు దీనికి అభ్యంత‌రం తెలిపారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి నిర్మిస్తే దానిని అక్ర‌మ‌మంటారా అంటూ నిల‌దీశారు. ఒక‌వేళ అది వ‌ద్ద‌నుకుంటే, వేరే కార్యాల‌యానికి ఇవ్వొచ్చు కదా అంటూ ప్ర‌శ్నించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా, అడ్డ‌గోలుగా త‌మ అస్మ‌దీయుల‌కు అప్ప‌నంగా కోట్లాది రూపాయ‌లు క‌ట్ట‌బెడుతూ దీనిని అక్ర‌మంగా నిర్మించార‌ని , అందుకే కూల్చి వేశామ‌ని తెలిపారు జ‌గ‌న్....

మోస్ట్ ఫేవ‌రబుల్ ఉమెన్‌గా అశ్విని అశోక‌న్

చిత్రం
భార‌తీయులు త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌తో ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేస్తున్నారు. దిగ్గ‌జ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, అడోబ్ , త‌దిత‌ర కంపెనీల‌న్నీ ఇండియ‌న్స్ చేతుల్లో ఉన్నాయి. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా 40 మంది మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప‌ర్స‌నాలిటీని  అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ సెల‌క్ష‌న్ లిస్టులో ఇండియాకు చెందిన వ్యూ కంపెనీ సిఇఓగా ఉన్న అశ్విని అశోక‌న్ కు చోటు ద‌క్కింది. కేవ‌లం 36 ఏళ్ల వ‌య‌స్సున్న ఈమె అతి త‌క్కువ కాలంలోనే కంపెనీని లాభాల బాట‌లో ప‌య‌నించేలా చేసింది. ఇన్వెంట‌రీ మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌ను ఉప‌యోగిస్తూ రిటైల్ బిజినెస్‌లో కంపెనీని టాప్ రేంజ్‌లో నిల‌బెట్ట‌డంలో అశ్విని కీల‌క భూమిక పోషించారు. సెంట్ర‌ల్ రిటైల్ డేటా బ్రెయిన్ పేరుతో ఆమె చేప‌ట్టిన ఆప‌రేష‌న్స్ కోట్లు కొల్ల‌గొట్టేలా చేశాయి. ఈ ప్రాసెస్ ట్రాన్సాక్ష‌న్స్ అంతా 180 దేశాల‌కు విస్త‌రించేలా చేసింది.  రిటైల్ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక చ‌రిత్ర‌ను సృష్టించేలా అశ్విని అశోక‌న్ క‌ష్ట‌ప‌డ్డారు. గ‌త ఏడాది 2018లో ఏకంగా 8 బిలియ‌న్ ప్రొడ‌క్ట్స్‌ను వ్యూ కంపెనీ ద్వారా అమ్మ‌గ‌లిగేలా చేస...

ఉత్కంఠ రేపుతున్న టీమిండియా ఎంపిక - నిలిచేదెవ్వ‌రు..ఆడేదెవ్వ‌రు..?

చిత్రం
ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా నాకౌట్ ద‌శ‌లో న్యూజిలాండ్ జ‌ట్టుతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌ను చేజేతులారా పోగొట్టుకుని..ఉన్న ప‌రువు పోగొట్టుకుని ఇండియాకు తిరిగి వచ్చిన భార‌త క్రికెట్ టీంలో ఎవ‌రు ఉంటార‌నే దానిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. బీసీసీఐ సెల‌క్ష‌న్ కమిటీ ఛైర్మ‌న్ అయిన ఎం.ఎస్.కె. ప్ర‌సాద్ అనుస‌రిస్తున్న తీరుపై కూడా ప‌లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. దీంతో ఏకంగా జ‌ట్టు కెప్టెన్, ఆట‌గాళ్లు..ముఖ్యంగా కోచ్ ర‌విశాస్త్రిలపై వేటు ప‌డే ఛాన్స్ ఉందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. త్వ‌ర‌లో వెస్టిండీస్ లో జ‌రిగే టూర్ కు టీమిండియా జ‌ట్టును ఎంపిక చేయాల్సి ఉండ‌గా అర్ధాంత‌రంగా వాయిదా ప‌డింది. ఆదివారం నాడు పూర్తి స్థాయి జ‌ట్టును ఎంపిక అవ‌కాశాలు ఉన్నాయి. టీం ఎంపిక ప్ర‌క్రియ‌లో ప‌లు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది అనూహ్యంగా జ‌రిగింది. ఎవ‌రూ ఊహించ‌లేదు. జ‌ట్టు ఎంపిక అన్న‌ది బిసీసిఐ సెల‌క్ష‌న్ కమిటీ ఛైర్మ‌న్‌కు క‌త్తి మీద సాములాగా మారింది. తుది జ‌ట్టు రూప‌క‌ల్ప‌న‌లో ఎవ‌రు ఉంటార‌న్న‌ది ప్ర‌శ్నార్థకంగా మారింది. ప్ర‌పంచ క‌ప్‌లో ఆడే టీం ఎంపిక ప్ర‌క్రియ అంతా లోప‌భూయిష్టంగా ఉందంటూ ఫ్యాన్స్ విరుచుకుప...