అవెంజర్స్ అదుర్స్ - రికార్డు స్థాయిలో భారీ వసూళ్లు

ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ విడుదలైన అవెంజర్స్ ..ఊహించని దానికంటే ఎక్కువగా భారీ వసూళ్లను సాధించింది. విడుదలైన మొదటి రోజే రికార్డు స్థాయిలో 1500 కోట్లను రాబట్టింది. ఇదివరకు ఉన్న వసూళ్ల రికార్డులను అధిగమిస్తోంది. ఇప్పటికే కోట్ల రూపాయలను దాటేసిన ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. విడుదలైన ప్రతి చోటా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వరల్డ వైడ్‌గా చూస్తే 21.66 కోట్ల డాలర్లు వసూలయ్యాయి. అంటే ఇండియన్ రూపీస్‌లోకి చూసుకుంటే... 1512 కోట్లకు పై మాటే. ఇది కూడా ఒక రికార్డే. ఒక్కరోజులో ఇన్ని డబ్బులు పోగేసు కోవడం ఈ సినిమాకే చెల్లింది. ఇదంతా అవెంజర్స్ డైరెక్టర్ సాధించిన సక్సెస్. ఒక్క చైనాలోనే ప్రివ్యూలు ప్రదర్శించగా వచ్చిన డబ్బులు చూస్తే..కళ్లు బైర్లు కమ్మాల్సిందే. వసూలైన మొత్తం డబ్బులు 750 కోట్లు సాధించిందని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఇక ఇండియా విషయానికి వస్తే ..బాహుబలి సినిమా వసూళ్లను అవెంజర్స్ దాటేస్తుందని సినీ పండితుల విశ్లేషిణ. ఉత్తర అమెరికాలో విడుదల కావడంతో అక్కడ 28 కోట్ల...