టీ బాక్స్ అదుర్స్..భారీగా ఇన్వెస్ట్ చేసిన ఎన్బీ వెంచర్స్
ఉదయం నుంచి రాత్రి పడుకునేంత దాకా శ్వాస పీల్చుకోకుండా ఉండలేరేమో కానీ ఛాయ్ తాగకుండా ఉండలేరు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రకరకాల ఫ్లేవర్స్‌లలో టీ దొరుకుతోంది. కోట్లాది మంది రోజూ తాగుతున్నారు. టీ తాగకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఇండియాలో ఏర్పాటైన టీ బాక్స్ స్వల్ప కాలంలోనే టాప్ రేంజ్‌లోకి చేరుకుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో పాటు భిన్నమైన టీ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తోంది. 100 రూపాయలని అనుకుంటే పొరపాటు పడినట్లే. ఈ టీబాక్స్ ద్వారా అమ్మే టీ పాకెట్ కొనుగోలు చేయాలంటే కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని టేస్ట్ అదుర్స్. అందుకే ఎనలేని డిమాండ్. ఒక్కసారి టీ బాక్స్ తయారు చేసిన తేయాకుతో టీ చేసుకుంటే ..జీవితాంతం మరిచి పోలేరు. దీంతో ప్రపంచ తేయాకు పరిశ్రమలో ఈ కంపెనీ దుమ్ము రేపుతోంది.
రోజు రోజుకు దీని ఆదాయం పెరుగుతుండడంతో .. ఎన్బీ వెంచర్స్ అండ్ ఇతర కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి టీ బాక్సులో. 2017 డిసెంబర్ నాటికి 7 మిలియన్లకు చేరుకుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే పనిలో నిమగ్నమైంది. దుబాయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ పెట్టుబడి పరంగా మొదటి శ్రేణిలో ఉన్న ఎన్‌బి వెంచర్స్ ఊహించని దానికంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఏడేళ్ల వయసు కలిగిన టీబాక్సు కంపెనీ..ఇండియాతో పాటు అమెరికా,రష్యా, తదితర దేశాలకు విస్తరించింది. ఒక బిలియన్ కప్పుల టీని 117 దేశాలకు విక్రయించి టీ బాక్సు రికార్డు బ్రేక్ చేసింది. దీని ఆదాయం బిలియన్ డాలర్లకు పెరిగింది. టీ బాక్సు ఎండ్ టు ఎండ్ సప్లయి చేస్తోంది.
తమ ఉత్పత్తులు జనానికి పరిచయం చేయాలనే ఉద్ధేశంతో టీ బాక్సు కొత్త ఐడియాకు శ్రీకారం చుట్టింది. ఉచితంగా తమ ప్రొడక్ట్స్ బాగున్నాయో లేదోననే పరీక్ష చేసేందుకు గాను బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని 200 ప్రాంతాలో ప్రత్యేకంగా టీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది టీ బాక్స్. భారీ ధరలు నిర్ణయించినా సరే కస్టమర్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. వారంతా ఈ కంపెనీ ఛాయ్ కావాలంటూ కోరుతున్నారు. వీరి డిమాండ్ పెరగడంతో పాటు టీబాక్స్ కు ఎనలేని క్రేజ్ ఉండడంతో తాము భారీ ఎత్తున పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఎన్బీ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీలేష్ భట్నాగర్ వెల్లడించారు. క్వాంటిటీ కంటే క్వాలిటీ పైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో తాము టాప్ రేంజ్‌కు చేరుకున్నామని ..ఎన్బీ తో పాటు ఇతర కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం ఆనందంగా ఉందన్నారు టీబాక్స్ సిఇఓ కౌశాల్ దుగార్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి