అవెంజర్స్ అదుర్స్ - రికార్డు స్థాయిలో భారీ వసూళ్లు
ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ విడుదలైన అవెంజర్స్ ..ఊహించని దానికంటే ఎక్కువగా భారీ వసూళ్లను సాధించింది. విడుదలైన మొదటి రోజే రికార్డు స్థాయిలో 1500 కోట్లను రాబట్టింది. ఇదివరకు ఉన్న వసూళ్ల రికార్డులను అధిగమిస్తోంది. ఇప్పటికే కోట్ల రూపాయలను దాటేసిన ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. విడుదలైన ప్రతి చోటా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వరల్డ వైడ్‌గా చూస్తే 21.66 కోట్ల డాలర్లు వసూలయ్యాయి. అంటే ఇండియన్ రూపీస్‌లోకి చూసుకుంటే... 1512 కోట్లకు పై మాటే. ఇది కూడా ఒక రికార్డే. ఒక్కరోజులో ఇన్ని డబ్బులు పోగేసు కోవడం ఈ సినిమాకే చెల్లింది. ఇదంతా అవెంజర్స్ డైరెక్టర్ సాధించిన సక్సెస్. ఒక్క చైనాలోనే ప్రివ్యూలు ప్రదర్శించగా వచ్చిన డబ్బులు చూస్తే..కళ్లు బైర్లు కమ్మాల్సిందే. వసూలైన మొత్తం డబ్బులు 750 కోట్లు సాధించిందని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది.
ఇక ఇండియా విషయానికి వస్తే ..బాహుబలి సినిమా వసూళ్లను అవెంజర్స్ దాటేస్తుందని సినీ పండితుల విశ్లేషిణ. ఉత్తర అమెరికాలో విడుదల కావడంతో అక్కడ 28 కోట్ల డాలర్లు అంటే 1955 కోట్లకు చేరొచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూవీ భారత్‌లో బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలో 80 నుంచి 85 శాతం ఆ సినిమానే ఆక్రమించేసింది. బాహుబలి 2, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ నెలకొల్పిన రికార్డు కలెక్షన్స్ 122 కోట్లు, 52 కట్లను దాటేసి దేశగా ఈ సినిమా దూసుకెళుతోంది. ఒక్క బుక్ మై షో ద్వారా ఇప్పటికే 25 లక్షల టికెట్లు అమ్ముడు పోవడం ఓ రికార్డ్. బాహుబలి 6 వేల 500, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ 5 వేల స్క్రీన్లతో విడుదల కాగా అవేంజర్ ఎండ్ గేమ్ మాత్రం 2 వేల 845 స్క్రీన్లతో విడుదలైంది. అమెరికాలో 4 వేల 600 స్క్రీన్లతో రిలీజ్ అయింది. ఈ మూవీని తీసేందుకు 40 కోట్ల డాలర్లు ఖర్చు చేశారు.
అంటే 2 వేల 800 కోట్లు ఖర్చయింది. రెండు రోజుల్లోనే ఆ సినిమా కోసం ఖర్చు చేసిన డబ్బులన్నీ తిరిగి రానున్నాయన్నమాట. ఈ సినిమా నిర్మాతలు న్యూ టెక్నాలజీని వాడారు. మెల మెల్లగా సినిమా పట్ల హైప్ పెంచారు. పోస్టర్లను ఒక్కటొక్కటిగా విడుదల చేశారు. కథలోని విశేషాలను చూపిస్తూ..ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. దీంతో జనం తండోప తండాలుగా రోడ్లపైకి వచ్చారు. సినిమాను ఓన్ చేసుకున్నారు. చైనాలో మొదటి సారిగా ఈ సినిమా కోసం బ్లాక్ లో టికెట్లు అమ్మారు. సహజంగా టికెట్ ధర 600 రూపాయలు వుంటే ..ఈ సినిమా దెబ్బకు 5 వేలకు ఒక టికెట్ అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో 49 కోట్లు, దక్షిణ కొరియాలో 59 కోట్లు, ఫ్రాన్స్‌లో 42 కోట్లు వసూలు చేసింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే వసూళ్లు 5 వేల కోట్లకు పైగా చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయని సినీ వర్గాల అంచనా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి