ఆదాయంలో టాప్ - ఐటీలో ఎంఎస్ బెటర్
ప్రపంచ ఐటీ దిగ్గజాల సరసన మైక్రోసాఫ్ట్ కంపెనీ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. సత్య సారథ్యంలోని ఈ కంపెనీ మరో రికార్డును స్వంతం చేసుకుంది. ఈ ఇంటర్నేషనల్ కంపెనీ మార్కెట్ విలువ ఒక్కసారిగా పెరిగి పోయింది. దీంతో దానిలో భాగస్వాములైన వారి ఆదాయం గణనీయంగా ..ఉన్నపళంగా పెరిగింది. మొట్టమొదటి సారిగా లక్ష కోట్ల డాలర్లను దాటింది. భారతీయ రూపాయల పరంగా చూస్తే దాని విలువ 70 లక్షల కోట్లు అన్నమాట. ఈ ఘనత సాధించిన మూడో టెక్నాలజీ కంపెనీగా మైక్రోసాఫ్ట్ చరిత్ర నమోదు చేసింది. ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అమెరికాలోని వాల్ స్ట్రీట్ వర్గాలలో ఉత్సాహం చోటు చేసుకుంది.
మరో వైపు స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. ప్రారంభంలోనే ట్రేడింగ్‌లో కంపెనీకి చెందిన షేర్లు 5 శాతం పెరిగాయి. ఒక్కో షేరు విలుల 130. 59 డాలర్లకు చేరుకుంది. మిగతా ఐటీ కంపెనీలను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎంఎస్ తో పాటు మిగతా కంపెనీలు పోటీ పడుతున్నాయి. రోజు రోజుకు టెక్నాలజీ మారుతోంది. దానికి అనుగుణంగా కంపెనీలు తమ పనులు మరింత సులభతరం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ కొత్తగా టెక్నాలజీని రూపొందించింది. ఇదే ఆ కంపెనీకి లాభసాటి వ్యాపారంగా మారింది.
ట్రేడింగ్‌లో అప్ అండ్ డౌన్స్ జరగడం మామూలే. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. యాపిల్, అమెజాన్ అమెరికన్ కంపెనీల కంటే ముందుండడం విశేషం. అయితే గత సంవత్సరంలో ఆ రెండు కంపెనీలు లక్ష కోట్ల డాలర్లను దాటాయి. తిరిగి మార్కెట్ దెబ్బకు ఆదాయం తగ్గింది.
నెంబర్ గేమ్స్ గురించి తాము పట్టించు కోమని..నాణ్యమైన సేవలు అందించడమే తమ ముందున్న లక్ష్యమని గూగుల్ సిఇఓ స్పష్టం చేశారు. ప్రపంచంలోని ప్రతి వంద మందిలో 90 మందికి పైగా తమనే వాడుతున్నారని వెల్లడించారు. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిజినెస్ సర్వీసెస్ విభాగం ఒక్కటే మైక్రోసాఫ్ట్ కు లాభాలను ఆర్జించి పెడుతోంది. సత్య నాదెళ్ల సిఇఓగా బాధ్యతలు చేపట్టాక ..మైక్రోసాఫ్ట్ మెల మెల్లగా పుంజుకుంటోంది. ఎంటర్ ప్రైజ్ మొబిలిటి ప్రొడక్టు యూజర్ల సంఖ్య 10 కోట్లకు దాటింది. ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్ వేర్ కంపెనీలకు మొబైల్ డివైజ్‌ల సెక్యూరిటీ, ట్రాకింగ్ కోసం ఇది మంచి ఉపయోగకారికంగా ఉంటుంది. ఇంకో వైపు టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీలు ..ఐటీ దిగ్గజ కంపెనీలకు ధీటుగా ఎదిగేందుకు యత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నం మంచిదే. కొత్తగా కంపెనీలు ఏర్పాటైతే..వేలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి