పోస్ట్‌లు

ఆగస్టు 25, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మహిళల కోసం ఢిల్లీ ఐఐటియన్స్ ప్యాడ్స్ తయారీ

చిత్రం
ప్రతి నెలనెలా వచ్చే నెలసరి సమయంలో మహిళలు ఉపయోగించే న్యాప్కిన్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఢిల్లీ ఐఐటి కి చెందిన విద్యార్థులు తయారు చేశారు. మార్కెట్ లో పేరొందిన కంపెనీలు తయారు చేసిన ప్యాడ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. స్టే ఫ్రీ , కంఫర్ట్, తదితర కంపెనీలు స్త్రీలకు మేలు కలిగించేలా రుమాళ్ళు (ప్యాడ్స్ ) తయారు చేస్తున్నాయి. కోట్లాది మంది మహిళలు, యువతులు, బాలికలు ప్రతి నెలా ఈ  రుతు సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వీటికి పరిష్కారం చూపేలా ప్రపంచంలో ప్రతి చోటా కంపెనీలు కొత్త రకంగా ప్యాడ్స్ తయారీలో పరిశోధనలు చేస్తున్నాయి. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వీటిని వాడడం వల్ల మహిళలు, బాలికలు తీవ్ర రోగాలకు గురవుతున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న దేశంలో సగానికి పైగా మహిళలు, యువతులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా వచ్చే నెలసరి కోసం న్యాప్కిన్స్ తప్పని సరి. తన భార్య ప్రతి నెలా పడుతున్న ఇబ్బందిని గుర్తించిన తమిళనాడుకు చెందిన మురుగనాథన్ తక్కువ ధరల్లో, నాణ్యమైన ప్యాడ్స్ ను తయారు చేశాడు. ఆయన చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు దేశ...

దుమ్ము రేపిన రహానే..తలవంచిన విండీస్..!

చిత్రం
ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా జట్టు టెస్ట్ మ్యాచ్ లోను వెస్ట్ ఇండీస్ ను ఓడించింది. ఏకంగా 318 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. అజింక్యే రెహానే సెంచరీతో చెలరేగి పోయాడు. మరో వైపు బుమ్రా అద్భుతంగా అయిదు వికెట్లు పడగొట్టాడు. 100 పరుగులకే విండీస్ కుప్ప కూలింది. టెస్ట్ సిరీస్ లోనూ భారత జట్టు శుభారంభం చేసింది. బుమ్రా దెబ్బకు ప్రత్యర్తి  ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా అయిదు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ, షమీ కూడా చెలరేగి పోయాడు. దీంతో 419 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ వంద పరుగులకే కుప్ప కూలింది. ఆ జట్టులో కీమర్ రోచ్ ఒక్కడే 38 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది విండీస్. అంతకు ముందు మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసిన ఇండియా జట్టు మరో 158 పరుగులు జోడించింది. ఏడు వికెట్లు కోల్పోయి 343 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద ఇండియన్ కెప్టెన్ కోహ్లీ ఆటను ముగిస్తున్నట్టు ప్రకటించాడు.అజింక్య రహానే విండీస్ బౌలర్ల భారతం పట్టగా. ఏకంగా సెంచరీ సాధించి చుక్కలు చూపించాడు. మరో వైపు తెలుగు కుర్ర...

అలౌకిక ఆనందం..కృష్ణ తత్వం..!

చిత్రం
ప్రపంచంలో హరే రామ హరే కృష్ణ ..కృష్ణ కృష్ణ హరే..అంటూ మెలమెల్లగా వినిపిస్తోంది. ఇలా లోకమంతటా వ్యాపించేలా చేసిన ఘనత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ఎక్కడ చూసినా వీరే దర్శనం ఇస్తారు. ఇతోధికంగా తమకు తోచిన రీతిలో సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు శ్రీకృష్ణుడు బోధనలను ప్రచారం చేస్తున్నారు. ఇస్కాన్ పేరుతో దేవాలయాలు, ఆశ్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దైవారాధన, సేవారాధన, భక్తిని ప్రసరింప చేయడం వీరి ఉద్దేశం. హైదరాబాద్ లోని అబిడ్స్ తో పాటు సికింద్రాబాద్ లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి రోజు పూజలు జరుపుతారు. ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఆదివారం కడుపు నిండా భోజనం, పాయసం పెడతారు. వీరి ఆధ్వర్యంలో దేశంలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే పేద పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన వారి ఆకలిని తీర్చే పనిని ప్రారంభించారు. అదే అక్షయపాత్ర. మొదట్లో కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ బృహత్తర పథకం దేశమంతటా విస్తరించింది. లక్షలాది మందికి ఉచితంగా, ఆకలితో అలమటించే పిల్లల ఆకలిని తీరుస్తోంది. ఇస్కాన్ ఈ రూపకంగా భారీ ప్రాజెక్ట్ ను విజయవంతంగా అమలు చేస్తోంది. దీని...

ఈ భూమి పుత్రుడు..చెరువుల పాలిట దేవుడు..!

చిత్రం
ప్రపంచానికి ఆధారం ఈ భూమి. ఇది లేకపోతే మానవ జాతి మనుగడ మరింత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే సకల మానవాళి ఇబ్బందులకు లోనవుతోంది. గాలి, నీరు , నేల అంతా కలుషితమవుతోంది. ఇండియాలో వ్యర్థాల దెబ్బకు కోట్లాది మంది చెప్పుకోలేని రోగాలకు లోనవుతున్నారు. భూమికి జీవనాధారమైన నీళ్లను ఒడిసి పట్టుకుని , పది కాలాల పాటు నిల్వ ఉంచుకునే వెసులుబాటు చెరువులు , సరస్సుల ద్వారా మాత్రమే కలుగుతుంది. ఇది కేవలం భారతీయులకు మాత్రమే చెల్లింది. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా ఈ తరహా చెరువులు, నీటి కుంటలు అగుపిస్తాయి. దీనినే నమ్ముకున్న రైతులు, ప్రజలకు తాగు, సాగు నీరు దొరుకుతోంది. వందేళ్లైనా ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి చెరువులు, నీటి కుంటలు, పిల్ల కాలువలు. రాను రాను సాంకేతికంగా పెను మార్పులు చోటు చేసుకోవడంతో చెరువుల, సరస్సుల  ఆధునికీకరణ జరుగుతోంది. అయినా పాలకుల అలసత్వం వల్ల, చాలా చెరువులు ఆక్రమణకు గురి కాగా , మరికొన్ని చిరునామా లేకుండా పోయాయి. వాటి స్థానంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. భూఆక్రమణ దారులకు అడ్డు లేకుండా పోయింది. ఇదే తరహా దేశమంతటా విస్తరించింది. రాబోయే తరాలకు నీరు దొరకని పరిస్థితి దాపురించింది....

మలిదశ పోరాటానికి మళ్ళీ రెడీ..!

చిత్రం
నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు మలి దశ పోరాటం చేయాలని తీర్మానం  చేశారు. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పసుపు పంటను పండిస్తారు ఇక్కడి రైతులు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించారు. అంతే కాకుండా దేశంలోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది. భారీ ఎత్తున రైతులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన ధర్మపురి అరవింద్ కవితపై ఘన విజయం సాధించారు. అంతకు ముందు నిజామాబాద్ జిల్లా రైతాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు , ఆందోళనలు , ధర్నాలు, సమ్మెలు  చేపట్టింది.  అంతే కాకుండా, శాంతి యుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన అన్నదాతలను అరెస్ట్ చేయడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వం దిగి వచ్చింది. తమ న్యాయపరమైన డిమాండ్ కోసం రోడ్డెక్కిన రైతులను అరెస్ట్ చేయడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు , మేధావులు, ప్రజాస్వామిక వాదులు అభ్యంతరం తెలిపారు. ...

మన సింధు ఇక బంగారం

చిత్రం
ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. కొన్నేళ్ల కల నెరవేరింది. ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎప్పటి నుంచో ఆశిస్తున్న పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది. తెలుగు తేజం సింధు సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో జపాన్ కు చెందిన క్రీడాకారిణి ఒకుహూరపై ఘన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో తొలి రౌండ్ లోనే అదరగొట్టింది. రెండో రౌండ్ లోనూ దూసుకు వెళ్ళింది సింధు. ప్రారంభం నుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పై చేయి సాధించింది. అభిమానులను అలరించింది. రెండవ పాయింట్ నుంచి తొమ్మిది పాయింట్ల వరకు వరుసగా చెలరేగింది. ఆట మధ్యలో ఒకుహర రెండు పాయింట్లు సాధించినా సింధు మళ్ళీ జోరు కొనసాగించింది. విజేతగా నిలిచింది. బలమైన షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ఏ స్థాయిలోను పోటీ పడలేక పోయింది ఒకుహర. ఇరవై నాలుగేళ్లున్న పీవీ సింధుకు చిన్ననాటి నుంచే బ్యాడ్మింటన్ అంటే అభిమానం. ఒలంపిక్ పోటీల్లో తన ప్రతిభ పాటవాలను ప్రదర్శించిన ఈ క్రీడాకారిణికి ఇదే టోర్నీ యెనలేని పేరును తీసుకు వచ్చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ సారధ్యంలో శిక్షణ తీసుకుంది. కా...

ఏపీ కేపిటల్ సిటీపై టీజీ కామెంట్స్ కలకలం

చిత్రం
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పటికే గందరగోల పరిస్థితులు నెలకొన్న సమయంలో బీజేపీకి చెందిన ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని గా ఉండదని, ఏపీని నాలుగు రాజధానులుగా చేస్తారని మరో వివాదానికి తెర తీశారు. ఇప్పటికే అమరావతిపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు అదే పార్టీకి చెందిన ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడారు. అయితే ఏపీలో జరిగి ప్రతి నిర్ణయం గురించి ప్రధాని, హోమ్ మంత్రిలకు సమాచారం ముందే ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు. మరో ట్విస్ట్ కు ఆజ్యం పోశారు. చంద్ర బాబు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో , ఇక అప్పటి నుంచి ఏపీ సీఎం జగన్ వేటాడటం మొదలు పెట్టారు. బాబు తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని రద్దు చేయడమో లేక నిలిపి వేయడమే చేస్తూ వస్తున్నారు. పోలవరం విషయంలో ఆయన ఇదే స్టాండ్ తీసుకున్నారు. కానీ గతంలో పనులు చేజిక్కించుకున్న నవయుగ నిర్మాణ కంపెనీని పనుల నుండి తప్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ సదరు కంపెనీ కోర్టుకు వెళ్ళింది. విషయాన్ని పూర్తిగా పరిశీలించిన ధర్మాసనం జగన్ తీసుకున్న నిర్ణయం తప్పు అని స్పష్టం చేసింది. నిరభ్యంతరంగా పనులు చేపట్టవచ్చంటూ...