ఈ భూమి పుత్రుడు..చెరువుల పాలిట దేవుడు..!
ప్రపంచానికి ఆధారం ఈ భూమి. ఇది లేకపోతే మానవ జాతి మనుగడ మరింత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే సకల మానవాళి ఇబ్బందులకు లోనవుతోంది. గాలి, నీరు , నేల అంతా కలుషితమవుతోంది. ఇండియాలో వ్యర్థాల దెబ్బకు కోట్లాది మంది చెప్పుకోలేని రోగాలకు లోనవుతున్నారు. భూమికి జీవనాధారమైన నీళ్లను ఒడిసి పట్టుకుని , పది కాలాల పాటు నిల్వ ఉంచుకునే వెసులుబాటు చెరువులు , సరస్సుల ద్వారా మాత్రమే కలుగుతుంది. ఇది కేవలం భారతీయులకు మాత్రమే చెల్లింది. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా ఈ తరహా చెరువులు, నీటి కుంటలు అగుపిస్తాయి. దీనినే నమ్ముకున్న రైతులు, ప్రజలకు తాగు, సాగు నీరు దొరుకుతోంది. వందేళ్లైనా ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి చెరువులు, నీటి కుంటలు, పిల్ల కాలువలు.
రాను రాను సాంకేతికంగా పెను మార్పులు చోటు చేసుకోవడంతో చెరువుల, సరస్సుల ఆధునికీకరణ జరుగుతోంది. అయినా పాలకుల అలసత్వం వల్ల, చాలా చెరువులు ఆక్రమణకు గురి కాగా , మరికొన్ని చిరునామా లేకుండా పోయాయి. వాటి స్థానంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. భూఆక్రమణ దారులకు అడ్డు లేకుండా పోయింది. ఇదే తరహా దేశమంతటా విస్తరించింది. రాబోయే తరాలకు నీరు దొరకని పరిస్థితి దాపురించింది. కొంతమంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాయి. అటు కరువుకు ఆలవాలమైన అనంతపురం జిల్లాలో , కర్ణాటకలో , మహారాష్ట్రలో వాటర్ షెడ్స్, నీటి కుంటలు, చెరువులను పునరుద్దరించే పనిలో పడ్డారు. అలాంటి వారిలో దేశం గర్వించే రీతిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆనంద్ మల్లిగవద్ చరిత్ర సృష్టించారు. కేవలం 45 రోజులలో ఎండి పోయిన చెరువులను, సరస్సులను బాగు చేసే పనిని భుజానికి ఎత్తుకున్నాడు.
ఏ అధికారులు, పాలకులు చేయలేని పనిని ఆయన చేసి చూపించాడు. తానే దగ్గరుండి వాటికి జీవం పోశాడు. మట్టిని, అడవిని , రైతులను ప్రేమించే ఇతడికి చెరువులంటే ప్రేమ. 2025 వరకు 45 చెరువులను బాగు చేయాలని కంకణం కట్టుకున్నాడు . పనులు జరుగుతూ ఉన్నాయి. ఆయన మొదటగా బెంగళూర్ లోని 36 ఎకరాల విస్తీర్ణం కలిగిన క్యాసనహళ్లి సరస్సును అభివృద్ధి చేశాడు. ఇదంతా కేవలం కొద్దీ రోజులు మాత్రమే పట్టింది. 2017 లో ఒక కోటి 17 లక్షల రూపాయలు సన్ సేరా ఫౌండేషన్ సాయం చేసింది. 74 ఏళ్ళ వయసు కలిగిన ముత్తురామన్ సాయంతో ఆనంద్ ఈ పనికి కుదిరాడు. మొదట ఆయన చేపట్టిన పనిని తేలికగా తీసుకున్నారు అక్కడి జనం. తీరా సరస్సు లో నీళ్లు వచ్చే సరికల్లా అతడికి జేజేలు పలుకుతున్నారు. దీనిని పునరుద్ధరించేందుకు నానా కష్టాలు పడ్డారు. ఇక్కడ చెట్లు, మొక్కలు నాటారు. చెత్త, చెదారాన్ని, మట్టిని తరలించారు. 5 వేలకు పైగా ప్లాంట్స్ నాటారు. ఇందులో 1500 మంది వాలంటీర్లు పాలుపంచుకున్నారు. మొత్తం మీద ఆనంద్ మల్లిగవద్ చేపట్టిన ఈ కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి